- వైద్య సిబ్బందిపై కలెక్టర్ గరం గరం
- పెదబయలు పీహెచ్‌సీలో మందులు కొరతపై ఆగ్రహం
- నెలాఖరుకు డాక్టర్ల నియామకం
- మన్యంలో సుడిగాలి పర్యటన
పెదబయలు/ముంచింగ్‌పుట్టు: న్యూస్‌లైన్: జిల్లా కలెక్టర్ సల్మాన్ ఆరోఖ్యరాజ్ బుధవారం విశాఖ మన్యంలో సుడిగాలి పర్యటన జరిపా రు. ఆస్పత్రులను సందర్శించి పరిస్థితిని పరిశీ లించారు. పెదబయలు పీహెచ్‌సీని కలెక్టర్ తని ఖీ చేసి ఇంత వరకు వచ్చిన మలేరియా కేసు లు, రక్తపూతల సేకరణ, మందుల నిల్వలు, ఆస్పత్రి అభివృద్ధి నిధుల గురించి వాకబు చేశారు.
పీహెచ్‌సీలో మందుల కొరత ఉండడంతో మొదట ఫార్మాసిస్ట్ రాజేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.అలాగే పీహెచ్‌సీలో నీటి సదుపాయం, ఇతర సదుపాయాలు లేకపోవడంతో రూ. 90 వేలు ఆస్పత్రి అభివృద్ధి నిధులు ఎందుకు ఖర్చు చేయడం లేదని ఏడీఎంహెచ్‌వో లీలాప్రసాద్ ను నిలదీశారు. తరువాత మారుమూల రూడకోట సీహెచ్‌సీని పరిశీలించారు. పీహెచ్‌సీలో ఒక్క స్టాఫ్‌నర్స్ మాత్రమే ఉండడం, ఇన్‌చార్జీ ఉన్నా విధుల్లో లేకపోవడంతో డీఎంహెచ్‌వో శ్యామలను ప్రశ్నించారు.
పూర్తి స్థాయి వైద్యాధికారి నియమించాలని గ్రామస్తులు కోరడంతో వారం రోజుల్లో నియమిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. రూడకోట సంతబయలు గ్రామస్తుల సమస్యలు అడిగితెలుసుకున్నారు. అంతకు మందు గంపరాయి గ్రామంలో మలేరియా దోమల నివారణ మందు పిచికారిని పరిశీలించారు. గంపరాయి ఆరోగ్య ఉపకేంద్రం భవనా న్ని నిర్మించాలని సర్పంచ్ కమలాకర్ కోరారు.
నెలాఖరుకు డాక్టర్ల నియామకం
ముంచంగిపుట్టు పీహెచ్‌సీని తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందులపై వివరాలు అడిగితెలుసుకున్నారు. వ్యాధులపై సిబ్బందితో ప్రతి వారం సమీక్ష జరిపి ఐటీడీఏ పీవోకు నివేదిక అందజేయాలని వైద్యాధికారిని ఆదేశించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ మన్యంలో వైద్యాధికారులు లేని పీహెచ్‌సీలకు ఈ నెలాఖరుకల్లా డాక్టర్లను నియమిస్తామన్నారు.
మన్యంలో రూ.8 కోట్లు ఐఏపీ నిధులతో తాగు నీటి సౌకర్యాం కల్పిస్తామని చెప్పా రు. పీహెచ్‌సీలో వైద్యాధికారులు సక్రమంగా అందుబాటులో ఉండటం లేదని, స్ధానిక చెరువు సమీపంలో ప్రభుత్వా భూములలో ఆక్రమకట్టడాలు నిలుపుదల చేయాలని కించాయిపుట్టు ఎంపీటీసీ కె.గాసిరావు కలెక్టర్‌ను కోరా రు. ఆక్రమకట్టడాలపై చర్యలు చేపట్టాలని ఆర్‌డీవో రాజకుమారిని ఆదేశించారు. ఆయన వెంట పీవో వినయ్ చంద్, మలేరియా నివారణాధికారి ప్రసాద్ రావు, ఎంపీడీవో ఎం.ఎస్.బాపిరాజు ఉన్నారు.