
న్యూఢిల్లీ: దేశంలో మౌలికరంగ ప్రాజెక్టులు పెరిగిన వ్యయాల భారంతో నత్తనడనక నడుస్తున్నాయి. రూ.150 కోట్లు అంతకంటే ఎక్కువ వ్యయంతో కూడిన 348 ప్రాజెక్టులు ఇప్పుడు రూ.3 లక్షల కోట్ల మేర అధిక వ్యయాలతో జాప్యం అవుతున్నట్టు కేంద్ర గణాంకాల శాఖ నివేదిక తెలియజేస్తోంది.
‘‘1,351 ప్రాజెక్టుల వాస్తవ నిర్మాణ వ్యయం 15,72,066 కోట్లు. అయితే, వీటి నిర్మాణం పూర్తయ్యే నాటికి అంచనా వ్యయం 18,72,201 కోట్లు. అంటే మొత్తం మీద పెరుగుతున్న వ్యయాల భారం రూ.3,00,135 కోట్లు (వాస్తవ వ్యయంపై 19% ఎక్కువ)’’ అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment