సాక్షి, గుంటూరు: అధికారంలో ఉన్నప్పుడు.. దొడ్డిదోవలో బోగస్ కాంట్రాక్ట్‌ల ద్వారా ప్రజాధనాన్ని మళ్లించి తన ఖాతాలో జమ చేసుకున్నారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈ అవినీతి బాగోతం బట్టబయలై.. ఐటీ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఫలితంపై పొలిటికల్ రియాక్షన్లు వస్తున్నాయి.
చంద్రబాబుకు ఐటీ నోటీసులపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ముడుపులు మింగేసి, కమీషన్లు కొట్టేశారు చంద్రబాబు గారు. ఐటీ నోటీసులు రాకుండా అడ్డుపడాలనుకున్నా కుదర్లేదు. అడ్డంగా బుక్కైనా బుకాయించడం బాబు గారి నైజం అంటూ ట్వీట్ చేశారు.
అధికారంలో ఉన్నప్పుడు ముడుపులు మింగేసి, కమీషన్లు కొట్టేశారు చంద్రబాబు గారు. ఐటీ నోటీసులు రాకుండా అడ్డుపడాలనుకున్నా కుదర్లేదు. అడ్డంగా బుక్కైనా బుకాయించడం బాబు గారి నైజం.
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 1, 2023
► చంద్రబాబు ముడుపుల వ్యవహారం పై అసెంబ్లీలోనూ చర్చకు వచ్చింది. అమరావతి నిర్మించాలంటూ ఎల్&టీ,షాపూర్ జీ పల్లోంజి ,ఇతర ఇన్ ఫ్రా సంస్థల నుంచి లంచాలు వసూలు చేశారు. వివిధ వ్యక్తుల ద్వారా,వివిధ రూపాల్లో రూ. 118 కోట్లకు పైగా వసూలు చేశారు. ఇదంతా మేం పనిగట్టుకుని చేసే ఆరోపణలు కాదు. ఎన్నికల ముందే ఇన్ కంటాక్స్ అధికారులకు అందిన ఫిర్యాదు. దీని పై మాట్లాడమంటే చంద్రబాబు అసెంబ్లీ నుంచి పారిపోయాడు. చంద్రబాబు చేసే పనులన్నీ అవినీతి అరాచకంతో కూడిన కుట్రలే. తాజాగా ఐటీ నోటీసులు ఇవ్వడమే దీనికి ఉదాహరణ.
:::విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
► పశ్చిమగోదావరి: చంద్రబాబు చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. చంద్రబాబు దగ్గర దొరికింది చాలా తక్కువ మొత్తం.వేల కోట్లు అతను దోచేసాడు. స్కిల్ డెవలప్మెంట్ సీమన్స్ కంపెనీ ద్వారా 300 కోట్లు దోచేశారు. పోలవరం ప్రాజెక్టు మీద వేల కోట్లు, ఇసుక మీద కోట్లు దోచేసిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు మేనేజ్మెంట్ లో ఎక్సపర్ట్ కాబట్టి వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన దోపిడీకి ఇది శాంపిల్ మాత్రమే. టిడ్కో ఇళ్ల ద్వారా పేదవాళ్ళ దగ్గర నుండి ఒక్కొక్కరి దగ్గర 3 లక్షలు చొప్పున దోచుకున్నారు. డబ్బులు రాని ఆరోగ్య శ్రీ, 108 లాంటి వ్యవస్థ లను నిర్వీర్యం చేసిన వ్యక్తి చంద్రబాబు. తాను ఇరుక్కుపోతానని ముందే తెలిసి గత నాలుగు రోజులుగా ఢిల్లీలో కాళ్ళబేరానికి చూస్తున్నారు.
:::ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ
► సాక్షి, తాడేపల్లి: హిందూస్తాన్ టైమ్స్ చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేసింది. హిందుస్తాన్ టైమ్స్ కథనంపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు. అమరావతి పేరుతో డబ్బులు కొట్టేసింది నిజమా? కాదా?. చంద్రబాబు గుట్టంతా ఐటీ బయటపెట్టింది. ప్రజల ఆస్తిని చంద్రబాబు ఎలా కొట్టేస్తాడనేది బహిర్గతమైంది. 2016 నుంచీ చంద్రబాబు బాగోతం ఇప్పుడు బయటకొచ్చింది. ఇన్‌ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్‌లతో 118 కోట్లు ముడుపులు తీసుకున్నారు. తన పీఏ శ్రీనివాస్ ద్వారా చంద్రబాబు ముడుపులు తీసుకున్నారు. రాజధాని అమరావతి పేరుతో దోపిడీ జరిగింది. ఈ ముడుపుల బాగోతంపై ఐటీ నోటీసులు ఇచ్చింది. చంద్రబాబుకు మనోజ్ పార్థసాని ముడుపులు ఇచ్చినట్టు తేలింది. ఈ ముడుపులను దాచి ఉంచిన ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదు?.
ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ వెళ్లినప్పుడల్లా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులపై ఎల్లో మీడియా ఎందుకు స్పందించదు?. హిందుస్తాన్ టైమ్స్‌లో వచ్చిన కథనం వీరెవ్వరికీ కనిపించదు. ఎన్టీఆర్ ఆత్మ చంద్రబాబును వెంటాడుతోంది. చంద్రబాబుకు దమ్ముంటే ఐటీ నోటీసులపై నోరు విప్పాలి. లోకేశ్ ముందు పాదయాత్ర ఆపి తన తండ్రి అవినీతిపై మాట్లాడాలి. లోకేశ్ ముందు నీ తండ్రి అవినీతి బాగోతంపై స్పందించు. లోకేశ్.. హిందుస్తాన్ టైమ్స్‌పై దావా వేసే దమ్ముందా? ఐటీ నోటీసులపై కూడా చంద్రబాబు స్టే తెచ్చుకుంటాడు. చంద్రబాబు, లోకేశ్ ప్రజల సొమ్మును అడ్డంగా తినేశారు. మళ్లీ ప్రజల సొమ్మును తినేసేందుకు అధికారం ఇవ్వాలా?. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది చంద్రబాబే. మళ్లీ భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ కొత్త మోసం మొదలుపెట్టారు. తప్పుడు సంతకంతో మళ్లీ ప్రజల వద్దకు బయలుదేరాడు. అధికారం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు. ఎవరినైనా వాడుకుని వదిలేయడంలో చంద్రబాబు దిట్ట. అవసరం తీరే వరకు అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు.
:: మాజీ మంత్రి పేర్ని నాని.
Comments
Please login to add a commentAdd a comment