న్యూఢిల్లీ: భారత ఆడిటింగ్ ప్రమాణాలు చాలా మటుకు అంతర్జాతీయ అకౌంటింగ్ స్టాండర్డ్‌లకు అనుగుణంగానే ఉంటున్నాయని ఐసీఏఐ కొత్త ప్రెసిడెంట్ అనికేత్ తలాతి చెప్పారు. ఆడిటర్లంటే ప్రతి ఒక్క లావాదేవీ, ప్రతి ఇన్‌వాయిస్‌ను తప్పకుండా చూస్తారని భావించడానికి ఉండదని ఆయన తెలిపారు.
లిస్టెడ్ కంపెనీలు ప్రతి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను 45 రోజుల్లోగా, వార్షిక ఫలితాలను 60 రోజుల్లోగా ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఆడిటర్లు ప్రతి ఒక్క లావాదేవీని చూడటం సాధ్యపడదని, అసలు ఆడిట్ ఉద్దేశం అది కాదని ఆయన పేర్కొన్నారు. అయితే, రిపోర్టింగ్ ప్రమాణాలు, బాధ్యతల విషయంలో ఆడిటర్లు సాంకేతికంగా అత్యుత్తమ స్థాయి ప్రమాణాలు, సమగ్రతను పాటించాల్సి ఉంటుందని అనికేత్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment