సాక్షి, న్యూఢిల్లీ : మొండిబకాయిలకు చెక్ పెట్టేలా కొత్తగా తీసుకువచ్చిన దివాలా చట్టం (ఐబీసీ) ప్రయోగిస్తే తమ కంపెనీలపై నియంత్రణ కోల్పోవలసి వస్తుందనే భయంతో పెద్దసంఖ్యలో కంపెనీలు బకాయిలు చెల్లించేందుకు ముందుకొస్తున్నాయి. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం 2100 కంపెనీలు తమ బకాయిలను చెల్లించాయి. ఇప్పటివరకూ రూ 83,000 కోట్ల బకాయిలు పరిష్కారమయ్యాయి. 90 రోజుల్లోగా రుణాలు చెల్లించకపోతే ఆయా రుణాలను ఎన్‌పీఏలుగా ప్రకటిస్తూ వాటిని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు నివేదించేలా దివాలా చట్టానికి మార్పులు చేపట్టిన అనంతరం రుణ బకాయిలు పెద్ద ఎత్తున వసూలవుతున్నాయని ఈ గణాంకాలు వెల్లడించాయి.
బకాయిలను చెల్లిస్తేనే ప్రమోటర్లను వారి సంస్థల బిడ్డింగ్‌లో పాల్గొనేలా చట్ట సవరణ చేయడంతో బడా కంపెనీలు సైతం బకాయిల చెల్లింపునకు ముందుకొస్తున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. బకాయిలు చెల్లించకుండా వేలంలో పాల్గొంటే తిరిగి ప్రమోటర్లే వారి సంస్థలను భారీ డిస్కౌంట్‌తో దక్కించుకుంటారని ప్రభుత్వం వాదిస్తోంది. రుణ ఎగవేతదారులపై ఒత్తిడి పెంచడంతో బకాయిలు వసూలవుతున్నాయని, రుణాల జారీ..రుణ వితరణలో నూతన దివాలా చట్టం మెరుగైన మార్పులను తీసుకువచ్చిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment