థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే పొగలో బోలెడంత కార్బన్‌డయాక్సైడ్ ఉంటుంది. భూతాపోన్నతి నేపథ్యంలో ఈ విషవాయువులను తొలగించేందుకు టెక్నాలజీలు ఉన్నా.. వ్యయప్రయాసల దృష్ట్యా అవి అంత ప్రాచుర్యంలోకి రాలేదు. ఈ నేపథ్యంలో మిషిగన్ టెక్నలాజికల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గాలిలో నుంచి కార్బన్‌డయాక్సైడ్ తొలగింపును లాభసాటి చేయగల ఆవిష్కరణ ఒకటి చేశారు. కార్బన్‌డయాక్సైడ్‌ను ఆక్సాలిక్ యాసిడ్‌గా మార్చడం ఇందులో కీలకమైన విషయం. ముడి ఖనిజం నుంచి కొన్ని అరుదైన మూలకాలను వెలికి తీసేందుకు ఈ ఆక్సాలిక్ యాసిడ్‌ను ఉపయోగిస్తారు. సెల్‌ఫోన్లలో ఉపయోగించే ఈ మూలకాల ఉత్పత్తి చైనాలోనే జరుగుతోంది.
ఈ నేపథ్యంలో మిషిగన్ శాస్త్రవేత్తలు ఈ సరికొత్త ఆవిష్కరణ చేయడం విశేషం. సోడియం కార్బొనేట్ ద్వారా పంపినప్పుడు విద్యుత్ ప్లాంట్ నుంచి వెలువడే వాయువుల్లోని కార్బన్‌డయాక్సైడ్ గణనీయంగా తగ్గిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త కవాత్ర తెలిపారు. మరింత తగ్గించేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నామని, మిగిలిన అవశేషాల ద్వారా ఆక్సాలిక్ యాసిడ్‌ను తయారు చేయవచ్చునని ఆయన చెప్పారు. ఈ ప్రక్రియ ద్వారా మరింత ఎక్కువ విష వాయువును తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ పద్ధతి ఇప్పటికే ఉపయోగిస్తున్న దానికంటే పది రెట్లు తక్కువ ఖర్చుతో పనిచేస్తుందని వివరించారు.
విషవాయువుకు కొత్త ఉపయోగం
Published Wed, Feb 27 2019 1:02 AM | Last Updated on Wed, Feb 27 2019 1:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment