Burden
-
ఏపీ ప్రజలపై మరో భారం (ఫోటోలు)
-
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీల భారంపై ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్సీపీ సభ్యులు... దద్దరిల్లిన శాసన మండలి
-
ఇంటి రుణం.. భారం దింపుకుందాం
గృహ రుణం.. రెండేళ్ల క్రితం వరకు ఇల్లు కొనుగోలుదారులకు ఆకర్షణీయంగా కనిపించిన సాధనం. కేవలం 6.7 శాతం వార్షిక రేటుపై ఇంటి కొనుగోలుకు రుణం లభించింది. కానీ, స్థూల ఆరి్థక పరిస్థితుల్లో వచ్చిన మార్పుల నేపథ్యంలో ఆర్బీఐ కీలక రేటును 2022 మే నుంచి 2.5 శాతం మేర పెంచింది. ఫలితంగా గృహ రుణం రేట్లు 9.5–10 శాతానికి చేరాయి. దీంతో అప్పటికే ఇంటి కోసం రుణం తీసుకున్న వారికి నెలవారీ ఈఎంఐ భారంగా మారింది. 15 ఏళ్ల కనిష్టాలకు చేరిన గృహ రుణ రేట్లు ఒక్కసారిగా భారంగా మారాయి. ఆ తర్వాత ద్రవ్యోల్బణం గరిష్టాల నుంచి కొంత మేర దిగివచ్చింది. అంతర్జాతీయంగా కఠినతర ద్రవ్య విధానం దాదాపు చివరి దశకు చేరింది. దీంతో వడ్డీ రేట్ల పెంపు సైతం ముగింపునకు వచ్చేసిందని విశ్లేషకుల అభిప్రాయం. ఆర్బీఐ సైతం రేట్ల యథాతథ స్థితినే కొనసాగిస్తోంది. అయినా కానీ, వడ్డీ రేట్ల తగ్గింపునకు మరికొన్ని త్రైమాసికాలు వేచి చూడాల్సి రావచ్చని భావిస్తున్నారు. దాదాపు అన్ని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రేట్ల పెంపు భారాన్ని రుణ గ్రహీతలకు బదిలీ చేశాయి. ఈ తరుణంలో ఈఎంఐ భారం తగ్గించుకునేందుకు ఉన్న మార్గాల్లో బ్యాలన్స్‌ను మరో రుణదాతకు బదిలీ చేసుకోవడం ఒకటి. దాని గురించి వివరించే కథనం ఇది... ఇంటి కోసం రుణం తీసుకున్న వారికి ప్రస్తుత ఈఎంఐ భారంగా అనిపిస్తే, అప్పుడు ఇతర బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు వసూలు చేస్తున్న వడ్డీ రేట్లను ఒక్కసారి పరిశీలించాలి. ఇతర సంస్థలతో పోలిస్తే మీ బ్యాంక్ అధిక రేటు వసూలు చేస్తున్నట్టు గుర్తిస్తే కనుక, అప్పుడు దాన్ని తక్కువ రేటుకు ఆఫర్ చేస్తున్న బ్యాంక్‌కు బదిలీ చేసుకోవడాన్ని పరిశీలించొచ్చు. ఇలా మిగిలి ఉన్న రుణాన్ని మరో సంస్థకు బదిలీ చేసుకునే ముందు, ఇందుకు అనుసరించాల్సిన ప్రక్రియ, ఇందుకు అయ్యే చార్జీలు, అసలు బదిలీ చేసుకోవడం వల్ల మిగిలే ప్రయోజనం ఎంత మేర? తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించడం అవసరం. ఫ్లోటింగ్ రేటు విధానంలో రేట్లను ఎలా నిర్ణయిస్తారనేది కూడా తెలుసుకోవాలి. రేట్ల విధానాలు.. గృహ రుణంపై ఫిక్స్డ్ (స్థిర), ఫ్లోటింగ్ (అస్థిర) రేట్ల విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఫ్లోటింగ్ రేటు రుణాలు ఆర్బీఐ కీలక రేట్ల సవరణకు అనుగుణంగా మార్పులకు లోనవుతుంటాయి. ఫిక్స్డ్ రేట్ విధానంలో నిరీ్ణత కాలం పాటు రుణంపై ఒకటే రేటు కొనసాగుతుంది. కనుక ఫ్లోటింగ్ రేట్ రుణాలతో పోలిస్తే ఫిక్స్డ్ రేట్ రుణాలపై వడ్డీ రేటు 1.5–2 శాతం వరకు అధికంగా ఉంటుంది. ప్రస్తుతం అధిక శాతం గృహ రుణాలు ఫ్లోటింగ్ రేట్ విధానంలోనే ఉంటున్నాయి. ఆర్బీఐ 2016లో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. బ్యాంక్‌లు లేదా ఎన్‌బీఎఫ్‌సీలకు నిధులపై అయ్యే వ్యయంతోపాటు, జీ–సెక్ ఈల్డ్స్, బ్యాంకింగ్ రంగంలో లిక్విడిటీ తదితర అంశాలు ఈ విధానంలో రేట్లను ప్రభావితం చేస్తాయి. బ్యాంక్ సొంతంగా రేట్లను నిర్ణయించుకునే స్వేచ్ఛ ఎంసీఎల్ఆర్ విధానంలో ఉంటుంది. ఎంసీఎల్ఆర్ అంటే క్లుప్తంగా నిధులపై బ్యాంక్‌లకు అయ్యే వ్యయం. దీనికి అదనంగా తనకు కావాల్సిన మార్జిన్‌ను బ్యాంక్ జోడించి రుణాలపై రేటును నిర్ణయిస్తుంది. ఆర్బీఐ రేట్లను మార్చినప్పుడు ఎంసీఎల్ఆర్లోనూ మార్పులు చోటు చేసుకుంటాయి. కానీ, వెంటనే కాదు. సాధారణంగా ఆరు నెలల నుంచి ఏడాది సమయం తీసుకుంటుంది. ఎంసీఎల్ఆర్లో ఒక్క రెపో రేటు కాకుండా, ఇతర అంశాలు కూడా రేట్లను ప్రభావితం చేస్తాయి. నిజానికి ఎంసీఎల్ఆర్ విధానం అంత పారదర్శకమైనది కాదు. రిటైల్ రుణ గ్రహీతలు దీన్ని అర్థం చేసుకోలేరు. ఈ లోపాలను అధిగమించేందుకు వీలుగా ఆర్బీఐ 2019లో రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్)ను ప్రవేశపెట్టింది. రుణం బదిలీతో ఆదా ఎంత? వడ్డీ రేట్లు పెరిగినప్పుడు సాధారణంగా బ్యాంక్‌లు గృహ రుణాలపై ఈఎంఐని పెంచడానికి బదులు, రుణ కాలవ్యవధిని పెంచుతుంటాయి. దాంతో ఈఎంఐలో ఎలాంటి మార్పు ఉండదు. దీంతో ఇబ్బందేమీ లేదన్నట్టు వ్యవహరించరాదు. ప్రస్తుత బ్యాంక్ లేదా ఎన్‌బీఎఫ్‌సీతో మెరుగైన డీల్ కోసం సంప్రదించాలి. సానుకూల స్పందన రానప్పుడు మిగిలి ఉన్న రుణ బకాయిని మరో బ్యాంక్‌కు బదిలీ చేసుకోవడాన్ని పరిశీలించాలి. బ్యాలన్స్ బదిలీకి సంబంధించి అర్హత ఉందా? అన్నది తెలుసుకోవాలి. బ్యాలన్స్ బదిలీకి అనుమతించే విషయంలో కొన్ని బ్యాంక్‌లు, పూర్వపు సంస్థ వద్ద కనీసం 24 నెలల పాటు అయినా క్రమం తప్పకుండా ఈఎంఐ చెల్లించిన చరిత్రను అడుగుతున్నాయి. ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు, లేదా స్వా«దీనం చేసిన ఇళ్లకు సంబంధించి రుణం బ్యాలన్స్ బదిలీకే బ్యాంక్‌లు ఆసక్తి చూపిస్తున్నాయి. వీటికి అదనంగా వేతనం, క్రెడిట్ స్కోర్ కూడా కీలకమవుతాయి. ముఖ్యంగా మిగిలిన రుణాన్ని, తక్కువ వడ్డీ రేటుకు ఆఫర్ చేస్తున్న మరో సంస్థకు బదిలీ చేసుకోవడం వల్ల కొంత ఆదా చేసుకుందామని భావించే వారు.. అసలు ఎంత ఆదా అవుతుందన్న దానిపై అంచనాకు రావాలి. ఉదాహరణకు రూ.75 లక్షల రుణం, 20 ఏళ్ల కాలానికి మిగిలి ఉందని అనుకుందాం. 9.5 శాతం వడ్డీ రేటు ఆధారంగా దీని ఈఎంఐ రూ.69,910 అవుతుంది. ఈ రుణాన్ని బదిలీ చేసుకుంటే, కొత్త సంస్థ 9.1 శాతం రేటుకు ఆఫర్ చేసిందనుకుంటే, అప్పుడు ఎంతో ఆదా అవుతుంది. కొత్త సంస్థ వద్ద 9.1 శాతం రేటు ప్రకారం ఇదే రుణంపై ఈఎంఐ రూ.67,963 అవుతుంది. 20 ఏళ్ల కాలంలో రూ.4,67,280 ఆదా అవుతుంది. ఇది ఏడు నెలల ఈఎంఐకి సమానం. అంటే రుణం ఏడు నెలల ముందే తీరిపోతుంది. మరో సంస్థకు రుణాన్ని బదిలీ చేసుకోవడం వల్ల మిగిలే ప్రయోజనం ఇలా ఉంటుంది. రుణం తీసుకున్న తర్వాత పెరిగిన ఆదాయం, మెరుగుపడిన క్రెడిట్ స్కోర్, మెరుగైన చెల్లింపుల చరిత్ర ఆధారంగా కొత్త సంస్థ తక్కువ రేటుకు ఆఫర్ చేసే అవకాశాలు ఉంటాయి. వడ్డీ రేటు ఎంత తగ్గితే ఆదా అయ్యే మొత్తం అధికంగా ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ అయితే ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు తక్కువ రేట్లకు రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. 0.25–0.50 శాతం మేర వడ్డీ తక్కువగా ఉండి, రుణ చెల్లింపుల కాలం మరో 15 ఏళ్లు అయినా ఉంటే నిస్సంకోచంగా రుణాన్ని బదిలీ చేసుకోవచ్చు. 2024 మధ్య నుంచి వడ్డీ రేట్లు తగ్గితే, అప్పుడు ఈఎంఐ భారం మరింత దిగొస్తుంది. రూ. 20,000 వరకు చార్జీలు రుణ బదిలీలకు సంబంధించి న్యాయపరమైన, సాంకేతిక మదింపు చార్జీలు కూడా భరించాల్సి వస్తుంది. ఇవి రూ.5,000 నుంచి రూ. 20,000 వరకు ఉంటాయి. కొన్ని బ్యాంక్‌లు విడిగా పేర్కొనకుండా, ఈ మొత్తాన్ని ప్రాసెసింగ్ ఫీజులో కలిపేస్తున్నాయి. కనుక చార్జీల గురించి సమగ్రంగా అడిగి తెలుసుకోవాలి. ఇక మెమోరాండం ఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్ (ఎంవోడీటీ) గురించి కూడా తెలుసుకోవాలి. రుణ గ్రహీత తన ఇంటి డాక్యుమెంట్లను రుణదాతకు స్వా«దీనం చేయడం. రుణం ఇచ్చే సంస్థ తన పేరిట ఆ ప్రాపరీ్టని రిజి్రస్టేషన్ చేయించుకుంటుంది. ఇందుకు అయ్యే చార్జీలను రుణ గ్రహీత భరించాల్సి వస్తుంది. ఈ చార్జీలు రుణంలో 0.1–0.2 శాతంగా ఉంటాయి. ఇందులో ఎలాంటి తగ్గింపు రాదు. సుమారు రూ.75 లక్షల గృహ రుణాన్ని ఒక సంస్థ నుంచి మరో సంస్థకు బదిలీ చేసుకుంటున్నారని అనుకుంటే, ఇందుకోసం పలు రకాల చార్జీల రూపంలో రూ.62,500 వరకు కోల్పోవాల్సి వస్తుంది. లీగల్ ఫీజులు, ప్రాసెసింగ్ ఫీజుల్లో తగ్గింపు పొందడం ద్వారా ఈ భారాన్ని వీలైనంత తగ్గించుకోవచ్చు. పారదర్శక.. రెపో లింక్డ్ లెండింగ్ రేట్ రెపో లింక్డ్ లెండింగ్ రేట్ ఎంతో పారదర్శకమైనది. రెపో రేట్‌కు బ్యాంక్‌లు తమకు కావాల్సిన మార్జిన్‌ను కలిపి రుణాలపై రేట్లను నిర్ణయిస్తాయి. దీంతో రుణ గ్రహీతలు సైతం సులభంగా అర్థం చేసుకోగలరు. రెపో రేటు పెరిగి, తగ్గినప్పుడు తమపై పడే భారం ఎంతన్నది సులభంగా తెలుసుకోగలరు. అంతేకాదు రేట్ల విధానం సులభంగా ఉండడంతో, ఆర్బీఐ రెపో రేటును సవరించిన వెంటనే బ్యాంక్‌లు రుణ గ్రహీతలకు దాన్ని బదలాయిస్తాయి. సాధారణంగా ఆర్బీఐ రెపో రేటు సవరణ అనంతరం వారం నుంచి నెల రోజుల వ్యవధిలో ఆర్ఎల్ఎల్ఆర్ రుణాల రేట్లు మార్పులకు లోనవుతాయి. రెపో రేటు విధానంలో.. వడ్డీ రేట్లు తగ్గించడం, పెంచడం వేగంగా జరుగుతుంది. కనుక వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో ఆ భారం వెంటనే రుణ గ్రహీతలకు బదలాయింపు అవుతుందని గుర్తు పెట్టుకోవాలి. ఈ విధానంలో బ్యాంక్‌లు సాధారణంగా రెపో రేటుపై 2.5–3 శాతాన్ని తమ మార్జిన్ కింద చార్జ్ చేస్తుంటాయి. ప్రస్తుతం గృహ రుణాలపై బ్యాంక్‌లు 9.5–10 శాతం వసూలు చేస్తున్నాయి. రెపో రేటు 6.5 శాతంపై 3–3.5 శాతం మార్జిన్‌గా వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్బీఎఫ్సీలు అయితే 10.5 శాతం వరకు చార్జ్ చేస్తున్నాయి. అయితే, ఇదే రేటు అందరికీ ప్రామాణికంగా అమలవుతుందని చెప్పలేం. రుణం మొత్తం, కాల వ్యవధి, క్రెడిట్ స్కోర్ తదితర అంశాలు కూడా రేటుపై ప్రభావం చూపిస్తాయి. రేట్ల అస్థిరతలు పెద్ద పట్టింపు కాదంటే, రిటైల్ రుణ గ్రహీతలకు ఎంసీఎల్ఆర్ కంటే ఆర్ఎల్ఎల్ఆర్ రేటు అనుకూలంగా ఉంటుంది. చార్జీల పట్ల అవగాహన ఫిక్స్డ్ వడ్డీ రేటు విధానంలో రుణం తీసుకున్న వారు, మరో సంస్థకు దాన్ని బదిలీ చేసుకోవడం ఖరీదైన వ్యవహారమే అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే రుణం ఇచి్చన సంస్థ మిగిలి ఉన్న రుణాన్ని బదిలీ చేసేందుకు గాను, ఆ మొత్తంపై 2–4 శాతం వరకు చార్జ్ వసూలు చేయవచ్చు. అదే ఫ్లోటింగ్ రేట్ విధానంలో రుణం తీసుకుని ఉంటే, ఎలాంటి ముందస్తు చెల్లింపుల రుసుములు లేకుండా మిగిలి ఉన్న రుణాన్ని మరో బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీకి బదిలీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్లోటింగ్ రేట్ రుణాలపై ముందస్తు చెల్లింపుల చార్జీలను ఆర్బీఐ నిషేధించింది. అయితే రుణాన్ని మరో సంస్థకు బదిలీ చేసుకోవాలంటే రుణ గ్రహీత కొన్ని రకాల చార్జీలు భరించాల్సి వస్తుంది. అన్ని బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తున్నాయి. రుణంపై (బదిలీ చేసుకునే మొత్తం) 0.50 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు కింద చాలా బ్యాంక్‌లు తీసుకుంటున్నాయి. కొన్ని ప్రభుత్వరంగ బ్యాంక్‌లు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయడం లేదు. నూతన తరం బ్యాంక్‌లు, కొన్ని ఎన్బీఎఫ్సీలు 3 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటున్నాయి. కాకపోతే అన్ని బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీల్లో ఒకే మాదిరి చార్జీలు ఉంటాయని అనుకోవద్దు. కనుక ఆయా సంస్థల వెబ్సైట్లకు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. నేరుగా సంప్రదింపులు చేయడం ద్వారా చార్జీల భారం లేకుండా చూసుకోవచ్చు. బదిలీ చేస్తే అయ్యే వ్యయాలు బదిలీ రుణం :రూ.75 లక్షలు ప్రాసెసింగ్ ఫీజు రుణంపై: 0.3–3% వరకు లీగల్ ఫీజు :రూ.5,000–20,000 ఎంవోటీడీ చార్జీలు :రుణంపై 0.1–0.2 శాతం ఫ్రాంకింగ్ చార్జీలు :రుణంపై 0.1–0.2 శాతం -
మీ బద్ధకం అమ్మకు భారమే
చలికాలం ముసుగు తన్ని పడుకుంటే ఎంత బాగుణ్ణు. బెడ్ దగ్గరకు పొగలు గక్కే టీ వస్తే ఎంత బాగుణ్ణు. టిఫిన్లూ, సూప్‌లు, సాయంత్రం ఉడకబెట్టిన పల్లీలు... ఎంత బాగుణ్ణు. అన్నట్టు రగ్గులు, బొంతలు భలే శుభ్రంగా, పొడిగా ఉండాలండోయ్. చలికాలం ఎవరికీ పని చేయబుద్ధేయని కాలం. కాని అమ్మకు తప్పుతుందా? అమ్మ వెచ్చని రగ్గు కప్పుకుని టీవీ చూస్తూ ‘టీ తెండి’ అని అరిస్తే ఒకరోజైనా ఇస్తారా ఎవరైనా? చలికాలంలో ఇంటి సభ్యులు ఏం చేయాలి? స్కూల్ టైమ్ మారదు. ఉదయం 8 లోపు బస్సొచ్చి ఆగుతుంది. పిల్లలకు బాక్స్ కట్టివ్వడమూ తప్పదు. ఏడున్నరకంతా కట్టాల్సిందే. టిఫిన్ తినిపించాల్సిందే. ఎంత చలి ఉన్నా, ఎంత మంచు కమ్ముకున్నా, ఎంత బద్ధకంగా ఉన్నా, ఎంత ముసుగుతన్ని నిద్రపోవాలని ఉన్నా అమ్మకు తప్పుతుందా? అమ్మ లేవకుండా ఉంటుందా? వంట గదిలో వెళ్లకుండా ఉంటుందా? నాన్న అరగంట లేటుగా లేవొచ్చు. వాకింగ్ ఎగ్గొట్టి అమ్మ ఇచ్చిన టీని చప్పరిస్తూ పేపర్‌ను చదువుతూ ఉండొచ్చు. కాని అమ్మ మాత్రం అదే వంట చేయాల్సిందే. రోజువారీ అంట్లు, బట్టల ఉతుకుడు చూడాల్సిందే. ఆమెకు ఇంట్లో నుంచి ఎలాంటి సాయం అందుతున్నదో ఆలోచించామా ఎప్పుడైనా? బద్ధ్దకమైన కాలం ఇది చలికాలం బద్ధకం కాలం. తలుపులు కిటికీలు మూసుకుని అరచేతులు రుద్దుకుంటూ కూచోమని చెప్పే కాలం. బబ్బుంటే బాగుండు అనిపించే కాలం. అమ్మకు ‘ఈ పూట ఎవరైనా వంట చేసి పెడితే బాగుండు’ అనిపించినా అలా చేసేవారు ఎవరు? ‘రోజూ వండుతున్నావ్ కదా ఇవాళ బజారు నుంచి వేడి ఇడ్లీ తెస్తానులే’ అని బండి తాళం అందుకునే నాన్నలు ఎందరు? పాలల్లో కొన్ని చాకోస్ వేసివ్వు చాలు అనే పిల్లలు, బ్రెడ్ ఆమ్లేట్ చేసుకుని తింటాలే అనే భర్తలు ఉన్న ఇల్లు ఇల్లాలి శ్రమను గుర్తించే ఇల్లు. ‘కాసేపు పడుకోలే’ అని లేచి పేపర్లు లోపల పడేసి, పాలు ఫ్రిజ్‌లో పెట్టి, ఒక ప్యాకెట్ గిన్నెలో వేడి చేసి, కాఫీ కలిపి భార్యను లేపితే ఎంత బాగుంటుంది. మగవాళ్లు బట్టలు ఎలాగూ ఉతకరు. ‘చెమ్మగా ఉన్నాయి’ అని విసుక్కునే బదులు కనీసం ఎండ తగిలే తీగ దాకానో, డాబా మీదనో తీసుకెళ్లి ఆరేసే సాయం చేయరు. ఇలాంటి సమయంలో ‘బట్టలు ఆరేయడం’ అనే చిన్న పని కూడా చాలా పెద్ద సాయం కిందకు వస్తుంది.ఈ రోజుల్లో ప్రత్యామ్నాయ టిఫిన్లు, ఇన్స్టంట్ టిఫిన్లు ఎన్నో మార్కెట్లో ఉన్నాయి. యూట్యూబ్‌లో కొడితే వందలాది వీడియోలు ఉన్నాయి. తెచ్చిపెట్టే స్విగ్గి, జొమాటోలు ఉన్నాయి. ఈ శీతాకాలంలో ఉదయపు వంట చెర నుంచి అమ్మకు ఏ విధంగా ఉపశమనం ఇవ్వొచ్చో తప్పక ఆలోచించాలి. ఇంట్లో పెద్దవారు ఉంటే? అమ్మమ్మో, నానమ్మో ఇంట్లో ఉంటే వారి గురించి ఇల్లంతా మరింత శ్రద్ధ పెట్టాలి. మంచి షాల్, రగ్గు వారికి ఏర్పాటు చేయాలి. నేలకు పాదాలు తాకి జిల్లు మనకుండా ఇంట్లో తిరగడానికి మంచి స్లిప్పర్లు ఇవ్వాలి. స్లిప్పర్లలోనే తిరగమని చెప్పాలి. చలికి ఆకలి ఎక్కువ. పెద్దవారు పసిపిల్లల్లా మారి నోటికి హితంగా వేడివేడిగా అడుగుతారు. వారికి ఏదో ఒకటి చేసి పెట్టాలి. ఆ పనిలో కూడా అమ్మకు భర్త, పిల్లలు ఏదో ఒక మేరకు సాయం చేయాలి. వారికి వెచ్చని గది కేటాయించాలి. లేదా ఇంట్లోని వెచ్చని ప్రదేశమైనా. శుభ్రత అందరిదీ శీతాకాలం ఇల్లు మబ్బుగా ఉంటుంది. ఇటు పుల్ల అటు పెట్టబుద్ధి కాదు. కాని ప్రయత్నం చేసి ఇల్లు ప్రతి రోజూ సర్దుకునే పడుకోవాలి. హాల్లో బెడ్రూముల్లో కిచెన్‌లో కుటుంబ సభ్యులంతా నిద్రకు ముందు వీలైనంత శుభ్రంగా, సర్ది పడుకుంటే ఉదయాన్నే అమ్మ లేచినప్పుడు చిందర వందర లేకుండా పనిలో పడబుద్ధి అవుతుంది. పక్క బట్టలు మడవడం కూడా కొంతమంది చేయరు. అలాంటి వారిని తప్పక గాడిలో పెట్టాలి. చలికాలం అమ్మకి పని తేలిక చేద్దాం. చలికాలాన్ని ఎంజాయ్ చేసేలా చూద్దాం. అమ్మకు కావాలి వెచ్చని దుస్తులు సాధారణంగా ఇళ్లల్లో నాన్నకు హాఫ్ స్వెటర్లు ఉంటాయి. ఎప్పుడూ వేసుకునే ఉంటాడు. అమ్మకు మాత్రం ఎందుకనో స్వెటర్ ఉండదు. కొని తేవాలని ఎవరికీ అనిపించదు. చాలా ఇళ్లల్లో అమ్మలు పాతబడిన స్వెటర్లతోనే తిరుగుతూ ఉంటారు ఈ సీజన్లలో. ఒక రంగురంగుల కొత్త స్వెటర్ కొనుక్కోవాలని వారికి ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నా, గృహిణి అయినా తాను కొనుక్కునే చొరవకు ఎప్పుడూ అమ్మ దూరంగానే ఉంటుంది. స్వెటర్ లేకుండానే చలికాలం గడిపేస్తుంది. ఆమెకు స్వెటర్, సాక్సులు, స్కార్ఫ్‌లు కావాలి. ఉన్నాయా గమనించండి. ఆమె అడగదు. తెచ్చి పెట్టండి. శీతాకాలంలో స్త్రీలు తమ శరీరం గురించి ఆలోచన చేస్తారు. చర్మాన్ని, శిరోజాల్ని కాపాడుకోవడానికి వారికి కొన్ని వస్తువులు అవసరం. క్రీములు, నూనెలు, సబ్బులు... ఏర్పాటు చేయాలి. చర్మ సమస్యలు కొందరిలో రావచ్చు. వాటిని చిట్కాలతో సరిపుచ్చుతూ బాధ పడాల్సిన పని లేదు. వైద్యుల దగ్గరకు వెళ్లాలి. తీసుకువెళ్లాలి. ఇక ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉంటే చలికాలం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రోజువారీ చాకిరీ నుంచి దాదాపుగా తప్పించాలి. -
Delhi Pollution: ఆ భారం మాపైకి నెట్టేయకండి
న్యూఢిల్లీ: కాలుష్యాన్ని నియంత్రించే విషయంలో కోర్టుపైకి భారం నెట్టేసే ప్రయత్నాలు మానుకోవాలని ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఢిల్లీలో మళ్లీ సరి–బేసి ట్రాఫిక్ విధానం తేవడంపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని, తామెలాంటి ఆదేశాలూ ఇవ్వలేదని స్పష్టం చేసింది. సరి–బేసి విధానంతో తమకు ఎటువంటి సంబంధం లేదని, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి ప్రవేశించే ట్యాక్సీలకు కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని తామెన్నడూ తెలపలేదని పేర్కొంది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది. సరి–బేసి విధానం కాలుష్యాన్ని తగ్గించడంలో అంతగా పనిచేయదని అమికస్ క్యూరీకి చెప్పామని గుర్తు చేసింది. ‘‘మీరేం చేయాలో చెప్పడానికి మేమిక్కడ లేం. ఆ విధానం కొనసాగించొద్దు అని మేం చెప్తే, సుప్రీంకోర్టు ఆదేశించినందువల్లే కాలుష్యం ఎక్కువైందని మీరంటారు’’ అని పేర్కొంది. ఢిల్లీలో వాయు నాణ్యత మెరుగు పడినందున సరి–బేసి విధానం అమలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. -
ఇజ్రాయెల్-పాలస్తీనా వార్: పెట్రోలు, నిత్యావసరాల ధరల వాత తప్పదా?
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం దేశీయంగా ప్రజలపై పెనుభారం పడనుందా? పెట్రోలు సహా, పలు వినియోగ వస్తువులు, ఇతర ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయా అంటే అవుననే అంచనాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఇజ్రాయెల్-పాలస్తీనా సంక్షోభం ప్రపంచ ముడి చమురు సరఫరాను ప్రభావితం చేయనుంది. దీంతో పాటు వివిధ వినియోగ ఉత్పత్తులు ఇతర మరెన్నో ప్రపంచ సరఫరాలకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ప్రభావ తీవ్రతను కచ్చితంగా అంచనా లేనప్పటికీ ధరల పెరుగుదల తప్పదనేది నిపుణుల మాట. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ గోధుమ సరఫరాపై ప్రభావం చూపినట్లే, ఇజ్రాయెల్-హమాస్ వార్ ప్రపంచ ముడి చమురు సరఫరాకు ముప్పు తెస్తుందని, తద్వారా దేశంలో హైదరాబాద్ లాంటి ఇతర ప్రధాన నగరాల్లోని ప్రజల గృహవినియోగం భారం పడుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు ధర ఇప్పటికే 7.5 శాతానికి పైగా పెరిగింది.ఇప్పటికే బంగారం ధరలు కొండెక్కి కూర్చుకున్నాయి. ఎన్‌సిఆర్‌కు చెందిన వైట్ గూడ్స్ తయారీదారు సూపర్ప్లాట్రానిక్స్ సీఈవో అవనీత్ సింగ్ మార్వా ప్రకారం, యుద్ధం మరో పక్షం రోజులు కొనసాగితే, నవంబర్‌లో స్మార్ట్ టెలివిజన్లు, వాషింగ్ మెషీన్లు, ఇతర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. చమురు ధరలు పెంపు తయారీదారులను రెండు రంగాల్లో ప్రభావితం చేస్తుంది. ఎలక్ట్రానిక్, గృహోపకరణాలలో కీలకమైన పదార్థం ప్లాస్టిక్ ధరలు, లాజిస్టిక్స్, సరఫరా ఖర్చులు పెరుగుతాయి. పరిశ్రమ అంచనాల ప్రకారం ఉత్పత్తి , డెలివరీ ఖర్చులో ఈ రెండింటి వాటా దాదాపు 33 శాతం. ఇంకా, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) వస్తువులు వంటివి ప్రభావితం కావచ్చు. దేశంలోని ఎఫ్ఎంసీజీ తయారీదారులు ఇప్పటికే పేలవమైన అమ్మకాలు, గ్రామీణ కుటుంబాల నుండి తగ్గిన డిమాండ్‌తో సతమత మవుతున్నారు. Nuvama ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ విశ్లేషకుల ప్రకారం, జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో వాల్యూమ్ వృద్ధి తక్కువగానే ఉంటుంది, ఆగస్టు నెలలో వర్షపాతం లోటు వందేళ్ల గరిష్టానికి చేరడంతో ప్రముఖ FMCG కంపెనీల వృద్ది సింగిల్ డిజిట్‌కే పరిమితం కానుంది.బీఎన్పీ పారిబాస్ డైరెక్టర్-హెడ్ ఆఫ్ ఇండియా ఈక్విటీ రీసెర్చ్, కునాల్ వోరా ప్రకారం, సెప్టెంబర్ త్రైమాసికంలో ఆయా కంపెనీల ఆదాయాలు పడిపోయాయి. అంతర్జాతీయ ఆదాయంలో మధ్య-ప్రాచ్య ప్రాంతం వాటా ఉన్న డాబర్ , మారికో లాంటి భారతీయ కంపెనీలకు నష్టమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి అక్టోబర్ 6 నాటికి ముడి చమురు ధర బ్యారెల్‌కు 84.58 డాలర్లు ఉండగా, ఈరోజు (అక్టోబర్ 16) 90.98 డాలర్లకు పెరిగింది. ఈ యుద్ధం మరింత తీవ్రతరమైతే ముడి చమురు ధరలు పైకి ఎగియ వచ్చు. దీంతో భారతదేశంతో సహా చమురు-దిగుమతి చేసుకునే దేశాలకు చమురు ధరలను పెంచడం తప్ప వేరే మార్గం ఉండదనే అంచనాలున్నాయి. అంతేకాదు ఈ యుద్ధంతో దేశీయ టీ ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు. దేశంనుంచి తేయాకును ఎక్కువగా కొనుగోలు చేసే దేశాల్లో ఒకటైన ఇరాన్‌పై ప్రభావం చూపితే అది తమ పరిశ్రమను కూడా ప్రభావితం చేస్తుందనేది ప్రధాన ఆందోళన. గాజాలో ఇజ్రాయెల్ తన చర్యలను ఆపకపోతే తాము చూస్తూ ఉరుకోబోమన్న ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరాబ్డొల్లాహియాన్ వ్యాఖ్యలు ఈ వాదనలకు మరింత ఊతమిస్తున్నాయి. ఈ వార్‌లో ఇరాన్- లెబనాన్ చేరిపోతే మధ్యప్రాచ్య ప్రాంతంలో పరిస్థితి మరింత ముదురుతుందనే ఆందోళన నెలకొంది. -
ఓపీఎస్‌తో అధోగతే..
సాక్షి, అమరావతి: దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న జాతీయ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్) నుంచి ప్రభుత్వోద్యోగులు పాత పెన్షన్ స్కీముకు (ఓపీఎస్) మారితే రాష్ట్రాలు అథోగతి పాలవుతాయని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధ్యయన నివేదిక ఆందోళన వ్యక్తంచేసింది. ఇదే జరిగితే భవిష్యత్తు తరాల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని.. వారి ప్రయోజనాల విషయంలో రాజీపడటమేనని ఆర్బీఐ నివేదిక హెచ్చరించింది. ఇటీవల కొన్ని రాష్ట్రాలు ఎన్పీఎస్ నుంచి ఓపీఎస్‌కు మారుతామని చెబుతున్న నేపథ్యంలో.. వివిధ రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితులు, ప్రస్తుత ఉద్యోగుల పెన్షన్ భారం, ఓపీఎస్‌కు మారితే భవిష్యత్‌లో పెరిగే పెన్షన్ల వ్యయం, తద్వారా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను బేరీజు వేస్తూ ఆర్బీఐ తన అధ్యయన నివేదికను విడుదల చేసింది. ఓపీఎస్‌కు వెళ్లడమంటే ఆర్థిక సంస్కరణల్లో వెనుకడుగు వేయడమేనని తేల్చిచెప్పింది. అలాగే, ఓపీఎస్‌కు మారడంవల్ల రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై పెనుభారం పడుతుందని పేర్కొంది. అదే జరిగితే రాష్ట్రాల మొత్తం పెన్షన్ భారం 2023 మార్చి చివరి నుంచి 2084 మార్చి చివరి వరకు సగటున 4.5 రెట్లు పెరుగుతుందని ఆర్బీఐ నివేదిక స్పష్టంచేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇది 4.3 రెట్లు ఉంటుందని తెలిపింది. దీర్ఘకాలిక వృద్ధిపై తీవ్ర ప్రభావం.. మరోవైపు.. 2022 నవంబర్ నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి ఎన్పీఎస్ ఉద్యోగుల సంఖ్య 50 లక్షలు ఉందని, వీరి ఎన్పీఎస్ కంట్రిబ్యూషన్ కార్పస్ ఫండ్ రూ.2.5 లక్షల కోట్లు ఉందని ఆ నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో వీరి సంఖ్య రెండున్నర లక్షలు ఉందని.. ఇప్పటికే ఏపీ సొంత రెవెన్యూ రాబడిలో పెన్షన్లకు 24 శాతం వ్యయమవుతోందని, ఓపీఎస్‌కు మారితే పెన్షన్ల వ్యయం భారీగా పెరుగుతుందని నివేదిక వెల్లడించింది. ఇది మూలధన వ్యయాన్ని తగ్గిస్తూ దీర్ఘకాలిక వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. భవిష్యత్తు తరాల ప్రయోజనాలకు తీరని నష్టం కలిగిస్తుందని కూడా ఆర్బీఐ హెచ్చరించింది. ప్రస్తుతం ఎన్పీఎస్ విధానంలో ఉద్యోగులు రిటైరయ్యాక చివరిగా తీసుకున్న జీతంలో 50 శాతం పెన్షన్ పొందుతారని, డియర్నెస్ రిలీఫ్ రివిజన్ల ప్రయోజనాన్ని కూడా పొందుతారని తెలిపింది. అయితే, ఉద్యోగులకు ఓపీఎస్ విధానం ఆకర్షణీయంగా ఉండవచ్చుగానీ ప్రభుత్వాల మీద అపారమైన ఆర్థిక భారాన్ని కలిగిస్తుందని, తద్వారా భవిష్యత్ సంవత్సరాల్లో ప్రభుత్వ పెన్షన్ బాధ్యతలను మరింత పెంచుతుందని నివేదిక స్పష్టంచేసింది. ఓపీఎస్‌కు మారితే మొత్తం రాష్ట్రాల పెన్షన్ భారం 2040 నుంచి 2060 వరకు భారీగా పెరుగుతుందని, ఇది దేశ జీడీపీలో 0.9 శాతానికి చేరుకుంటుందని ఆర్బీఐ నివేదిక పేర్కొంది. భవిష్యత్తులో పెన్షన్లు చెల్లించడమే కష్టం.. ఇక ఎన్పీఎస్ నుంచి ఓపీఎస్‌కు మారితే మొత్తం రాష్ట్రాల పెన్షన్ల వ్యయం 2023 నుంచి పెరగడం ప్రారంభమై 2045 నాటికి లక్ష కోట్లకు చేరుతుందని, 2057 సంవత్సరం నాటికి రూ.1.80 లక్షల కోట్లకు పెరుగుతుందని.. ఇది రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలకు పెనుభారం కానుందని ఆ నివేదిక తెలిపింది. భవిష్యత్‌లో పెన్షన్లను చెల్లించడమే చాలా కష్టతరం కావచ్చునని వ్యాఖ్యానించింది. అంతేకాక.. ఓపీఎస్‌కు వెళ్తే భవిష్యత్ తరాల ప్రయోజనాల విషయంలో రాజీపడటమే అవుతుందని, ఇది రాష్ట్రాలకు మంచిది కాదని ఆర్బీఐ అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం 2019 ఏప్రిల్ 1 నుంచి ఎన్పీఎస్ ఉద్యోగుల పెన్షన్ కంట్రిబ్యూషన్‌ను 14 శాతానికి పెంచిందని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 14 శాతానికి పెంచాల్సి ఉందని తెలిపింది. -
చిన్న సంస్థలకు కేంద్రం గుడ్ న్యూస్!
చిన్న సంస్థల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెయిడ్ అప్ క్యాపిటల్, టర్నోవర్ థ్రెషోల్డ్‌లను ప్రభుత్వం సవరించింది. ఈ నిర్ణయం సంస్థలపై నిర్వాహణ భారం తగ్గడంలో సహాయ పడనుంది. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వ్యాపార నిర్వహణను మరింత సౌలభ్యం చేసే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా కేంద్రం సవరించిన నిబంధనల మేరకు చిన్న సంస్థల చెల్లింపు మూలధనం (paid up capital) థ్రెషోల్డ్ గతంలో రూ. 2 కోట్లకు మించకూడదు అనే నిబంధన ఉంది. ఇప్పుడు దాన్ని సవరించి రూ. 4 కోట్లకు పెంచింది. ►అదేవిధంగా, రూ. 20 కోట్ల టర్నోవర్ థ్రెషోల్డ్‌ను రూ.40 కోట్లకు మించకుండా సవరించినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ సవరణలతో చిన్న కంపెనీల జాబితాలో మరిన్ని ఎంటిటీలు(సంస్థలకు) చేరనున్నాయి. ►మంత్రిత్వ శాఖ ప్రకారం..ఇకపై చిన్న కంపెనీలు ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో భాగంగా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ను సిద్ధం చేయాల్సిన పనిలేదు. వార్షిక రిటర్న్‌ను ఫైల్ చేసుకోవచ్చు. ►చిన్న సంస్థలకు జరిమానాలు తక్కువగా పడనున్నాయి. అటువంటి సంస్థల వార్షిక రాబడిపై కంపెనీ సెక్రటరీ లేదా కంపెనీ సెక్రటరీ లేని చోట కంపెనీ డైరెక్టర్ సంతకం చేయడంతో పాటు ఇతర సౌకర్యాలు కలగనున్నాయి. -
విద్యుత్ సంస్కరణలతో రైతులపై భారం
శాలిగౌరారం/ మోత్కూరు/చిట్యాల/ నార్కట్‌పల్లి: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యుత్ సంస్కరణలు రైతులకు భారంగా మారనున్నాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. నూతన వ్యవసాయ చట్టాలతో ఒప్పంద వ్యవసాయవిధానం అమలుకు అవకాశం కల్పించిందని, రైతులు కార్పొరేట్ వ్యవస్థలోకి వెళ్లనున్నారని దీంతో వ్యవసాయ మార్కెట్లు నిర్వీర్యమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం, యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌తో కలిసి ఆయన శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. మోత్కూరు మార్కెట్ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా దమ్ముంటే అటువంటి పథకాలు అమలు చేయాలని సవాలు విసిరారు. రాష్ట్రంలో కేంద్రప్రభుత్వ అధీనంలోని 6 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. సంక్షేమ పథకాల అమలుతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రాన్ని చూసి ఓర్వలేకే ప్రతిపక్ష పార్టీలు యాత్రలు చేస్తున్నాయని నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. శాలిగౌరారం వెళ్తూ మార్గమధ్యంలో చిట్యాలలో రైతు కొంతం సత్తిరెడ్డి వ్యవసాయక్షేత్రాన్ని పరిశీలించి అక్కడ పండించిన వంకాయలను మంత్రి కొనుగోలు చేశారు. నార్కట్‌పల్లిలోని ఓ ఎడ్ల బండిని చూసి.. చాలా రోజుల తర్వాత చూస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. మావోయిస్టు దళ సభ్యురాలు లొంగుబాటు చర్ల: మావోయిస్టు పార్టీ దళ సభ్యురాలు, పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ రక్షణదళ గార్డు ముసికి బుద్రి అలియాస్ బీఆర్ శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ వినీత్ ఎదుట లొంగిపోయింది. ఏఎస్పీ వివరాలు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా రాంపురంవాసి, గొత్తికోయ తెగకు చెందిన ముసికి బుద్రి ఆరేళ్లుగా పార్టీలో పని చేస్తోంది. ఆమె భర్త ముసికి సోమడాల్ అలియాస్ సోమనార్ కూడా ఊసూరు ఏరియా కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు నెలల వయసు ఉన్న బాబు ఉన్నాడు. కొంతకాలంగా రక్తహీనతతో బాధపడుతుండడంతో బుద్రి పోలీసులకు లొంగిపోయింది. -
‘కరోనా’ అప్పు..తీర్చడానికి జీవితకాలం
‘మిగిలింది’ 10 లక్షల అప్పే రేకుల షెడ్డులాంటి ఈ ఇల్లు కాషాగౌడ్ది. ఆయన ఇద్దరు బిడ్డల పెళ్లిళ్ల కోసం రూ.10 లక్షల అప్పుచేశాడు. అది కాస్తా తీరి కుదుటపడుతున్న వేళ కరోనా ఆయనతో సహా భార్యను పొట్టనపెట్టుకుంది. వీరిని కాపాడుకునేందుకు కుమారుడు మురళీగౌడ్ రూ.10 లక్షలు వెచ్చించాడు. అమ్మానాన్న దక్కలేదు కానీ.. అప్పు మిగిలింది. అసలే రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలు కూడదీసుకోలేని పరిస్థితి.. పై చిత్రంలో కనిపిస్తున్న ఇల్లమ్మితే తప్ప అప్పుతీరని దుస్థితి.. అదే జరిగితే భార్యాపిల్లలతో రోడ్డున పడతానంటున్న మురళి..చికిత్సకు లక్షలుపోసి అప్పుల ఊబిలో కూరుకుపోతున్న బాధితులపై వరుస కథనాలు నేటి నుంచి.. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పేదరికం వారిపాలిట శాపమైంది. అప్పు వారి జీవన ప్రయాణంలో భాగమైంది. కులవృత్తిపై ఆధారపడి బతుకు సాగించే ఆ కుటుంబం ఇప్పుడు ఛిన్నాభిన్నమైంది. ఎదిగొచ్చిన ముగ్గురు కూతుళ్లను మంచి అయ్యల చేతిలో పెట్టాలని ఆ తండ్రి చేసిన పది లక్షల అప్పు తీర్చేందుకు జీవిత కాలం పట్టింది. ఇక తన బాధలు తీరాయని.. గుండెలపై చెయ్యేసుకుని హాయిగా నిద్రపోతున్న సమయంలో కరోనా రాకాసి ఆ కుటుంబాన్ని కాటేసింది. సెకండ్ వేవ్‌లో దంపతులిద్దరికీ పాజిటివ్ రాగా.. చికిత్స కోసం మళ్లీ రూ.10 లక్షల వరకు అప్పులయ్యాయి. అయినా ఆ ఇద్దరి ప్రాణాలు దక్కలేదు. ఇప్పుడు ఆ రూ.10 లక్షల అప్పు తీర్చేందుకు వారి కొడుకుకు దారి కనిపించడం లేదు. ఉన్న ఇల్లు అమ్మితే గానీ అప్పులు తీరేలా లేవు. కానీ.. ఆ ఇల్లు కూడా అమ్ముకుంటే గూడు లేకుండా భార్యా పిల్లలను పోషించేదెలా అని ఆ కొడుకు మధనపడుతున్నాడు. జీవితాంతం అప్పు.. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లికి చెందిన ఆకుల లక్ష్మి (65), కాషాగౌడ్ (68) భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కూతుళ్లు, కొడుకు మురళీగౌడ్ ఉన్నారు. గీతవృత్తిని నమ్ముకుని కాషాగౌడ్ అంతంత మాత్రంగా వచ్చే ఆదాయంతో బతుకు బండిని లాగాడు. భార్య బీడీలు చుట్టేది. ముగ్గురు కూతుళ్ల పెళ్లిళ్లు చేసేందుకు రూ.10 లక్షల అప్పు చేశాడు. కొడుకుకు కూడా వివాహం చేశాడు. 45 ఏళ్లుగా కల్లు అమ్ముతూ.. పైసాపైసా కూడబెట్టి అప్పు తీర్చాడు. అప్పులు తీరాయని, ఇక భార్య, కొడుకుతో మలిదశలో మనశ్శాంతితో జీవించవచ్చని అనుకుంటున్న తరుణంలో గతనెలలో లక్ష్మీ, కాషాగౌడ్ దంపతులకు కరోనా సోకింది. తల్లికి రూ. 7 లక్షలు.. తండ్రికి రూ.3 లక్షలు కొద్దిరోజులు ఈ దంపతులు హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. లక్ష్మి పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స కోసం కొడుకు మురళీగౌడ్ తెలిసివారి వద్ద రూ. 7లక్షల అప్పు తీసుకొచ్చాడు. కాషాగౌడ్ పరిస్థితి కూడా అదుపుతప్పడంతో సిరిసిల్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. తండ్రి ప్రాణాలు దక్కించుకునేందుకు మురళి మరో రూ. 3 లక్షల అప్పు చేశాడు. అయితే లక్షలు ఖర్చు చేసినా తల్లి లక్ష్మి ప్రాణం దక్కలేదు. పరిస్థితి విషమించి గత నెల 22న చనిపోయింది. కడసారి చూడకుండానే.. తల్లి మరణించిన విషయం తండ్రి కాషాగౌడ్కు చెప్పకుండానే కొడుకు మురళి అంత్యక్రియలు పూర్తిచేశాడు. తండ్రిని సిరిసిల్ల నుంచి ఎల్లారెడ్డిపేటలోని మరో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. అనంతరం తల్లి మరణించిన విషయాన్ని తండ్రికి నెమ్మదిగా చెప్పిన మురళి.. ఆక్సిజన్ సిలిండర్ సాయంతో గతనెల 31న తల్లి దశదిన కర్మ కోసం కాషాగౌడ్ను ఇంటికి తీసుకొచ్చాడు. కార్యక్రమంలో భాగంగా తలనీలాలు సమర్పించి.. అందరితో మాట్లాడిన కాషాగౌడ్ సాయంత్రానికి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో మరణించాడు. వెంటాడిన కష్టాలు.. కాషాగౌడ్ కొడుకు మురళీగౌడ్ తల్లిదండ్రుల మరణంతో ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. తండ్రిలాగే ఇప్పుడు కొడుకు కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయా డు. గతంలో తండ్రి గీత వృత్తిలో ఉండగా మురళీగౌడ్ కొద్దిరోజులు కూలీపనికి వెళ్లాడు. తర్వాత ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేశాడు. కొంతకాలం స్వగ్రామంలో ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేశాడు. గతేడాది దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఇప్పటికీ కుడికాలు పని చేయడం లేదు. తన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం కోసం కూడా అప్పులు చేయాల్సి వచ్చింది. ఇన్నాళ్లు తల్లిదండ్రుల ఆసరా ఉండగా.. మురళీగౌడ్ వారి మరణంతో ఒంటరివాడయ్యాడు. భార్య, ఇద్దరు ఆడపిల్లలను పోషించుకోవడంతోపాటు.. రూ.10 లక్షల అప్పు ఎలా తీర్చేదని మదన పడుతున్నాడు. ఈ కష్టం పగవాడికి కూడా రావొద్దు అమ్మానాన్న మాకోసం జీవితకాలం కష్టపడ్డారు. నా తోబుట్టువుల పెళ్లిళ్లకోసం రూ.10 లక్షల అప్పుతెచ్చితీర్చడానికి జీవితకాలమంతా కష్టపడ్డాడు. అప్పులు తీర్చాక ఇక కష్టాలు పోయాయని అనుకుంటున్న సమయంలో మాయదారి కరోనా మా జీవితాలను నాశనం చేసింది. అమ్మానాన్నలను బతికించుకోవడానికి తెలిసి న చోటల్లా బతిమాలి రూ.10 లక్షల అప్పుతెచ్చాను. అయినా వారి ప్రాణాలు కాపాడుకోలేకపోయా. తెచ్చిన అప్పు తీర్చాలంటే దారి కనిపించడం లేదు. నా కాలు పనిచేయడం లేదు. ఉన్న ఒక్క ఇల్లును అమ్ముకుని అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది అమ్మితే ఇద్దరు పిల్లలతో నేను..నా భార్య రోడ్డున పడాల్సి వస్తుంది. ఈ పరిస్థితి పగవాడికి కూడా రావొద్దు. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ స్పందించి అమ్మానాన్నల వైద్యానికి అయిన ఖర్చు అందిస్తే.. జీవితకాలం రుణపడి ఉంటాం. – ఆకుల మురళీగౌడ్ -
‘చిన్నారుల వీపులు బద్దలవుతున్నాయ్’
సాక్షి, న్యూఢిల్లీ : ఒకే దేశం-ఒకే బోర్డు ప్రతిపాదనకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. చిన్నారులపై పుస్తకాల భారం మరింతగా మోపేందుకు సిద్దంగా లేమంటూ ఒక దేశం-ఒక బోర్డుపై దాఖలైన పిటిషన్‌ను ప్రోత్సహించలేమని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ‘మన చిన్నారులు ఇప్పటికే భారీ బ్యాగులు మోస్తున్నారు..ఈ బరువుతో వారి వీపులు బద్దలవుతున్నాయి..వారిపై మీరు మరింత భారం మోపాలని ఎందుకు అనుకుంటున్నార’ని న్యాయవాది, పిటిషనర్ అశ్వని ఉపాధ్యాయ్‌ను జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు. చిన్నారులపై సానుభూతితో వ్యవహరించాలని వారి స్కూల్ బ్యాగ్ బరువును పెంచడం తగదని కోర్టు పిటిషనర్‌కు సూచించింది. దేశమంతటికీ ఒకటే విద్యా బోర్డు, ఉమ్మడి సిలబస్ ఉండాలని పిటిషన్లో పేర్కొన్న డిమాండ్లు విధాన నిర్ణయాలకు సంబంధించినవని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. ప్రభుత్వ విధాన సంబంధ అంశాలను మీరు ప్రస్తావిస్తున్నారని, అన్ని బోర్డులను కలపాలని తాము ఎలా చెప్పగలమని కోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది. వివిధ రాష్ట్రాల బోర్డులు భిన్న సిలబస్‌లను అనుసరిస్తన్నాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తాను లేవనెత్తిన అంశాలు కీలకమైనవని పిటిషనర్ పేర్కొనగా, అవి ముఖ్యమైనవే అయినా న్యాయార్హమైనవి కాదని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. పిటిషనర్ తను ముందుకు తెచ్చిన అంశాలపై సంబంధిత అధికారులను సంప్రదించవచ్చని సూచించారు. చదవండి: దూబే ఎన్‌కౌంటర్‌పై విచారణ కమిటీ -
ఇక పాలు మరింత ప్రియం..
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికలు ముగిశాయో లేదో పెట్రో ధరల బాదుడు షురూ కాగా, తాజాగా నిత్యావసరమైన పాల ధరలు చుక్కలు చూస్తున్నాయి. ఉత్పత్తి వ్యయం పెరగడంతో మంగళవారం నుంచి పాల ధరలు లీటర్‌కు రూ 2 మేర పెరుగుతాయని డైరీ దిగ్గజం అమూల్ ప్రకటించింది. ఢిల్లీ, మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల్లో పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది. మార్చి 2017లో పాల ధరలు పెంచిన తర్వాత మళ్లీ ఇప్పుడు ధరలను సవరించామని అమూల్ బ్రాండ్‌పై పాలు, పాల ఉత్పత్తులను విక్రయించే గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) ఓ ప్రకటనలో పేర్కొంది. తాజా ధరలు మే 21 నుంచి వర్తిస్తాయని తెలిపింది. పాల ఉత్పత్తి తగ్గడం, ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో పాల ధరల పెంపు అనివార్యమైందని జీసీఎంఎంఎఫ్ తెలిపింది. -
348 ఇన్ఫ్రా ప్రాజెక్టులపై అధిక వ్యయాల భారం
న్యూఢిల్లీ: దేశంలో మౌలికరంగ ప్రాజెక్టులు పెరిగిన వ్యయాల భారంతో నత్తనడనక నడుస్తున్నాయి. రూ.150 కోట్లు అంతకంటే ఎక్కువ వ్యయంతో కూడిన 348 ప్రాజెక్టులు ఇప్పుడు రూ.3 లక్షల కోట్ల మేర అధిక వ్యయాలతో జాప్యం అవుతున్నట్టు కేంద్ర గణాంకాల శాఖ నివేదిక తెలియజేస్తోంది. ‘‘1,351 ప్రాజెక్టుల వాస్తవ నిర్మాణ వ్యయం 15,72,066 కోట్లు. అయితే, వీటి నిర్మాణం పూర్తయ్యే నాటికి అంచనా వ్యయం 18,72,201 కోట్లు. అంటే మొత్తం మీద పెరుగుతున్న వ్యయాల భారం రూ.3,00,135 కోట్లు (వాస్తవ వ్యయంపై 19% ఎక్కువ)’’ అని పేర్కొంది. -
వినోదానికి తెర
పాత గుంటూరు: సామాన్యుడికి వినోదం పంచే సినిమాకు తెర పడింది. నష్టాల నుంచి గట్టెక్కేందుకు థియేటర్ యజమానులు, పంపిణీదారులు, నిర్మాతలు ఉద్యమబాట పట్టి బంద్‌కు పిలుపునివ్వడంతో సినిమా హాళ్లు మూతబడ్డాయి. దీంతో ఈ రంగంపై ఆధారపడిన వేలాదిమంది ఉపాధి దెబ్బతింది. డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు వసూలు చేసే ధరల్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ దక్షిణ భారత చిత్ర పరిశ్రమ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు థియేటర్ యాజమాన్యాలు బంద్‌ను పాటిస్తున్నాయి. ఈనెల 2వ తేదీ నుంచి జిల్లాలోని 200 థియేటర్లు మూతబడ్డాయి. ఈనెల 9 వరకు బంద్ కొనసాగనుందని తెలిసింది. బంద్ ఎందుకు చేయాల్సి వచ్చింది? గతంలో సినిమాలను మనందరికీ తెలిసిన రీల్ ఫార్మెట్లో ప్రొజెక్టర్ల ద్వారా ప్రదర్శించేవారు. 12 ఏళ్ల కిందట డిజిటల్ సినిమా రంగప్రవేశం చేసింది. ల్యాబ్ నుంచి ప్రింట్ తెచ్చుకునే అవసరం లేకుండా హార్డ్ డిస్క్‌ను తెచ్చుకుని డిజిటల్ ప్రొజెక్టర్‌లో పెట్టి సినిమా వేసుకునే పరిజ్ఞానం వచ్చింది. ఈ టెక్నాలజీని తీసుకొచ్చిన వారిని డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు(డీఎస్పీ)లుగా వ్యవహరిస్తున్నారు. వీరు దేశమంతటా తమ టెక్నాలజీని దశల వారీగా అమర్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు దేశంలో ఎక్కడా రీల్ ఫార్మెట్ లేదు. డిజిటల్ టెక్నాలజీ వచ్చిందని థియేటర్ యజమానులు ప్రొజెక్టర్లను తీసి పక్కన పడేశారు. ఇదే డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లకు వరంగా మారింది. ఏకస్వామ్య విధానం అమలుచేయడానికి అవకాశం లభించింది. థియేటర్లలో అమర్చిన డిజిటల్ ప్రొజెక్టర్ల అద్దెను క్రమంగా కంపెనీలు పెంచుకుంటూ వెళ్లిపోయాయి. ఈ ఫీజు థియేటర్ యాజమాన్యాలకు భారంగా మారింది. దేశంలో డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు అయిన యూఎఫ్ఓ, క్యూబ్ కంపెనీలు మొండిగా వ్యవహరిస్తున్నాయి. అంతా వారి చేతుల్లోనే ఉండటంతో థియేటర్ల యాజమాన్యాలు కూడా మౌనంగా ఉండిపోయారు. డీఎస్పీలు అద్దెలు, చార్జీలను ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు. ఒక్కో చోట ఒకలా వున్నాయి. ఇంగ్లిష్ సినిమాలకు ఎక్కడా వర్చువల్ ప్రింటింగ్ ఫీజు లేదు.. మనకు కూడా లేదు. ఉత్తరాదిలో హిందీ సినిమాలపై మన దగ్గర వసూలు చేస్తున్న ఫీజులో 50 శాతం మాత్రమే వసూలు చేస్తున్నారు. అదే సినిమా మన వద్ద వేస్తే వంద శాతం వీపీఎఫ్ చెల్లించాలి. ఉత్తరాదిలో అన్నీ హిందీ సినిమాలే కాబట్టి ఫీజు తక్కువగా వుంది. మన తెలుగు చిత్రాలకు పూర్తి ఫీజు చెల్లించాలి. ఈ ద్వంద్వ వైఖరిని దక్షిణాది నిర్మాతలు, పంపిణీదారులు వ్యతిరేకించారు. జేఎసీగా ఏర్పడి డిజిటల్ ప్రొజెక్టర్ అద్దె, వీపీఎఫ్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రకటనల ఆదాయంపై బాదుడే ఈ డీఎస్పీలు నిర్మాతలు, పంపిణీదారుల నుంచి వసూలు చేసే వీపీఎఫ్ కాకుండా థియేటర్ యజమానుల నుంచి రెండురకాలుగా లబ్ధి పొందుతున్నాయి. అందులో ఒకటి డిజిటల్ ప్రొజెక్టర్ అద్దె కాగా, మరొకటి ప్రకటనల ఆదాయం. సినిమా థియేటర్లలో ప్రదర్శనకు ముందు, ఇంటర్వెల్ తర్వాత వేసే ప్రకటనల ఆదాయం మొత్తం డీఎస్పీలే తీసుకుంటున్నాయి.అందులో నామమాత్రంగా 10 నుంచి 15 శాతం మాత్రమే యాజమాన్యాలకు ఇస్తున్నారు. ప్రకటన సైజు తెలుపకుండానే నచ్చినంత సేపు వేసుకుంటూ యాజమాన్యాలకు నష్టాలు కలిగించడంతో పాటు ప్రేక్షకులను ఇబ్బందిపెడుతున్నారు. డిజిటల్ ప్రొజెక్టర్ల అద్దె ఇలా... నగరంలోని 4కె థియేటర్లు డిజిటల్ ప్రొజెక్టర్లకు వారానికి రూ.13,600 చెల్లిస్తున్నాయి. సాధారణ థియేటర్లు వారానికి రూ.10,300 చెల్లిస్తున్నాయి.వీటితో పాటు వీపీఎఫ్ నెలకు రూ.15 నుంచి రూ. 20 వేలకు వరకు చెల్లిస్తున్నాయి. -
విద్యార్థులకూ తప్పని జీఎస్టీ మోత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యార్థులపైనా జీఎస్టీ భారం పడనుంది. వివిధ ఉమ్మడి ప్రవేశపరీక్షల (సెట్ల)కు హాజరయ్యే ఒక్కో అభ్యర్థి సగటున రూ. 70 వరకు అదనంగా చెల్లించాల్సి రానుంది. మొత్తంగా సుమారు 4.95 లక్షల మంది విద్యార్థులపై జీఎస్టీ రూపంలో రూ.3.5 కోట్ల అదనపు భారం పడనుంది. టీఎస్ ఆన్లైన్, ఐటీ సేవల సంస్థ టీసీఎస్‌ల అంచనాల్లో ఈ విషయం వెల్లడైంది. వచ్చే విద్యా సంవత్సరంలో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఎంసెట్, లాసెట్, ఈసెట్, పీజీఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్, పాలీసెట్ వంటి పరీక్షల ఫీజుపై పన్ను రూపంలో ఈ భారం పడనుంది. ఆన్లైన్ పరీక్షల నేపథ్యంలో.. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి వివిధ కోర్సుల ప్రవేశపరీక్షలను ఆన్లైన్లో నిర్వహించేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా మంగళవారం ఉన్నత విద్యా మండలితో టీఎస్ ఆన్లైన్–టీసీఎస్ ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నారు. చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు లింబాద్రి, వెంకటరమణ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ మేరకు ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశపరీక్షలను టీఎస్ ఆన్లైన్–టీసీఎస్ నిర్వహించనున్నాయి. గతేడాది విద్యార్థుల లెక్కతో.. పరీక్షల నిర్వహణ ఒప్పందం నేపథ్యంలో వి ద్యార్థులపై పడే జీఎస్టీ ప్రభావాన్ని టీఎస్ ఆన్ లైన్–టీసీఎస్ అంచనా వేశాయి. గతేడాది ప్రవేశపరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్యను బట్టి భారాన్ని తేల్చాయి. ఏటా సుమారు 4.95 లక్ష ల మంది వివిధ ప్రవేశపరీక్షలకు దరఖాస్తు చే సుకుంటున్నారు. ఇందులో ఒక్క ఎంసెట్‌కే దా దాపు 2 లక్షల మందికిపైగా విద్యార్థులు దర ఖాస్తు చేసుకుంటుండగా.. ఐసెట్‌కు దాదాపు 80 వేల మంది వరకు హాజరవుతున్నారు. మిగతావారు ఎడ్‌సెట్, ఈసెట్, పీఈసెట్, పీజీఈసెట్ వంటి పరీక్షలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. వారు చెల్లించే పరీక్ష ఫీజుపై ఇప్పటివర కు పన్ను మినహాయింపు ఉండగా.. ఈ ఏడాది నుంచి జీఎస్టీ చెల్లించాల్సి రానుంది. ఈ భారం ఒక్కో విద్యార్థిపై రూ.70 వరకు ఉం టుందని అంచనా వేశారు. దీనికితోడు ఆన్లైన్, ప్రాసెసింగ్ ఫీజు కలిపి ఒక్కో విద్యార్థిపై రూ.100 నుంచి రూ.150 వరకు భారం పడే అవకాశముందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. -
రాజధాని ప్రాంత రైతులపై భారం
-
ఏపీపై విద్యుత్ చార్జీల భారం
-
జీహెచ్ఎంసీ నెత్తిన ఆర్టీసీ గుదిబండ..
సాక్షి, సిటీబ్యూరో: పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో ఉన్న జీహెచ్ఎంసీకి ఆర్టీసీ గుదిబండగా మారింది. బస్సులన్నీ ఫుల్ ఆక్యుపెన్సీతో ఉన్నా ఎప్పుడూ నష్టాలే చూపే ఆర్టీసీని గట్టెక్కించేందుకు.. ఆర్టీసీకి కలిగే నష్టాన్ని జీహెచ్ఎంసీ భరించాల్సిందిగా సీఎం ఆదేశించడంతో ఆ సంస్థ నష్టాలు జీహెఎంసీని ముంచుతున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు ఏటా వందల కోట్లు ఆర్టీసీకి చెల్లిస్తుండడంతో జీహెచ్ఎంసీ కోలుకోలేని విధంగా దెబ్బతింటోంది. గతంలో జరిగిన ఓ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్లో ఆర్టీసీకి ఏర్పడ్డ నష్టాన్ని జీహెచ్ఎంసీ నిధులతో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు జీహెచ్ఎంసీ.. ఆర్టీసీకి చెల్లింపులు చేస్తున్నప్పటికీ, ప్రయాణికులకు రవాణా సదుపాయాలు మెరుగయ్యాయా.. అంటే లేనేలేదు. అటు సిటీ ప్రయాణికులకు ఇబ్బందులు తొలగకుండా.. ఇటు జీహెచ్ఎంసీ ఖజానాకు ఏర్పడుతున్న లోటుతో పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. సీఎం హామీ మేరకు జీహెచ్ఎంసీ ఇప్పటికే ఆర్టీసీకి రూ. 306 కోట్లు చెల్లించింది. ఇందులో 2015–16కు రూ.170 కోట్లు చెల్లించింది. 2016–17కు రూ.198 కోట్లు చెల్లించాలనడంతో ఒకేసారి అంత మొత్తం చెల్లించలేక వాయిదా పద్ధతిలో చెల్లిస్తున్నారు. ఈ మొత్తంలో ఇంకా రూ. 62 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇదిలా ఉండగానే మరో రూ.290 కోట్లు చెల్లించాల్సిందిగా ఆర్టీసీ నుంచి ఇటీవల లేఖ అందింది. దీంతో ఏం చేయాలో పాలుపోక జీహెచ్ఎంసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మెరుగుపడని సదుపాయాలు.. జీహెచ్ఎంసీ నుంచి అందిన నిధులతో ఆర్టీసీ మెరుగుపడిన దాఖలాల్లేవు. ఆ నిధులతో ఏం చేస్తున్నారో జీహెచ్ఎంసీకీ తెలియదు. దానిపై ఎలాంటి అజమాయిషీ లేదు. జీహెచ్ఎంసీ నుంచి ఆర్టీసీకి నిధులివ్వడమే కాక ఆర్టీసీ బోర్డులో జీహెచ్ఎంసీ కమిషనర్‌ను డైరెక్టర్‌గా నియమిస్తే ఖర్చుల గురించి తెలియడంతో పాటు, బస్సులపై, బస్షెల్టర్లలో ప్రకటనల పన్నుల వంటి వాటిద్వారా ఆర్టీసీ, జీహెచ్ఎంసీ రెండింటి ఆదాయాన్ని కూడా పెంచుకునే వెసులుబాటు ఉంటుందని భావించారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌ను బోర్డులో డైరెక్టర్‌గా నియమించినప్పటికీ, ఎలాంటి అజమాయిషీ లేదు. నష్టాల పేరిట కోట్లు చెల్లించాలంటూ ఆర్టీసీ లేఖలు రాయడం.. జీహెచ్ఎంసీ చెల్లించడం పరిపాటిగా మారింది. ఇప్పటికే వివిధ కారణాలతో దివాళా బాటలో ఉన్న జీహెచ్ఎంసీకి ఆర్టీసీ భారం మోయలేని గుదిబండగా మారింది. ప్రభుత్వం ఈ అంశంలో తగిన చర్యలు తీసుకుని జీహెచ్ఎంసీని గట్టెక్కించాల్సి ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. లేకుంటే జీహెచ్ఎంసీ సైతం అప్పుల పాలవక తప్పదని హెచ్చరిస్తున్నారు. ప్రయాణికులకు అవసరమైన బస్షెల్టర్ల నిర్మాణం బాధ్యత సైతం జీహెచ్ఎంసీ పైనే ఉంది. ఈ పనిని ఆర్టీసీకి అప్పగిస్తే ప్రయాణికుల అవసరాల కనుగుణంగా షెల్టర్లను ఏర్పాటు చేయడమే కాక వచ్చే ఆదాయాన్ని సైతం ఆర్టీసీయే పొందవచ్చు. కానీ అలా జరగడం లేదు. లోటు బాటలో జీహెచ్ఎంసీ 2015–16 ఆర్థిక సంవత్సరానికి పాలకమండలి లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.130 కోట్లు రాలేదు. 14వ ఆర్థిక సంఘం నుంచి మొదటి సంవత్సరం రావాల్సిన రూ.200 కోట్లు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ► 2014–15లో దాదాపు రూ. 450 కోట్ల గ్రాంట్లు అందగా, ప్రస్తుతం రూ.40 కోట్లకు పరిమితమైంది. ► గ్రేటర్లో రూ. 1200 లోపు ఆస్తిపన్ను వారికి ప్రభుత్వం రాయితీనివ్వడం, నిర్ణీత వ్యవధిలోగా ఆస్తిపన్ను చెల్లించిన వారికి రాయితీ నివ్వడం వంటి వాటితో దాదాపు రూ. 100 కోట్ల రాబడి తగ్గింది. జీతాల పెంపు వల్ల రూ. 180 కోట్ల అదనపు భారం పడింది. ► మోటారు వాహన పన్ను వాటాగా జీహెచ్ఎంసీకి ఏటా రూ.80 కోట్లు రావాల్సి ఉండగా, కేవలం రూ. 50 లక్షలతో చేతులు దులుపుకుంటున్నారు. ► శివారు ప్రాంతాలకు తాగునీరు, డ్రైనేజీ సదుపాయాల కోసమని ఆస్తిపన్నులో 15 శాతం జలమండలికి చెల్లిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో చేపట్టే ఈ పనులకు 70 శాతం స్థానికులు భరిస్తుండగా, మిగతా 30 శాతం నిధులను జీహెచ్ఎంసీయే వెచ్చిస్తోంది. ఈ నిధులు వెచ్చించినప్పుడు ఆస్తిపన్నులో 15 శాతం చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు అంటున్నప్పటికీ, ప్రభుత్వ ఆదేశాల మేరకు చెల్లించక తప్పని పరిస్థితి. ► ‘స్చచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులు చెత్త తరలించేందుకు 2 వేల ఆటో టిప్పర్లు కొన్నారు. వాటి కోసం ప్రతినెలా కోటి రూపాయల బ్యాంక్ ఈఎంఐని జీహెచ్ఎంసీయే చెల్లిస్తోంది. ► జీహెచ్ఎంసీ గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఇప్పటిదాకా రూ.122 కోట్లు ఆస్తిపన్ను అదనంగా వసూలు చేసినా, ట్రేడ్ లైసెన్సుల ఫీజులు ఏడాది లక్ష్యాన్ని ఇప్పటికే అధిగమించినా ఖజానా లోటులోనే ఉంది. ► సిబ్బంది జీతభత్యాలు, పెన్షన్ తదితర వాటికోసం జీహెచ్ఎంసీ ప్రతినెలా దాదాపు రూ. 100 కోట్ల చెల్లిస్తోంది. ఖజానాలో మిగులు నిధులు రూ. 50 కోట్లు కూడా లేవు. అంటే.. జీతాలు చెల్లించేందుకైనా ప్రతినెలా వివిధ మార్గాల ద్వారా వంద కోట్లు ఖజానాకు చేరాలి. లేదంటే అప్పులు తప్పవు. ఇది ఎంతో దూరం లేదని జీహెచ్ఎంసీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
‘అమ్మ’ భారమైంది!
నవమాసాలు మోసి జన్మనిచ్చిన అమ్మే వారికి భారమైంది. ఆమెను పోషించడం తమ వల్ల కాదని కర్కశంగా వారు చెప్పేచేశారు. మూడురోజులుగా ముద్ద ముట్టని ఆమెను కాశిరెడ్డినాయన ఆశ్రమానికి చెందిన కృష్ణయ్య అనే వ్యక్తి ఆమె స్వగ్రామానికి తీసుకెళ్లారు. వివరాలు ఇవీ.. కొత్తపల్లె మండలం ఎదురుపాడుకు చెందిన బిజ్జమ్మకు కుమారుడు శంకర్ రెడ్డితో పాటు కుమార్తె ఉంది. దాదాపు మూడు సంవత్సరాల క్రితం శంకర్‌రెడ్డి తన తల్లి బిజ్జమ్మ కాశిరెడ్డినాయన ఆశ్రమంలో వదిలేశారు. దీంతో ఆశ్రమవాసులు ఆమెకు అన్నం పెట్టేవారు. ఆశ్రమంలో ఒక మూలన కూర్చొని తనకు పట్టిన దుస్థితికి చింతిస్తూ ఆమె కాలం వెల్లదీస్తుండేది. అయితే తనకు మరణం ఎంతకీ రావడం లేదని అప్పుడపుడు అక్కడున్న వారికి చెబుతూ దుఃఖిస్తూ ఉండేది. ఈ క్రమంలో మూడు రోజుల నుంచి ముద్ద అన్నం కూడా ముట్టడం లేదు. ఎంత బతిమాలినా మౌనంగా వద్దని చెప్పేది. దీంతో పూర్తిగా నీరసించి సొమ్మసిల్లి పడిపోయింది. ఆమె కుటుంబ సభ్యులు కొత్తపల్లె మండలం ఎదురుపాడులో ఉన్నట్లు గుర్తించారు. ఆమె కుమారుడికి ఫోన్‌చేసి పరిస్థితని వివరించారు. ఆమెను తీసుకెళ్లాలని కుటుంబీకులకు తెలిపారు. అయితే తల్లిని తీసుకెళ్లడానికి కుమారుడు అంగీకరించలేదు. మళ్లీ ఫోన్‌చేసినా స్పందన లేదు. దీంతో ఆశ్రమంలో ఉంటున్న కృష్ణయ్య..ఆదివారం ఆటోలో వృద్ధురాలిని తరలించడానికి ఓంకార క్షేత్రం నుంచి బండిఆత్మకూరుకు వచ్చాడు. ఆమె నీరసించి బస్టాండులోని కటిక నేలమీద ఉండడం చూసి స్థానికులు తరలించారు. మహిళలు, హోటల్ నిర్వాహకులు వచ్చి నీరసించిన అమ్మకు పండ్లు, పానియాలు ఇప్పించారు. ఆ తర్వాత తలా ఒక చేయివేసి ఆత్మకూరు బస్సుకు ఎక్కించి పంపించారు. కృష్ణయ్య బస్సులో ఆమె పక్కనే ఉండి జాగ్రత్తగా స్వగ్రామమైన ఎదురుపాడుకు తీసుకెళ్లారు. - బండి ఆత్మకూరు -
రూ.2 లక్షలపైన వస్తు, సేవల కొనుగోళ్లపై 1% పన్ను
న్యూఢిల్లీ: రెండు లక్షలపైన వస్తు, సేవల నగదు కొనుగోళ్లపై ఇకపై ఒకశాతం పన్ను భారం పడనుంది. ఆభరణాలకు సంబంధించి మాత్రం ఒకశాతం పన్ను రూ.5 లక్షలపైన కొనుగోళ్లపై ఉంటుంది. అయితే బులియన్‌కు సంబంధించి మాత్రం ఒకశాతం పన్నుకు రూ.2 లక్షల పరిమితి వర్తిస్తుంది. సోర్స్ (టీసీఎస్) వద్ద అమలయ్యే ఈ ఒకశాతం పన్ను నిర్ణయం జూన్ 1 నుంచీ అమల్లోకి వస్తుంది. పసిడి, ఆభరణాలకు సంబంధించి సోర్స్ వద్ద ఒకశాతం పన్ను 2012 జూలై 1 నుంచీ అమలవుతోందని, ఇదే పరిస్థితి ఇకముందూ అమలవుతుందని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. 2016-17 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం వస్తు, సేవల నగదు కొనుగోళ్లపై తాజా ఒకశాతం పన్ను అమల్లోకి వస్తుందని తెలిపింది. అలాగే స్టాక్ మార్కెట్లో ఆప్షన్ అమ్మకాలపై కూడా జూన్ 1 నుంచీ పెంచిన సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (ఎస్టీటీ) 0.05 శాతం (0.017 శాతం నుంచి) అమలవుతుందని ఆర్థికమంత్రిత్వశాఖ ప్రకటన తెలిపింది. రూ. 10 లక్షలు పైబడిన లగ్జరీ కార్ల కొనుగోళ్లపై కూడా సోర్స్ వద్ద ఒకశాతం పన్ను విధించాలని బడ్జెట్ ప్రతిపాదించింది. -
సేవలపై మరో అర శాతం పన్ను బాదుడు
న్యూఢిల్లీ: రెస్టారెంట్లు, ఇంటర్నెట్, ఫోన్ బిల్లులు, ప్రయాణ చార్జీలు, బ్యాంకింగ్ ఇతరత్రా అనేక సేవలు ఇకపై మరింత భారం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఈ ఏడాది బడ్జెట్లో ప్రతిపాదించిన 0.5 శాతం కృషి కళ్యాణ్ సెస్ రేపటి నుంచి(జూన్ 1) అమల్లోకి రానుండటమే దీనికి కారణం. పన్నుల పరిధిలో ఉన్న అన్ని సేవలపై అదనంగా ఈ అర శాతం పన్నును వడ్డిస్తారు. దీంతో ప్రస్తుతం 14.5 శాతంగా ఉన్న సేవల పన్ను 15 శాతానికి పెరగనుంది. వాస్తవానికి అంతక్రితం 12.36 శాతంగా ఉన్న సేవల పన్నును 2015 జూన్ 1 నుంచి 14 శాతానికి పెంచారు. దీనికి నవంబర్ 15, 2015 నుంచి మరో అర శాతం స్వచ్ఛ భారత్ సెస్‌ను జోడించడంతో సేవా పన్ను 14.5 శాతానికి చేరింది. ఇప్పుడు కృషి కళ్యాణ్ సెస్ అర శాతం కూడా జతయ్యి 15 శాతానికి చేరనుంది. మొత్తంమీద త్వరలో అమల్లోకి తీసుకురానున్న ప్రతిపాదిత వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) రేటు(17-18 శాతం ఉండొచ్చని అంచనా) స్థాయికి నెమ్మదినెమ్మదిగా కేంద్రం సేవల పన్నును పెంచుకుంటూ వస్తోంది. -
కేంద్ర పథకాలు తడిసి మోపెడు!
► ఇప్పటివరకు కేంద్రం నుంచి 75-90 శాతం నిధులు ► ఇకపై ఇచ్చేది 60 శాతమే ► రెట్టింపైన విద్యాశాఖ ప్రణాళిక బడ్జెట్ ► మొత్తంగా రూ.14,124 కోట్లు కావాలని ప్రతిపాదనలు! ► మోడల్ స్కూళ్ల భారం పూర్తిగా రాష్ట్రంపైనే సాక్షి, హైదరాబాద్: కేంద్ర పథకాల భారం ఈసారి రాష్ట్రంపై భారీగా పెరగనుంది. దీంతో పాఠశాల విద్యాశాఖకు ప్రణాళిక బడ్జెట్ కింద వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ మొత్తాన్ని వెచ్చించక తప్పని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద ఇప్పటివరకు కొన్ని పథకాల్లో 90 శాతం నిధులను ఇస్తుండగా.. మరికొన్నింటికి 75 శాతం నిధులను ఇస్తోంది. కానీ ఇకపై కేంద్రం 60 శాతం నిధులే ఇస్తామని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే 40 శాతం నిధులను వెచ్చించాల్సి ఉంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆర్థిక శాఖకు పంపేందుకు బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మొత్తంగా పాఠశాల విద్యకు 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 14,124 కోట్లు కావాలని ప్రతిపాదించినట్లు సమాచారం. ఇందులో ప్రణాళిక బడ్జెట్ కింద రెట్టింపు నిధులు అవసరమని ప్రతిపాదించింది. గతేడాది ప్రణాళిక బడ్జెట్ కింద రూ.1,854 కోట్లు ప్రతిపాదించిన విద్యాశాఖ ఈసారి రూ.3,591 కోట్లు కావాలని పేర్కొంది. మరోవైపు వేతనాలు, ఇతర నిర్వహణ వ్యయం కింద కేటాయించే నాన్ ప్లాన్ బడ్జెట్ గత ఏడాది రూ.9,111 కోట్లు ఉండగా ఈసారి రూ.10,533 కోట్లు అవసరమని పేర్కొంది. పదో పీఆర్సీ కింద పెరిగిన వేతనాలు, డీఏ తదితర ఖర్చులు పెరగడంతో నాన్ ప్లాన్ బడ్జెట్ కింద ఎక్కువ కేటాయింపు అవసరమని పేర్కొంది. రాష్ట్రంపై తప్పని భారం: మోడల్ స్కూళ్ల పథకాన్ని కేంద్రం రద్దు చేయడంతో ఇప్పటివరకు ప్రారంభించిన స్కూళ్లు, వాటి నిర్వహణ వేల మంది టీచర్ల జీతభత్యాలు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తోంది. మరోవైపు సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) మధ్యాహ్న భోజనం, కంప్యూటర్ విద్య తదితర పథకాలకు కేంద్ర ప్రభుత్వం తమ వాటాను తగ్గించడంతో గత ఏడాది కంటే ఈసారి అధికంగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటికి తోడు గురుకుల విద్యాలయాలకు అదనంగా భవన నిర్మాణాలు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణాలు, మరుగుదొడ్ల నిర్వహణ వంటి పనులకు అదనపు నిధులు కావాలని పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదించినట్లు సమాచారం. మరోవైపు కేజీ టు పీజీ కింద టోకెన్ అమౌంట్‌గా రూ.75 కోట్లు ప్రతిపాదించినా ప్రభుత్వం ఈసారి దీనికి ఎక్కువ మొత్తం కేటాయించాల్సి వస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పాఠశాల విద్య ప్రతిపాదించిన బడ్జెట్ ఇదీ..(రూ.కోట్లలో) మొత్తం బడ్జెట్ 14,124 ప్రణాళిక 3,591 నాన్ ప్లాన్ 10,533 ఇందులో దేనికెంత..? కేంద్ర రాష్ట్ర భాగస్వామ్య పథకాలకు 2,177 కిచెన్ షెడ్లకు 162 కేజీ టు పీజీ టోకెన్ అమౌంట్ 75 గత ఏడాది ఇలా..(రూ.కోట్లలో) మొత్తం బడ్జెట్ 10,965 ప్రణాళిక పద్దు 1,854 ప్రణాళికేతర పద్దు 9,111 -
నేను భారమైతే చచ్చిపోతా: స్టీఫెన్ హాకింగ్
తాను భరించలేని బాధకు గురైన పక్షంలో...ఇక తాను ప్రపంచానికి చేయగలిగిందీ ఏమీ లేదని భావిస్తే...ముఖ్యంగా తనను ప్రేమించే వారికి తాను భారమైతే ఇతరుల సహకారంతో ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమేనని ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ స్టీఫెన్ హాకింగ్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ బతికే హక్కు ఉన్నట్లే.. చనిపోయే హక్కు కూడా ఉండాలని భావించే హాకింగ్, ప్రముఖ కమెడియన్ డారా ఓ బ్రియేన్కు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసినట్టు ‘ది డెయిలీ టెలిగ్రాఫ్’ వెల్లడించింది. తాను అప్పుడప్పుడు ఒంటరితనానికి గురవుతున్నానని కూడా అందులో ఆయన చెప్పారు. ఇటీవల ఏమైనా ప్రశ్నలకు తన నుంచి సమాధానం ఆశిస్తున్నవారు అసహనానికి గురవుతున్న సందర్భాలు కూడా ఉంటున్నాయన్నారు. ఈ ఇంటర్వ్యూను జూన్ 15వ తేదీన బీబీసీ వన్ ప్రసారం చేయనుంది. ఇందులో హాకింగ్ 45 ఏళ్ల కూతురు లూసీ, 36 ఏళ్ల కుమారుడు టిమ్ కూడా తన తండ్రి పరిశోధనల గురించి వివరిస్తారు. హాకింగ్‌ను వెన్నంటి రక్షించుకుంటున్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ విద్యార్థులు కూడా తదనంతర చర్చల్లో పాల్గొంటారు. 73 ఏళ్ల స్టీఫెన్ హాకింగ్ గత నాలుగు దశాబ్దాలుగా అత్యంత అరుదైన ‘మోటార్ న్యూరోన్ డిసీజ్’ అనే కండరాల జబ్బుతో బాధపడుతున్నారు. 21వ ఏటనే ఈ వ్యాధికి గురైన ఆయన ఏడాదికి మించి బతికే అవకాశం లేదని నాడు డాక్టర్లు తేల్చారు. అయితే వాళ్ల మాటలను పట్టించుకోకుండా మానసిక స్థైర్యంతో ఆయన ఇంతకాలం జీవించే ఉన్నారు. ఈ జబ్బుతో ఇంతకాలం జీవించేవారు ప్రపంచవ్యాప్తంగా ఐదు శాతానికి మించిలేరని వైద్యులు చెబుతున్నారు. తనపట్ల ప్రేమ, ఆరాధ్య భావంతో తనను చూసుకుంటున్నవారిని తాను భారమైతే చనిపోవడానికి సిద్ధమేనని చెబుతున్న హాకింగ్, వాస్తవానికి విశ్వ రహస్యాల గుట్టును పూర్తిగా ఛేదించకుండా చనిపోయే ఉద్దేశం లేదని కూడా తన తాజా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. భూమండలంపై ఇక బతకడం అనవసరమని భావించేవారికి చనిపోయే హక్కు ఉండాలని 2013లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హాకింగ్ వాదించారు. పట్టి పీడిస్తున్న వ్యాధి నుంచి కోలుకునే అవకాశం లేక, బాధను భరించలేని వారికి అత్మహత్యలో సహకరించేందుకు స్విడ్జర్లాండ్‌లో ‘డిగ్నిటాస్ సూసైడ్ క్లినిక్’ ఉంది. అక్కడికెళ్లి గత 16 ఏళ్ల కాలంలో 273 మంది బ్రిటన్లు ఆత్మహత్య చేసుకోగా, 920 మంది జర్మన్లు, 194 మంది ఫ్రాన్స్ దేశస్థులు ఆత్మహత్య చేసుకున్నారు. -
వాహన బీమా మరింత భారం
చెన్నై: వాహన బీమా పాలసీలు మరింత భారమయ్యేలా కనిపిస్తున్నాయి. బీమా ప్రీమియంలను పెంచుతూ ఈ మేరకు బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏ) పలు ప్రతిపాదనలు చేసింది. 1,000 సీసీ కన్నా తక్కువ సామర్థ్యం ఉండే చిన్న కార్లపై థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంను 107.79 శాతం పెంచాలని ప్రతిపాదించింది. దీన్ని బట్టి టాటా బోల్ట్ లాంటి కార్ల యజమానుల కన్నా టాటా నానో వంటి చిన్న కార్ల యజమానులు అదనంగా రూ.426 మేర థర్డ్ పార్టీ ప్రీమియం కట్టాల్సి వచ్చేలా ఉంది. ఇక 75-350 సీసీ ఇంజిన్ సామర్థ్యం గల ద్విచక్ర వాహనాలపై ప్రీమియం పెరుగుదల 14-32 శాతం మేర ఉండనుంది. 350 సీసీ పైబడిన ద్విచక్ర వాహనాలపై మాత్రం 61 శాతం తగ్గనుంది. అలాగే, స్థూలంగా 7,500 కేజీల కన్నా తక్కువ బరువుండే (జీఎంవీ) ట్రక్కులపై 14 శాతం, 7,500-12,000 కేజీల మధ్య జీఎంవీ ఉండే వాటిపై 20 శాతం మేర థర్డ్ పార్టీ ప్రీమియం తగ్గనుంది. ఐఆర్డీఏ మంగళవారం ఆవిష్కరించిన ప్రతిపాదనలు ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. మార్చి 20 లోగా దీనికి సంబంధించిన వివిధ వర్గాలు తమ అభిప్రాయాలను ఐఆర్డీఏకి తెలియజేయాల్సి ఉంది. పెరుగుతున్న డెత్ క్లెయిమ్‌లు..: ఐఆర్డీఏ గణాంకాల ప్రకారం డెత్ క్లెయిమ్‌లపై బీమా కంపెనీలు చెల్లిస్తున్న పరిహారాలు సగటున ప్రతి ఏటా పెరుగుతున్నాయి. 2012-13లో సగటున రూ.5,45,174 చెల్లించగా, 2013-14లో ఇది రూ.6,09,152కి పెరిగింది. ఇక 2014-15, 2015-16లో జారీ అయ్యి, 8-10 సంవత్సరాల్లో క్లెయిమ్‌కి వచ్చే పాలసీలపై పరిహారాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఐఆర్డీఏ తెలిపింది. చిత్రమేంటంటే డెత్ క్లెయిమ్ సగటు లెక్కించడానికి ఐఆర్డీఏ తీసుకున్న లెక్కల్లో రూ.లక్ష కన్నా తక్కువ చెల్లించిన క్లెయిమ్‌లను చేర్చలేదు. పెపైచ్చు థర్డ్ పార్టీ ప్రీమియం రూపంలో వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఆదాయాన్ని గానీ, దీర్ఘకాలంగా ఉన్న క్లెయిమ్‌ల కోసమని పక్కనబెట్టిన మొత్తాన్ని గానీ లెక్కలోకి తీసుకోలేదు. -
పుట్టగానే ఆ కేంద్ర మంత్రిని చంపేయమన్నారు
న్యూఢిల్లీ: ఆమె జన్మించినపుడు ఆడపిల్ల భారమని కొందరు పెదవి విరిచారు. ఆ చిన్నారిని చంపేయమని తల్లికి నూరిపోశారు. అయితే ఆ మాతృమూర్తి ఆ పనిచేయలేదు. ఆడపిల్ల అనే వివక్ష చూపకుండా ధైర్యంగా పెంచింది. కాలక్రమంలో ఆ అమ్మాయి ఉన్నత స్థాయికి చేరుకుంది. నేడు ఏకంగా నేడు కేంద్ర మంత్రి అయ్యారు. ఈ చిన్నారి మరెవరో కాదు కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి స్మృతి ఇరానీ. స్మృతియే ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. తాను జన్మించినపుడు తల్లికి ఎదురైన అనుభవాన్ని తొలిసారి బయటపెడుతున్నానని చెప్పారు. తన తల్లి ఆనాడు ధైర్యమైన నిర్ణయం తీసుకోవడం వల్లే తానీ రోజు కేంద్ర మంత్రి కాగలిగానని అన్నారు. ఆడపిల్లలను భారంగా భావించరాదని మంత్రి చెప్పారు. అమ్మాయిలకు చదువు చెప్పిస్తే కుటుంబానికి ఉపయోగపడుతుందని, తద్వారా దేశపురోభవృద్దికి తోడ్పడుతుందని స్మృతి అన్నారు. -
రాష్ట్ర ప్రజలపై రోజుకు రూ.40 కోట్లు
-
పెంచిన ధరను తగ్గించాలని డిమాండ్
-
రోజుకు రూ.40 కోట్లు!
వైఎస్ హయూం తర్వాత ప్రభుత్వాలు ప్రజలపై మోపిన భారం సాక్షి, హైదరాబాద్: గత నాలుగేళ్లలో పన్ను పోట్లు, చార్జీల వాతలతో ప్రజలపై మోయలేని భారం మోపిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎన్నికల సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో ఇదిగో సంక్షేమం, అదిగో పథకం అంటూ హడావుడి చేస్తోంది. కోటి ఆశలతో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం ముగిసిన తర్వాత.. సంక్షేవు పథకాలకు కోత పెట్టడం, వీలైనంతగా కొత్త పన్నులతో బాదడానికే ప్రభుత్వాలు పరిమితమయ్యూరుు. గత నాలుగేళ్లను ఒక్కసారి పరికించి చూస్తే.. కఠోర వాస్తవాలు కళ్లముందు గిర్రున తిరుగుతాయి. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్... ఇలా ఎన్నో సంక్షేమ పథకాల నిధుల్లో కోత పెట్టి వాటిని కొరగాకుండా చేసిన ప్రభుత్వం ఖజానా నింపుకోవటమే పనిగా పెట్టుకుంది. గత 50 నెలల కాలంలో ఈ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలపై ఎంత భారం మోపాయో లెక్కతీయుటానికి ‘సాక్షి’ ప్రయుత్నించినప్పుడు కళ్లు తిరిగే లెక్కలు తేలాయి. వ్యాట్, కరెంటు బిల్లులు, బస్సు చార్జీలు, వాహన పన్నులు, స్టాంపులు..రిజిస్ట్రేషన్లు తదితరాల రూపంలో ఏకంగా సుమారు రూ.60 వేల కోట్ల భారాన్ని ప్రజల నెత్తిన మోపింది. అంటే సగటున ప్రతినెలా రూ. 1,200 కోట్లు, రోజుకు రూ. 40 కోట్ల పెను భారం మోపింది. కరెంటు చార్జీలతో గుండెకోత వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో కరెంటు బిల్లు ఒక్క రూపాయి కూడా పెరగలేదు. భవిష్యత్తులోనూ చార్జీలు పెంచేది లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. పైగా పేద రైతులపై కరెంటు భారం ఉండదన్న ఉద్దేశంతో ‘ఉచిత కరెంటు’ పథకాన్ని ప్రారంభించి నిరాటంకంగా కొనసాగించారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది రైతులకు లబ్ధి చేకూరింది. మరోవైపు పరిశ్రమలకు యూనిట్‌పై సగటున 17 పైసలు చొప్పున ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. 2009 సెప్టెంబర్‌లో రాజశేఖరరెడ్డి మరణించిన వెంటనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోశయ్య ఒక్కసారిగా కరెంటు చార్జీలను పెంచి భారీ భారాన్ని ప్రజల నెత్తిన మోపగా, ఆ తర్వాత వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రతియేటా చార్జీలు పెంచటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక అది చాలదన్నట్టు సర్దుబాటు చార్జీల పేర, అసలు చార్జీలను మించి వసూలు చేయటం మొదలుపెట్టారు. ఇక ఉచిత విద్యుత్ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ రెండున్నర ఎకరాల మాగాణి (తరి) పొలం ఉన్న వారిని అందుకు అనర్హులుగా ప్రకటించారు. ఇలా లక్షన్నర మంది రైతులకు ఆ పథకాన్ని దూరం చేశారు. వెరసి రాజశేఖరరెడ్డి మరణానంతరం తర్వాత సర్దుబాటు చార్జీలు సహా కరెంటు బిల్లుల రూపంలో ప్రభుత్వం అదనంగా రూ. 24,218 కోట్ల భారాన్ని మోపింది. బస్సు చార్జీల మోత కరెంటు బిల్లుల తరహాలోనే ఆర్టీసీ చార్జీల విషయంలోనూ వైఎస్ వ్యవహరించారు. ప్రజలపై భారం పడొద్దని తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం వాటి జోలికే వెళ్లలేదు. ఆయన మరణానంతరం అడ్డూఅదుపూ లేకుండా చార్జీల మోత మోగించిన ప్రస్తుత ప్రభుత్వం గడచిన నాలుగేళ్లలో ఏకంగా రూ.1980 కోట్లమేర ప్రజల జేబుల నుంచి అదనంగా కొల్లగొట్టింది. చివరకు పేదల కోసం ఉద్దేశించిన పల్లెవెలుగు బస్సులనూ చార్జీల పెంపునుంచి మినహారుుంచలేదు. వ్యాట్ వేటు..! ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరుగా భావించే విలువ ఆధారిత పన్ను (వ్యాట్) అంటేనే ప్రజలు వణికిపోయే పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.55 వేల కోట్ల మేర పిండుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవటం దీనికి నిదర్శనం. అంతకుముందు సంవత్సరం కంటే ఏకంగా రూ.10 వేల కోట్ల మేర అధికంగా లక్ష్యాన్ని నిర్ధారించిన ప్రభుత్వం అవకాశం ఉన్న వస్తువునల్లా వ్యాట్ పరిధిలో చేరుస్తూ, 5 శాతం పన్ను పరిధిలో ఉన్నవాటిని 14.5 శాతం పరిధిలోకి తెస్తూ ప్రజలను పీల్చిపిప్పి చేస్తోంది. లక్ష్యాన్ని పెంచినా ఆదాయం సరిపోవటం లేదన్న కారణంతో వచ్చే ఆర్థిక సంవత్సరం లక్ష్యాన్ని హీనపక్షంగా మరో రూ. 8 వేల కోట్లకు పెంచే యోచనలో ఉంది. 2008-09 వ్యాట్ లక్ష్యం రూ. 22,500 కోట్లు ఉంటే వైఎస్ దాన్ని మరుసటి యేడాదికి కేవలం వేయి కోట్లమేర మాత్రమే పెంచారు. కానీ ఆయన మరణించిన తొలి సంవత్సరంలోనే రోశయ్య ప్రభుత్వం ఏకంగా రూ. 29,144 కోట్ల లక్ష్యాన్ని పెడితే అది కాస్తా 2013-14 నాటికి రూ.55 వేల కోట్లకు పెరగటం విశేషం. ఈ విధంగా ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ప్రజల నుంచి ఏకంగా రూ.23 వేల కోట్లకుపైగా అదనంగా దండుకుంది. వాహన కొనుగోలుదారులకు వెతలు వాహన కొనుగోలుదారులనూ ప్రభుత్వం వదిలిపెట్టలేదు. 2009-10 ఆర్థిక సంవత్సరంలో రవాణా శాఖ ద్వారా రూ.2,300 కోట్ల ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్థికమాంద్యం, రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితుల ప్రభావంతో అభివృద్ధి మందగించడంతో రాష్ట్రంలో మోటారు వాహనాల విక్రయం నేల చూపులు చూస్తోంది. కానీ ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకుండా.. పన్నుల మోత మోగిస్తోంది. త్రైమాసిక పన్నుల జాబితాలో ఉన్న పలువాహనాలను జీవితపన్ను పరిధిలోకి తీసుకురావడం, పన్నులు పెంచడం, రెండో వాహనం కొంటే గరిష్టంగా 14.5 శాతం పన్ను విధించడం.. తదితర చర్యల తో ప్రజల మీద భారం పెంచేసింది. తద్వారా రెండువేల కోట్లకు పైగా ఆర్జించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల బాదుడు ప్రభుత్వం ఆదాయం పెంపు కోసం స్థిరాస్తి కొనుగోలుదారులను కూడా పీల్చిపిప్పి చేసింది. 2009 - 10 ఆర్థిక సంవత్సరంలో రూ.3,064 కోట్లు ఉన్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం 2012- 13 నాటికి రూ.6,600 కోట్లకు పెరగడం గమనార్హం. 2010లో ప్రభుత్వం భూములు, స్థలాల మార్కెట్ విలువలను భారీగా పెంచింది. 29 విభాగాలుగా ఉన్న భూములు, స్థలాలను కేవలం అయిదు కేటగిరీలుగా మార్చేసింది. పట్టణాల్లో అయితే వాణిజ్య, నివాస అనే రెండు వర్గీకరణలకే పరిమితం చేసింది. అప్పట్లో కొన్నిచోట్ల భూములు, స్థలాల మార్కెట్ విలువలను 400 నుంచి 600 శాతం వరకూ పెంచింది. అందువల్లే 2009 -10లో రూ.3,064 కోట్లు ఉన్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ రాబడి 2010 -11 సంవత్సరంలో రూ.4,432 కోట్లకు పెరిగింది. 2013లో కూడా ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూములు, స్థలాలు, భవనాల మార్కెట్ విలువలను భారీగా పెంచింది. పట్టణాలకు సమీపంలోని గ్రామాల్లో అక్కడక్కడా ఒకటి రెండు ఇళ్లు ఉన్న వ్యవసాయ భూములను కూడా ఇళ్ల స్థలాల వర్గీకరణలోకి మార్చింది. దీంతో వీటి కొనుగోలుదారులపై భారీ భారం పడింది. నగరపాలక, పురపాలక సంఘాల్లో గత మూడేళ్ల కాలంలోనే ఏకంగా ఆస్తిపన్ను పెంపు ద్వారా రూ. 800 కోట్లు, మంచినీటిపై రూ. 200 కోట్ల భారాన్ని మోపింది. భవన నిర్మాణ అనుమతుల ఫీజుల్లో రూ. 300 కోట్ల పెరుగుదల నమోదైంది. -
దేశంలో కుంపటి పెట్టిన 7/30