కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ కోసం కొనసాగుతున్న దీక్ష
Published Fri, Sep 9 2016 11:39 PM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM
కల్వకుర్తి : రెవెన్యూ డివిజన్ కోసం ఆచారి చేస్తున్న ఆమరణ దీక్షకు మద్దతుగా అఖిల పక్షం ఆధ్వర్యంలో శుక్రవారం రెండు జాతీయ రహదారుల జంక్షన్‌లో మూడుగంటల పాటు రాస్తారోకో చేశారు. జేపీనగర్ వద్ద చౌరస్తాలో డప్పులు, వాయిద్యాలు, నృతాలు, పాటలతో రెవెన్యూ డివిజన్ అవశ్యకత చాటిచెప్పా రు. ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎడ్మకిష్టారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు ఆనంద్‌కుమార్, బీజేపీ తాలూకా బాధ్యులు శేఖర్‌రెడ్డి, టీడీపీ నాయకులు బాలస్వామి గౌడ్, నగరపంచాయతీ చైర్మన్ శ్రీశైలం, ఎడ్మసత్యం, సీపీఎం, సీపీఐ, జేఏసీ, బార్‌అసోసియేషన్, ప్రజాసంఘాలు కలిసి ఉద్యమించారు. ఉద యం 10 నుంచి 1గంట వరకు జాతీయ రహదారిపై బస్సు లు, లారీలు, తదితర వాహనాలు నిలిచిపోయాయి. సీఐ వెంకట్, ఎస్‌ఐలు, తహసీల్దార్ మంజుల తదితరులు వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. రెవెన్యూ డివిజన్‌పై ప్రకటన, చారకొండ, కడ్తాల్ మండలాలుగా చేయాలని నిన దించారు. ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి ప్రసంగించిన తర్వాత స్వచ్ఛందంగా రాస్తారోకో విరమిం చారు. హైదరాబాద్–శ్రీశైలం, దేవరకొండ–జడ్చర్ల జాతీ య రహదారులపై రాస్తారోకో చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్యక్రమంలో నాయకులు భూపతిరెడ్డి, విజయ్‌గౌడ్, పవన్‌కుమార్‌రెడ్డి, వైస్ చైర్మన్ షాహిద్, పీఏసీఎస్ ౖవైస్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి, వివిధ పార్టీల, సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement