ఢిల్లీ: 2001 నాటి పార్లమెంట్‌పై ఉగ్రదాడిని గుర్తు చేశారు ప్రధాని మోదీ. ప్రపంచం మొత్తం ఉగ్రవాదంతో బాధపడుతోందని చెప్పారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఉగ్రవాద నిర్వచనంపై ఏకాభిప్రాయం సాధించకపోవడం బాధాకరమని అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి మనం ఎలా కలిసి పని చేయాలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పార్లమెంటులు ఆలోచించాలని ప్రధాని మోదీ అన్నారు. ఈ మేరకు ఢిల్లీలో 9వ G20 పార్లమెంటరీ స్పీకర్ల సమ్మిట్ (P20)ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
భారత్ సరిహద్దులో ఉగ్రవాదంతో ఎన్నో ఏళ్లుగా పోరాడుతోందని చెప్పిన ప్రధాని మోదీ.. ఉగ్రవాదంతో ప్రపంచం మొత్తం అతిపెద్ద సవాళును ఎదుర్కొంటోందని అన్నారు. మానవత్వానికి ఇది వ్యతిరేకమని చెప్పారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై స్పందించిన మోదీ.. ఘర్షణలు, నిర్బంధాలు సరైన ప్రపంచాన్ని సృష్టించబోవని తెలిపారు.
పార్లమెంటరీ విధానాల పట్ల ప్రధాని మోదీ స్పందించారు. ప్రపంచం పార్లమెంటరీ విధానాల సంగమమని అన్నారు. ఈ విధానాలు మరింత బలోపేతమవుతున్నాయని చెప్పారు. జీ20 అధ్యక్ష బాధ్యతల నేపథ్యంలో ఏడాదంతా మనం సంబరాలు చేసుకున్నామని గుర్తుచేశారు. భారత్ 17 సార్వత్రిక ఎన్నికలను నిర్వహించిందని, 300 సార్లు రాష్ట్ర ఎన్నికలు జరిపినట్లు స్పష్టం చేశారు. పాన్ ఆఫ్రికన్ పార్లమెంట్ కూడా మొదటిసారి పీ20 సమ్మిట్‌లో పాల్గొంది. జీ20 విభాగంలో పాన్ ఆఫ్రికన్ ఇటీవలే చేరిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: ఆపరేషన్ అజయ్: ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరిన మొదటి విమానం
Comments
Please login to add a commentAdd a comment