
న్యూఢిల్లీ: 2022- 23కి గాను ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) కొత్త ప్రెసిడెంట్‌గా విజేందర్ శర్మ, వైస్-ప్రెసిడెంట్‌గా రాకేశ్ భల్లా ఎన్నికయ్యారు. లా గ్రాడ్యుయేట్, ఐసీఏఐ ఫెలో మెంబర్ అయిన శర్మ 1998 నుండి కాస్ట్ అకౌంటెంట్‌గా సేవలు అందిస్తున్నారు. 2017 జనవరి నుండి ఇన్‌సాల్వెన్సీ ప్రొఫెషనల్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఫైనాన్స్, కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ తదితర విభాగాల్లో 22 ఏళ్ల అనుభవం ఉన్నట్లు ఐసీఏఐ తెలిపింది. కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన భల్లా .. ఐసీఏఐ ఫెలో మెంబర్‌గా ఉన్నారు.