చిన్న సంస్థల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెయిడ్ అప్ క్యాపిటల్, టర్నోవర్ థ్రెషోల్డ్‌లను ప్రభుత్వం సవరించింది. ఈ నిర్ణయం సంస్థలపై నిర్వాహణ భారం తగ్గడంలో సహాయ పడనుంది.
కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వ్యాపార నిర్వహణను మరింత సౌలభ్యం చేసే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా కేంద్రం సవరించిన నిబంధనల మేరకు చిన్న సంస్థల చెల్లింపు మూలధనం (paid up capital) థ్రెషోల్డ్ గతంలో రూ. 2 కోట్లకు మించకూడదు అనే నిబంధన ఉంది. ఇప్పుడు దాన్ని సవరించి రూ. 4 కోట్లకు పెంచింది.
►అదేవిధంగా, రూ. 20 కోట్ల టర్నోవర్ థ్రెషోల్డ్‌ను రూ.40 కోట్లకు మించకుండా సవరించినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ సవరణలతో చిన్న కంపెనీల జాబితాలో మరిన్ని ఎంటిటీలు(సంస్థలకు) చేరనున్నాయి.
►మంత్రిత్వ శాఖ ప్రకారం..ఇకపై చిన్న కంపెనీలు ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్‌లో భాగంగా క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్‌ను సిద్ధం చేయాల్సిన పనిలేదు. వార్షిక రిటర్న్‌ను ఫైల్ చేసుకోవచ్చు.
►చిన్న సంస్థలకు జరిమానాలు తక్కువగా పడనున్నాయి. అటువంటి సంస్థల వార్షిక రాబడిపై కంపెనీ సెక్రటరీ లేదా కంపెనీ సెక్రటరీ లేని చోట కంపెనీ డైరెక్టర్ సంతకం చేయడంతో పాటు ఇతర సౌకర్యాలు కలగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment