
సంస్కరణలకు వ్యతిరేకత సహజమే: మోదీ
సంస్కరణలకు వ్యతిరేకత సహజమని, రాజకీయ ఒత్తిళ్లు అధిగమించి అమలు చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
బ్రిస్బేన్: సంస్కరణలకు వ్యతిరేకత సహజమని, రాజకీయ ఒత్తిళ్లు అధిగమించి అమలు చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆస్ట్రేలియాలో శనివారం ఆరంభమైన జీ 20 సదస్సులో మోదీ ప్రసంగించారు.
నల్లధనం వల్ల దేశం ఎదుర్కొంటున్న సమస్యలను మోదీ ప్రస్తావించారు. నల్లధనం దేశ భద్రతకు సవాల్ అని, విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి రప్పించడానికి సమన్వయ సహకారం అవసరమని మోదీ పేర్కొన్నారు.