ఖమ్మం అర్బన్: జిల్లాలో సత్తుపల్లి కేంద్రంగా ఇరిగేషన్ (ఐబీ)లో కొత్త డివిజన్ ఏర్పాటు దాదాపు ఖరారైంది. ఇందుకు భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు శనివారం అమోద ముద్ర వేసినట్లు తెలిసింది. డివి జన్ ఏర్పాటుపై రెండు రోజుల్లో ప్రభుత్వ జీవో జారీ కానున్నట్లు సమాచారం. జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పరిపాలన పరంగా ప్రతి జిల్లాలో సర్కిల్ కార్యాలయం ఉండాలనే ఆలోచనతో ఖమ్మంలో 10 నెలలు క్రితం ఐబీ సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఆ సమయంలో సబ్ డివిజన్ హద్దులు మార్చడంతో పాటు, నియోజకవర్గానికి ఒక సబ్ డివిజన్ ఉండేలా ఇరిగేషన్‌లో పునర్విభజన చేశారు. భద్రాచలంలో ఉన్న డివిజన్ కార్యాలయం కూడా సత్యనారాయణపురంగా మార్పు చేశారు.
తాజాగా ఇప్పటి వరకు ఖమ్మం డివిజన్ పరిధిలోని సత్తుపల్లి పరి సర ప్రాంతాలు, కొన్ని సబ్ డివిజన్లను కలపనున్నారు. పరిపాలనపరం గా మరింత చేరువ కావడంతో పాటు, భారీ విస్తీర్ణంతో ఉన్న ఖమ్మం డివిజన్‌ను విడదీసి సత్తుపల్లి కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటుకు రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలకంగా వ్యవహరించి మంజూరు చేయించినట్లు ఆ శాఖ అధికారి ఒకరు తెలిపారు. సత్తుపల్లి డివిజన్‌తో పాటు కొత్తగా పెనుబల్లి సబ్‌డివిజన్ ఏర్పాటకు కూడా మంత్రి ఆమోదం తెలిపినట్లు తెలిసింది.
సత్తుపల్లి డివిజన్ పరిధిలోకి సత్తుపల్లి సబ్ డివిజన్, కొత్తగా ఏర్పా టు కానున్న పెనుబల్లి సబ్‌డివిజన్, అశ్వారావుపేట సబ్ డివిజన్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఆర్‌అండ్‌బీ డివిజన్‌ను కూడా సత్తుపల్లిలోనే ఇటీవలనే ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇరిగేషన్ డివిజన్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ రావడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది.
ఐబీలో కొత్తడివిజన్
Published Sun, Jun 28 2015 12:49 AM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM
Advertisement
Advertisement