Akhilesh Das
-
చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించండి
సాక్షి, అమరావతి: చంద్రబాబు అరెస్టయినా జాతీయ పార్టీల నాయకులు ఎవరూ పట్టించుకోకపోవడంతో టీడీపీ నేతలు రంగంలోకి దిగి ఎలాగైనా వారితో మాట్లాడించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ నేతలు లాబీయింగ్ చేసి మరీ స్పందించాలని కోరడంతోనే పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్, అకాలీదళ్ నేత సుఖబీర్‌సింగ్ బాదల్ స్పందించినట్టు తెలుస్తోంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు అరెస్టయి నాలుగురోజులైనా ఆయనకు జాతీయ స్థాయిలో కనీసమద్దతు లభించలేదు. ఎవరూ స్పందించకపోవడంతో పలువురు టీడీపీ నేతలు రంగంలోకి దిగి ఢిల్లీ స్థాయిలో జాతీయ పార్టీల నేతలతో లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. చంద్రబాబు అనుయాయుడు కంభంపాటి రామ్మోహనరావు ఢిల్లీలో తనకు తెలిసిన వారందరినీ కలిసి చంద్రబాబు అరెస్ట్‌పై మాట్లాడాలని కోరుతున్నట్టు తెలిసింది. తనకు తెలిసిన ఎంపీల ద్వారా మమతా బెనర్జీని బతిమలాడటంతో ఆమె మొక్కుబడిగా స్పందించారు. అఖిలేశ్‌ను కూడా టీడీపీ నేతలు ఒత్తిడి చేయడంతో ఆయన ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది. సుఖబీర్‌సింగ్ బాదల్ కూడా లాబీయింగ్ వల్లే మూడురోజుల తర్వాత స్పందించారు. పట్టించుకోని జాతీయ పార్టీలు వివిధ జాతీయపార్టీలు, నేతలతో చంద్రబాబుకు సంబంధాలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండగా జాతీయ రాజకీయాల్లో ఆయన క్రియాశీలకంగా పనిచేశారు. జాతీయ రాజకీయాలను ఎప్పుడూ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు, అవకాశవాదం కోసం ఉపయోగించడంతో ఆయన నమ్మదగని నేతగా ముద్రపడ్డారు. ప్రస్తుతం అన్ని పార్టీలు ఆయన్ను దూరం పెట్టాయి. అటు ఎన్డీయే దగ్గరకు రానీయడం లేదు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కూడా ఆయన్ను పట్టించుకోవడం లేదు. ఏ కూటమిని అయినా తన రాజకీయ అవసరాల కోసమే వాడుకోవడంతో ఇప్పుడు ఆయన దేశ రాజకీయాల్లో ఏకాకిగా మారిపోయారనే వాదన వినిపిస్తోంది. మద్దతు కోసం ఢిల్లీలో లాబీయింగ్ చంద్రబాబు అనుయాయుడు కంభంపాటి, బీజేపీలోని ఆయన కోవర్టులు సీఎం రమేష్, సుజనాచౌదరి వంటి నేతలు చంద్రబాబుకు అనుకూలంగా లాబీయింగ్‌కు దిగారు. అయినా ఆశించినస్థాయిలో జాతీయనేతలు చంద్రబాబుకు మద్దతు పలకలేదు. కనీసం మరికొంత మందితో అయినా ట్వీట్లు చేయించాలనే ఉద్దేశంతో ఢిల్లీలో తంటాలు పడుతున్నట్టు తెలుస్తోంది. -
'మణిపూర్‌లో జీ20 సదస్సును జరపండి'
లక్నో: కేంద్ర ప్రభుత్వంపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. మణిపూర్‌లో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటే కేంద్రం ఎందుకు జీ20 సదస్సును అక్కడ నిర్వహించట్లేదని ప్రశ్నించారు. ఈ మేరకు 'జీ20 కా చునావ్ కనెక్షన్' సెషన్లో భాగంగా ఆయన మాట్లాడారు. 'దేశవ్యాప్తంగా జీ20 సెషన్లను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీలతో సహా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. కానీ మణిపూర్ సమస్యపై సరిగా స్పందించడం లేదు. అక్కడ పరిస్థితులు సాధారణ స్థాయికి చేరాయని నాయకులు చెబుతున్నారు. నిజంగా అక్కడ అల్లర్లు లేకపోతే ప్రస్తుతం జరిగే జీ20 మీటింగ్‌లను మణిపూర్‌లో నిర్వహించవచ్చు.' అని అఖిలేష్ యాదవ్ అన్నారు. మణిపూర్ సమస్యపై ప్రతిపక్షాలు ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని పట్టుబట్టాయి. ప్రధాని మోదీ ఈ సమస్యపై స్పందించాలని కోరారు. అటు.. కేంద్రంపై అవిశ్వాస తీర్మాణాన్ని కూడా ప్రవేశపెట్టాయి. అయితే.. ఈ తీర్మాణంపై కేంద్రం తన బలాన్ని నిరూపించుకుంది. ఇదీ చదవండి: ఆయుష్మాన్ భారత్‌పై ప్రశంసలు కురిపించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ -
కోటి రూపాయల ఆఫర్! : మాయావతి సంచలన ఆరోపణలు
లక్నో: మరోసారి రాజ్యసభకు పంపిస్తే 100 కోట్ల రూపాయలు ఇస్తానని సొంత పార్టీ ఎంపీనే తనకు ఆఫర్ ఇచ్చారని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)అధినేత్రి మాయావతి బుధవారం సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు అఖిలేశ్ దాస్ చేసిన ఈ ప్రతిపాదనను తాను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చినట్లు ఆమె చెప్పారు. వంద కాదు రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చినా టికెట్ ఇచ్చేది లేదని అతనికి తేల్చిచెప్పినట్లు తెలిపారు. లక్నో మాజీ మేయర్‌గా కూడా చేసిన అఖిలేశ్ దాస్ 2008లో కాంగ్రెస్ పార్టీని వీడి బీఎస్పీలో చేరారు. రెండు రోజుల క్రితమే అతనిని బీఎస్పీ నుంచి తొలగించారు. ఇదిలా ఉండగా, ఈ నెల 20న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీ తరపు అభ్యర్థులుగా వీర్‌సింగ్, రాజారాంలను మాయావతి ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో బీఎస్పీకి ఉన్న సభ్యుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే వారిద్దరూ రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం ఉంది. **