Govt To Decriminalise 12 Violations Non-Criminal Under LLP Act - Sakshi
Sakshi News home page

ఈ 12 తప్పిదాలను నేరంగా చూడరు 

Published Fri, Feb 5 2021 11:57 AM | Last Updated on Fri, Feb 5 2021 1:36 PM

Govt To Decriminalise 12 Offences Under LLP Act - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: లిమిటెడ్‌ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్‌ చట్టం (ఎల్‌ఎల్‌పీ) 2008 కింద 12 ఉల్లంఘనలు/తప్పిదాలను నేరపూరితం కానివిగా కేంద్రం మార్పు చేయనుంది. అదే విధంగా నేర బాధ్యతలను కలిగిన ఒక నిబంధనను సైతం తొలగించనుంది. చట్టబద్ధంగా పనిచేసే ఎల్‌ఎల్‌పీ సంస్థలు మరింత సులభంగా వ్యాపారాన్ని నిర్వహించుకునేందుకు ఈ మార్పులను తీసుకురానున్నట్టు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ప్రకటించింది. (పెట్రో ధరల మోత : రికార్డు హై)

‘నిజాయితీ, నైతికతతో పనిచేసే కార్పొరేట్‌ వ్యాపారస్తులను సంపద సృష్టికర్తలు, జాతి నిర్మాణ రూపకర్తలుగా ప్రభుత్వం పరిగణిస్తుంది. ఈ కసరత్తు అన్నది వ్యాపార చట్టాల నుంచి హానికారక ఉద్దేశాల్లేని దోషాల నేరపూరితాన్ని తొలగించడమే. ఎల్‌ఎల్‌పీ చట్టంలో ఈ నిబంధనలను గుర్తించే పని కొనసాగుతోంది. ఈ విధమైన చట్ట ఉల్లంఘనలు ప్రజా ప్రయోజనాలకు ఎటువంటి హాని కలిగించనివి అయి ఉండి, ప్రస్తుతం జరిమానా, శిక్షలతో నేరపూరితంగా చూస్తున్నవే ఉంటాయి’ అని కార్పొరేట్‌ శాఖ పేర్కొంది. (ఆర్‌బీఐ పాలసీ రివ్యూ : కీలక నిర్ణయం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement