ICAI president
-
అంతర్జాతీయ స్థాయిలో మన ఆడిటింగ్ ప్రమాణాలు
న్యూఢిల్లీ: భారత ఆడిటింగ్ ప్రమాణాలు చాలా మటుకు అంతర్జాతీయ అకౌంటింగ్ స్టాండర్డ్‌లకు అనుగుణంగానే ఉంటున్నాయని ఐసీఏఐ కొత్త ప్రెసిడెంట్ అనికేత్ తలాతి చెప్పారు. ఆడిటర్లంటే ప్రతి ఒక్క లావాదేవీ, ప్రతి ఇన్వాయిస్ను తప్పకుండా చూస్తారని భావించడానికి ఉండదని ఆయన తెలిపారు. లిస్టెడ్ కంపెనీలు ప్రతి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను 45 రోజుల్లోగా, వార్షిక ఫలితాలను 60 రోజుల్లోగా ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఆడిటర్లు ప్రతి ఒక్క లావాదేవీని చూడటం సాధ్యపడదని, అసలు ఆడిట్ ఉద్దేశం అది కాదని ఆయన పేర్కొన్నారు. అయితే, రిపోర్టింగ్ ప్రమాణాలు, బాధ్యతల విషయంలో ఆడిటర్లు సాంకేతికంగా అత్యుత్తమ స్థాయి ప్రమాణాలు, సమగ్రతను పాటించాల్సి ఉంటుందని అనికేత్ చెప్పారు. -
ఐసీఏఐ ప్రెసిడెంట్‌గా విజేందర్ శర్మ
న్యూఢిల్లీ: 2022- 23కి గాను ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) కొత్త ప్రెసిడెంట్‌గా విజేందర్ శర్మ, వైస్-ప్రెసిడెంట్‌గా రాకేశ్ భల్లా ఎన్నికయ్యారు. లా గ్రాడ్యుయేట్, ఐసీఏఐ ఫెలో మెంబర్ అయిన శర్మ 1998 నుండి కాస్ట్ అకౌంటెంట్‌గా సేవలు అందిస్తున్నారు. 2017 జనవరి నుండి ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఫైనాన్స్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో 22 ఏళ్ల అనుభవం ఉన్నట్లు ఐసీఏఐ తెలిపింది. కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన భల్లా .. ఐసీఏఐ ఫెలో మెంబర్‌గా ఉన్నారు. -
దేశ ఆర్థికాభివృద్ధిలో సీఏలది కీలకపాత్ర
పారదర్శకంగా పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు: ఐసీఏఐ అధ్యక్షుడు దేవరాజరెడ్డి దేవరాజరెడ్డి, నీలేశ్ వికమ్సేను సన్మానిస్తున్న ఎస్‌ఐఆర్‌సీ ప్రతినిధులు, చిత్రంలో సాక్షి ఫైనాన్స్ డెరైక్టర్ వైఈపీ రెడ్డి తదితరులు సాక్షి, హైదరాబాద్: దేశ ఆర్థికాభివృద్ధిలో చార్టర్డ్ అకౌంటెంట్ల(సీఏ)ది క్రియాశీలక పాత్ర అని, వీరందరూ పారదర్శకంగా పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు కనిపిస్తాయని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) అధ్యక్షుడు ఎం.దేవరాజరెడ్డి అన్నారు. ఐసీఏఐకి తొలిసారిగా అధ్యక్షుడైన తెలుగు వ్యక్తి దేవరాజరెడ్డితో పాటు ఉపాధ్యక్షుడు నీలేశ్ వికమ్సేను మంగళవారం శ్రీనగర్ కాలనీలోని సత్యసాయినిగమాగమంలో హైదరాబాద్ బ్రాంచ్ ఆఫ్ ఎస్‌ఐఆర్‌సీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దేవరాజరెడ్డి మాట్లాడుతూ.. ‘‘అందరి ప్రోత్సాహం వల్లే నేను ఈ రోజు ఐసీఏఐ అధ్యక్షుడి స్థాయి వరకు రాగలిగా. విధి నిర్వహణలో భాగంగా దేశ ఆర్థికాభివృద్ధిపై ప్రధాన దృష్టి పెడతా. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్ట్స్(ఐఎఫ్ఆర్ఎస్)కు అనుగుణంగా భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్స్‌లో బోధనా మార్పులు తీసుకొచ్చాం. ఐసీఏఐలో ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్ డెరైక్టరేట్ నుంచి టెక్నికల్ డెరైక్టరేట్ వరకు వివిధ విభాగాల్లో సృజనాత్మకతకు పెద్దపీట వేశాం’’ అని చెప్పారు. ఐటీ కంపెనీల మాదిరిగానే భవిష్యత్తులో ‘అకౌం టింగ్ హబ్’ వస్తుందని ఉపాధ్యక్షుడు నీలేశ్ అన్నారు. ‘‘సీఏ పరీక్ష నిబంధనలతో ఐదు శాతం మంది మాత్రమే పాస్ అవుతున్నారు. నాలుగేళ్ల పాటు కష్టపడి చదివిన మిగతా 95 శాతం మంది నిరాశకు లోనవుతున్నారు. అందుకే ఐఐటీ, ఐఐఎం మాదిరిగా కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి పరిమిత సంఖ్యలో విద్యార్థులను ఎంపిక చేసుకొని శిక్షణ ఇస్తే బాగుంటుంది. దీంతో చాలా మంది విద్యార్థులకు కెరీర్ ఇచ్చినవారం అవుతాం’’ అని ‘సాక్షి’ అడ్మిన్ అండ్ ఫైనాన్స్ డెరైక్టర్ వైఈపీ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఐసీఏఐ సెంట్రల్ కౌన్సిల్ సభ్యులతోపాటు సీనియర్ సీఏ సభ్యులు పాల్గొన్నారు. -
ఐసీఏఐ అధ్యక్షుడిగా దేవరాజారెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) అధ్యక్షుడిగా హైదరాబాద్‌వాసి ఎం.దేవరాజారెడ్డి ఎన్నికయ్యారు. ఈ ప్రతిష్టాత్మక పదవిని తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి చేపట్టనుండటం ఇదే తొలిసారి. ఆయన గతేడాది ఐసీఏఐ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. అధ్యక్షుడిగా ఏడాది పాటు కొనసాగుతారు. సీఏ విద్యా ప్రణాళికలో మార్పులు తేనున్నట్టు ఈ సందర్భంగా ఆయన మీడియాకు చెప్పారు. కొత్త సిలబస్ రావడం వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. ‘‘విద్యార్థులకు అర్హత పరీక్ష నిర్వహించడం వల్ల సీరియస్ విద్యార్థులు మాత్రమే కోర్సు ఎంచుకునే అవకాశముంటుంది. సీఏలుగా దేశవిదేశాల్లో పని చేసేందుకు అవకాశాలు విరివిగా ఉన్నాయి. కొత్త కంపెనీ లా ప్రకారం సీఏలకు ఎన్నో బాధ్యతలు వచ్చాయి. దేశం ఆర్థికంగా ముందుకు వెళ్లేందుకు సీఏ వెన్నెముకగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ కోర్సుకు భవిష్యత్తుంది’’ అని పేర్కొన్నారు.