లక్నో: కేంద్ర ప్రభుత్వంపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. మణిపూర్‌లో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటే కేంద్రం ఎందుకు జీ20 సదస్సును అక్కడ నిర్వహించట్లేదని ప్రశ్నించారు. ఈ మేరకు 'జీ20 కా చునావ్ కనెక్షన్' సెషన్‌లో భాగంగా ఆయన మాట్లాడారు.
'దేశవ్యాప్తంగా జీ20 సెషన్‌లను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీలతో సహా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. కానీ మణిపూర్ సమస్యపై సరిగా స్పందించడం లేదు. అక్కడ పరిస్థితులు సాధారణ స్థాయికి చేరాయని నాయకులు చెబుతున్నారు. నిజంగా అక్కడ అల్లర్లు లేకపోతే ప్రస్తుతం జరిగే జీ20 మీటింగ్‌లను మణిపూర్‌లో నిర్వహించవచ్చు.' అని అఖిలేష్ యాదవ్ అన్నారు.
మణిపూర్ సమస్యపై ప్రతిపక్షాలు ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని పట్టుబట్టాయి. ప్రధాని మోదీ ఈ సమస్యపై స్పందించాలని కోరారు. అటు.. కేంద్రంపై అవిశ్వాస తీర్మాణాన్ని కూడా ప్రవేశపెట్టాయి. అయితే.. ఈ తీర్మాణంపై కేంద్రం తన బలాన్ని నిరూపించుకుంది.
ఇదీ చదవండి: ఆయుష్మాన్ భారత్‌పై ప్రశంసలు కురిపించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్
Comments
Please login to add a commentAdd a comment