సాక్షి, అమరావతి: ఐటీ షోకాజ్ నోటీసులపై విచారణను తప్పించుకోవడానికి చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారు. ఐటీ నోటీసులపై నాలుగు సార్లు సెంట్రల్ హైదరాబాద్ ఆఫీస్‌కు లేఖలు రాసిన చంద్రబాబు.. తనకు ఐటీ నోటీసులు జారీ చేసిన విధానాన్ని తప్పుబడుతున్నారు.
జ్యూరిడిక్షనల్ అధికారి కాకుండా సెంట్రల్ ఆఫీస్ నుంచి.. ఐటీ నోటీస్ రావడంపై చంద్రబాబు అభ్యంతర వ్యక్తం చేస్తున్నారు. అభ్యంతరాలను తెలుపుతూ ఐటీ ఆఫీస్‌కు రాసి లేఖలను.. ఐటీ అధికారులు తోసిపుచ్చారు. మరోసారి ఇటీవల తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
కాగా, టీడీపీ హయాంలో అంటే 2016 నుంచి 2019 మధ్య కాలంలో ఇన్ ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా రూ.118 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ విచారణ చేపట్టింది. బడా ఇన్‌ఫ్రా కంపెనీలకు అమరావతి ప్రాజెక్టుల కాంట్రాక్టులు అప్పజెప్పి.. వాటి ద్వారా సబ్ కాంట్రాక్టుల పేరుతో ప్రజా ధనాన్ని తన ఖాతాల్లోకి మళ్లించుకున్నారాయన. ఆ లెక్క లేని ఆదాయంపైనే ఐటీ శాఖ చంద్రబాబును ప్రశ్నిస్తోంది.
చదవండి: ముడుపులివ్వకపోతే మూడినట్లే!
చంద్రబాబుకు నగదు ముట్టినట్లు ఐటీ తనిఖీల్లో క్రిస్టల్ క్లియర్‌గా బయటపడింది. నగదు ఎవరెవరికి ఎలా డెలివరీ అయ్యిందో ఉదాహరణలతో వివరించింది కూడా. దీన్ని బ్లాక్ మనీగా ఎందుకు గుర్తించవద్దో చెప్పాలంటూ చంద్రబాబుకు తాజాగా మరో నోటీసు జారీ చేసింది. ఈ క్రమంలో.. లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేశ్‌కు నగదు డెలివరీ అయిన సాక్ష్యాన్ని పట్టుకుంది ఐటీ శాఖ. ఐటీ నోటీసులపై దర్యాప్తును అడ్డుకునేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment