శాన్ ఫ్రాన్సిస్కో: ఫేస్‌బుక్ మేనేజ్‌మెంట్‌లో దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇందులో భాగంగా సంస్థ తొలిసారిగా మేనేజ్‌మెంట్ టీంలో భారీ మార్పులు చేర్పులు చేసింది. దాదాపు 12మందికిపైగా ఎగ్జిక్యూటివ్‌ల పదవలుల్లో మార్పులు చేసింది. ఇంజనీరింగ్, ప్రొడక్ట్ టీమ్స్‌ను మూడు యూనిట్లుగా విడదీసింది. ముఖ్యంగా ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలురేపిన డేటా గోప్యతా కుంభకోణం తరువాత నాయకత్వ బృందంలో మార్పులు చేసినట్టు ఫేస్‌బుక్ తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్ యాప్ లాంటి ప్రధాన విభాగాలకు కొత్త వారిని నియమించింది. ముఖ‍్యంగా బ్లాక్‌చెయిన్ టూల్‌ను తిరిగి లాంచ్ చేసింది. ఈ వివరాలను ఫేస్‌బుక్ మంగళవారం ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.
మార్చి నెలలో కొన్ని లక్షలమంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారం బహిర్గతమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంస్థ ఈచర్య చేపట్టింది. సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ మునుపటిలాగానే సీఈవోగా కొనసాగుతారు. ఇక సీఈవో తర్వాత రెండవ అతి కీలకమైన ఎగ్జిక్యూటివ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షెరిల్ సాండ్‌బర్గ్ ఉంటారు. జుకర్‌బర్గ్ సర్కిల్‌లో దీర్ఘకాల సభ్యుడు, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా ఉన్న క్రిస్ కాక్స్‌కు సంస్థ ప్రమోషన్ ఇచ్చింది. ఇకపై క్రిస్ ఫేస్‌బుక్ యాప్, స్మార్ట్‌ఫోన్‌సేవలు, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్ యాప్‌లకు ప్రధాన ఇన్‌చార్జ్‌గా బాధ‍్యతలు నిర్వహిస్తారు. మరో ఎగ్జిక్యూటివ్ జేవియర్ ఆలివాన్ భద్రతా , "సోషల్ ప్రొడక్ట్ సర్వీసెస్" విభాగ నిర్వహణ బాధ్యతలను చేపడతారు.
బిట్‌కాయిన్‌లకోసం బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని పునరుద్ధరించింది. మెసెంజర్ చాట్ యాప్‌కు చెందిన డేవిడ్ మార్కస్ దీనికి నాయకత్వం వహిస్తారు. న్యూస్ ఫీడ్ మాజీ హెడ్ ఆడమ్ మోస్సేరిని ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌కు (కెప్టెన్ కెవిన్ వీల్ స్థానంలో) నియమించింది. వాట్సాప్ కో ఫౌండర్ జాన్ కోమ్ రాజీనామా అనంతరం అతని స్థానంలో క్రిస్ డేనియల్స్‌ను నియమించింది. అలాగే ఒబామా మాజీ పరిపాలన అధికారి, క్రేన్‌మేర్ గ్రూపు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన జెఫ్ జింట్స్‌ను ఫేస్‌బుక్ బోర్డులోకి చేర్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment