ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారానికి భారత్‌తో కలిసి పని చేస్తాం | US Says It Hopes To Work Closely With India To End Russia | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారానికి భారత్‌తో కలిసి పని చేస్తాం

Published Sat, Mar 4 2023 5:34 AM | Last Updated on Sat, Mar 4 2023 5:34 AM

US Says It Hopes To Work Closely With India To End Russia - Sakshi

వాషింగ్టన్‌:  జీ20 సదస్సు ఆతిథ్య దేశంగా భారత్‌ ప్రత్యేకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అమెరికా అభిప్రాయపడింది. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించడానికి రష్యాతో తనకున్న చిరకాల సత్సంబంధాలను భారత్‌ వినియోగించుకోవాలని చెప్పింది. ఈ సంక్షోభాన్ని వీలైనంత త్వరగా ముగించడానికి తాము కూడా సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది.

జీ20 విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం ఉక్రెయిన్‌ యుద్ధంపై ఏకాభిప్రాయానికి రావడంలో విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ విలేకరులతో మాట్లాడుతూ జీ20 సదస్సు ప్రారంభమయ్యే లోపు ఉక్రెయిన్‌ యుద్ధంపై ఒక పరిష్కార మార్గం దొరుకుతుందని ఆశిస్తున్నట్టుగా తెలిపారు. ఇందుకోసం విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత్‌ ఒక దారి చూపించిందని ఈ ఏడాది కాలంలో ఇంకా చేయాల్సింది చాలా ఉందని అన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement