రాష్ట్ర రాజధాని నగరం అమరావతిలో తనకు సంబంధించిన కార్యాలయాన్నింటినీ ఒకేచోట నెలకొల్పాలని ....
అమరావతిలో 58 ఎకరాలు అడిగిన కేంద్ర ప్రభుత్వం
విజయవాడ బ్యూరో: రాష్ట్ర రాజధాని నగరం అమరావతిలో తనకు సంబంధించిన కార్యాలయాన్నింటినీ ఒకేచోట నెలకొల్పాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 23 ఎకరాల స్థలం కావాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది. ఈ స్థలంలో అవసరాన్నిబట్టి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి ఆయా శాఖలు, ప్రభుత్వ సంస్థలకు చెందిన కార్యాలయాలను నిర్మించాలని భావిస్తోంది. రాష్ట్రంలో ఏర్పాటయ్యే ఇన్‌కంటాక్స్, సీపీడబ్ల్యూడీ, ఏజీ ఆడిటింగ్ తదితర అన్నిశాఖల్లోనూ సుమారు పదివేల మంది ఉద్యోగులు పనిచేస్తారని కేంద్రం రాష్ట్రానికి సమాచారమిచ్చింది.
23 ఎకరాల్లోనే భవనాలను నిర్మించి అందులోనే వారికి సంబంధించిన కార్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే వారు నివాసముండేందుకు సుమారు 1,600 క్వార్టర్లు నిర్మించాల్సి ఉంటుందని, ఇందుకు 35 ఎకరాల స్థలం అవసరమని ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో కార్యాలయాలు, క్వార్టర్లకు కలపి 58 ఎకరాల స్థలాన్ని కేంద్రం కోరింది.సీడ్ కేపిటల్ మాస్టర్‌ప్లాన్ వచ్చాక ఎక్కడ స్థలమివ్వాలనే విషయాన్ని నిర్ణయించాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది.
భూమి కావాలంటూ ప్రతిపాదనలు
మరోవైపు రాజధాని ప్రాంతంలో తమ కార్యాలయాల ఏర్పాటుకు భూములు కావాలంటూ రాష్ట్రప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులూ సీఆర్‌డీఏను కోరుతున్నాయి.