new division
-
కొత్త విభాగాల్లోకీ ఆడిట్ విస్తరణ
పంజిమ్: కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కొత్త విభాగాల్లోనూ ఆడిటింగ్‌ను పరిశీలిస్తోంది. నీడి అడుగున వెలికితీత కార్యకలాపాలకు సంబంధించి కూడా ఆడిటింగ్ చేయనున్నట్టు, మరిన్ని నివేదికలను విడుదల చేయాలని అనుకుంటున్నట్టు కాగ్ గిరీష్ చంద్ర ముర్ము చెప్పారు. జీ20 దేశాలతో కూడిన ఎస్ఐ20 మూడు రోజుల సమావేశం ముగిసిన అనంతరం మీడియా సమావేశంలో కాగ్ గిరీష్ చంద్ర మాట్లాడారు. డేటా ప్రామాణీకరణ అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. దీనివల్ల ఆడిట్లను మరింత సులభంగా, వేగంగా చేయవచ్చన్నారు. ఇందుకు సంబంధించి ఆయా విభాగాలు, శాఖలతో సమావేశం కూడా నిర్వహించినట్టు చెప్పారు. ‘‘కొంత వరకు డేటా ప్రామాణీకరణ పట్ల అంగీకారం కుదిరింది. గతేడాదే పదేళ్ల రికార్డును అధిగమించాం. ఆడిట్ నివేదికలను మరిన్ని విడుదల చేస్తాం. డేటా ప్రాసెసింగ్, నివేదిక రూపకల్పన మరింత వేగాన్ని అందుకుంటుంది. నివేదికల రూపకల్పనలో పూర్తి స్థాయి డిజిటలైజేషన్‌ను (డిజిటల్ ఆడిట్లు) వినియోగించుకుంటాం’’అని గిరీష్ చంద్ర తెలిపారు. కాగ్ ఈ ఏడాది నుంచే డిటజిటల్ ఆడిట్ల విడుదలను ప్రారంభించడం గమనార్హం. వివిధ శాఖల పరిధిలో నిధుల కేటాయింపులు, వినియోగం పద్దులపై కాగ్ ఆడిటింగ్ చేసి, పార్లమెంటు, ఆయా రాష్ట్రాల అసెంబ్లీల ముందు నివేదికలను ఉంచుంతుంది. షిప్పింగ్, నీటి అడుగు నుంచి వెలికితీసే ఆయిల్ అండ్ గ్యాస్ తదితర నూతన విభాగాల్లోనూ ఆడిట్ చేయాలన్నది తమ ఉద్దేశమ్యని గిరీష్ చంద్ర చెప్పారు. కాగా, బ్లూ ఎకానమీ (సముద్రం ఆధారిత) ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పై ఈ సమావేశం చర్చించింది. -
‘అప్పటి వరకు ఆమరణ నిరాహార దీక్ష’
సాక్షి, సిద్ధిపేట : చేర్యాలను డివిజన్‌గా మార్చే వరకు అమరణ నిరాహార దీక్ష చేస్తానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్ల, నారాయణపేట్ వంటి ప్రాంతాలను జిల్లా చేసిన కేసీఆర్ చేర్యాల డివిజన్ చేయడంలో ఎందుకు చిన్న చూపు చూస్తున్నారని ప్రశ్నించారు. మంగళవారం ఎంపీ సిద్దిపేటలో మాట్లాడుతూ.. తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమాల్లో చేర్యాల ఉద్యమ గడ్డగా పేరుగాంచిందని తెలిపారు. బైరాన్‌పల్లిలో ఒకే రోజు 300 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారని గుర్తు చేశారు. మరోసారి చేర్యాల నుంచి ఉద్యమానికి శ్రీకారం చుడుతామని పేర్కొన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమంలో చేర్యాల ప్రాంత ప్రజలే తూటాలకు బలయ్యారని, 2001 తెలంగాణ ఉద్యమంలో చేర్యాల ప్రాంత ప్రజల కృషి మరువలేనిదని ప్రశంసించారు. జనగామ నియోజకవర్గాన్ని రెండు జిల్లాల్లో కలపడంతో విద్యార్థులు, రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికేతర ఎమ్మెల్యే వల్లే ఈప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కార్యాలయాల ఏర్పాటులో వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళవలసి రావడంతో ఈ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ను పలుమార్లు సంప్రదించినా.. డివిజన్ ఏర్పాటు చేయలేదని ప్రస్తావించారు. 4 నెలల నుంచి చేర్యాల ప్రజలు నిరసనలు, ధర్నాలు చేసిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఫేస్బుక్ టీంలో తొలిసారి భారీ మార్పులు
శాన్ ఫ్రాన్సిస్కో: ఫేస్బుక్ మేనేజ్మెంట్లో దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇందులో భాగంగా సంస్థ తొలిసారిగా మేనేజ్మెంట్ టీంలో భారీ మార్పులు చేర్పులు చేసింది. దాదాపు 12మందికిపైగా ఎగ్జిక్యూటివ్‌ల పదవలుల్లో మార్పులు చేసింది. ఇంజనీరింగ్, ప్రొడక్ట్ టీమ్స్‌ను మూడు యూనిట్లుగా విడదీసింది. ముఖ్యంగా ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలురేపిన డేటా గోప్యతా కుంభకోణం తరువాత నాయకత్వ బృందంలో మార్పులు చేసినట్టు ఫేస్బుక్ తెలిపింది. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్ యాప్ లాంటి ప్రధాన విభాగాలకు కొత్త వారిని నియమించింది. ముఖ్యంగా బ్లాక్‌చెయిన్ టూల్‌ను తిరిగి లాంచ్ చేసింది. ఈ వివరాలను ఫేస్బుక్ మంగళవారం ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. మార్చి నెలలో కొన్ని లక్షలమంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారం బహిర్గతమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంస్థ ఈచర్య చేపట్టింది. సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ మునుపటిలాగానే సీఈవోగా కొనసాగుతారు. ఇక సీఈవో తర్వాత రెండవ అతి కీలకమైన ఎగ్జిక్యూటివ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షెరిల్ సాండ్బర్గ్ ఉంటారు. జుకర్‌బర్గ్ సర్కిల్లో దీర్ఘకాల సభ్యుడు, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా ఉన్న క్రిస్ కాక్స్‌కు సంస్థ ప్రమోషన్ ఇచ్చింది. ఇకపై క్రిస్ ఫేస్బుక్ యాప్, స్మార్ట్‌ఫోన్‌సేవలు, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్ యాప్‌లకు ప్రధాన ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వహిస్తారు. మరో ఎగ్జిక్యూటివ్ జేవియర్ ఆలివాన్ భద్రతా , "సోషల్ ప్రొడక్ట్ సర్వీసెస్" విభాగ నిర్వహణ బాధ్యతలను చేపడతారు. బిట్కాయిన్లకోసం బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని పునరుద్ధరించింది. మెసెంజర్ చాట్ యాప్‌కు చెందిన డేవిడ్ మార్కస్ దీనికి నాయకత్వం వహిస్తారు. న్యూస్ ఫీడ్ మాజీ హెడ్ ఆడమ్ మోస్సేరిని ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌కు (కెప్టెన్ కెవిన్ వీల్ స్థానంలో) నియమించింది. వాట్సాప్ కో ఫౌండర్ జాన్ కోమ్ రాజీనామా అనంతరం అతని స్థానంలో క్రిస్ డేనియల్స్‌ను నియమించింది. అలాగే ఒబామా మాజీ పరిపాలన అధికారి, క్రేన్మేర్ గ్రూపు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన జెఫ్ జింట్స్ను ఫేస్బుక్ బోర్డులోకి చేర్చుకుంది. -
కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ కోసం కొనసాగుతున్న దీక్ష
కల్వకుర్తి : రెవెన్యూ డివిజన్ కోసం ఆచారి చేస్తున్న ఆమరణ దీక్షకు మద్దతుగా అఖిల పక్షం ఆధ్వర్యంలో శుక్రవారం రెండు జాతీయ రహదారుల జంక్షన్లో మూడుగంటల పాటు రాస్తారోకో చేశారు. జేపీనగర్ వద్ద చౌరస్తాలో డప్పులు, వాయిద్యాలు, నృతాలు, పాటలతో రెవెన్యూ డివిజన్ అవశ్యకత చాటిచెప్పా రు. ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎడ్మకిష్టారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఆనంద్‌కుమార్, బీజేపీ తాలూకా బాధ్యులు శేఖర్‌రెడ్డి, టీడీపీ నాయకులు బాలస్వామి గౌడ్, నగరపంచాయతీ చైర్మన్ శ్రీశైలం, ఎడ్మసత్యం, సీపీఎం, సీపీఐ, జేఏసీ, బార్అసోసియేషన్, ప్రజాసంఘాలు కలిసి ఉద్యమించారు. ఉద యం 10 నుంచి 1గంట వరకు జాతీయ రహదారిపై బస్సు లు, లారీలు, తదితర వాహనాలు నిలిచిపోయాయి. సీఐ వెంకట్, ఎస్ఐలు, తహసీల్దార్ మంజుల తదితరులు వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. రెవెన్యూ డివిజన్‌పై ప్రకటన, చారకొండ, కడ్తాల్ మండలాలుగా చేయాలని నిన దించారు. ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి ప్రసంగించిన తర్వాత స్వచ్ఛందంగా రాస్తారోకో విరమిం చారు. హైదరాబాద్–శ్రీశైలం, దేవరకొండ–జడ్చర్ల జాతీ య రహదారులపై రాస్తారోకో చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్యక్రమంలో నాయకులు భూపతిరెడ్డి, విజయ్‌గౌడ్, పవన్‌కుమార్‌రెడ్డి, వైస్ చైర్మన్ షాహిద్, పీఏసీఎస్ ౖవైస్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి, వివిధ పార్టీల, సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఐబీలో కొత్తడివిజన్
ఖమ్మం అర్బన్: జిల్లాలో సత్తుపల్లి కేంద్రంగా ఇరిగేషన్ (ఐబీ)లో కొత్త డివిజన్ ఏర్పాటు దాదాపు ఖరారైంది. ఇందుకు భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు శనివారం అమోద ముద్ర వేసినట్లు తెలిసింది. డివి జన్ ఏర్పాటుపై రెండు రోజుల్లో ప్రభుత్వ జీవో జారీ కానున్నట్లు సమాచారం. జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పరిపాలన పరంగా ప్రతి జిల్లాలో సర్కిల్ కార్యాలయం ఉండాలనే ఆలోచనతో ఖమ్మంలో 10 నెలలు క్రితం ఐబీ సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఆ సమయంలో సబ్ డివిజన్ హద్దులు మార్చడంతో పాటు, నియోజకవర్గానికి ఒక సబ్ డివిజన్ ఉండేలా ఇరిగేషన్లో పునర్విభజన చేశారు. భద్రాచలంలో ఉన్న డివిజన్ కార్యాలయం కూడా సత్యనారాయణపురంగా మార్పు చేశారు. తాజాగా ఇప్పటి వరకు ఖమ్మం డివిజన్ పరిధిలోని సత్తుపల్లి పరి సర ప్రాంతాలు, కొన్ని సబ్ డివిజన్లను కలపనున్నారు. పరిపాలనపరం గా మరింత చేరువ కావడంతో పాటు, భారీ విస్తీర్ణంతో ఉన్న ఖమ్మం డివిజన్‌ను విడదీసి సత్తుపల్లి కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటుకు రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలకంగా వ్యవహరించి మంజూరు చేయించినట్లు ఆ శాఖ అధికారి ఒకరు తెలిపారు. సత్తుపల్లి డివిజన్‌తో పాటు కొత్తగా పెనుబల్లి సబ్‌డివిజన్ ఏర్పాటకు కూడా మంత్రి ఆమోదం తెలిపినట్లు తెలిసింది. సత్తుపల్లి డివిజన్ పరిధిలోకి సత్తుపల్లి సబ్ డివిజన్, కొత్తగా ఏర్పా టు కానున్న పెనుబల్లి సబ్‌డివిజన్, అశ్వారావుపేట సబ్ డివిజన్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఆర్అండ్బీ డివిజన్‌ను కూడా సత్తుపల్లిలోనే ఇటీవలనే ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇరిగేషన్ డివిజన్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ రావడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది.