కార్బన్‌డయాక్సైడ్ మొదలుకొని మనకు హాని కలిగించే అన్ని రకాల కాలుష్యాలనూ అనాయాసంగా పీల్చేసే సూక్ష్మజీవులను టెక్సస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. కాలిఫోర్నియా జలసంధి ప్రాంతంలో సముద్రపు అట్టడుగున జరిపిన పరిశోధనల్లో ఒకటి కాదు.. రెండు కాదు.. కొన్ని డజన్ల కొత్తరకం సూక్ష్మజీవులను వీరు గుర్తించారు. వీటిల్లో కొన్ని పెట్రోలు, డీజిల్ వంటి హైడ్రోకార్బన్లను ఆహారంగా తీసుకునేవి. నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం ప్రకారం ఈ బ్యాక్టీరియా జన్యుపరంగా చాలా ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. సముద్రపు అడుగుభాగంలో మీథేన్, ప్రోపేన్, బ్యూటేన్ వంటి హైడ్రోకార్బన్లు నేరుగా వాతావరణంలోకి విడుదల కాకుండా ఈ సూక్ష్మజీవులు అడ్డుకుంటున్నాయని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త బ్రెట్ బేకర్ అంటున్నారు.
దాదాపు రెండు వేల మీటర్ల దిగువన 200 డిగ్రీ సెల్సియస్ వేడి వాతావరణంలో తాము జరిపిన అన్వేషణ ఫలితంగా దాదాపు 551 కొత్త జన్యుక్రమాలను గుర్తించడం వీలైందని, వీటిల్లో కనీసం 22 ఇప్పటి వరకూ ఎవరికీ తెలియనివని ఆయన వివరించారు. సూక్ష్మజీవుల్లో ఇప్పటివరకూ మనిషి గుర్తించింది కేవలం 0.1 శాతం మాత్రమేనని.. మిగిలిన వాటిని కూడా గుర్తిస్తే కాలుష్యం, ఇంధన సమస్యలకు బ్యాక్టీరియా ఆధారిత పరిష్కారాలు లభిస్తాయని శాస్త్రవేత్తల అంచనా. గయమాస్ బేసిన్‌లో గుర్తించిన కొత్త బ్యాక్టీరియాను సమర్థంగా వాడుకోగలిగితే వాతావరణంలోని కాలుష్యకారక వాయువుల సాంద్రతను
కాలుష్యాలను భోంచేసే బ్యాక్టీరియా
Published Thu, Nov 29 2018 12:44 AM | Last Updated on Thu, Nov 29 2018 12:44 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment