న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించే క్రమంలో ఫిబ్రవరి 15 నుంచి కొత్త ఎలక్ట్రానిక్ ఫాంను కార్పొరేట్ వ్యవహరాల మంత్రిత్వ శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. కొత్త కంపెనీలు నమోదు చేసుకునేందుకు ఎలక్ట్రానిక్ ఫాం ఉపయోగపడుతుందని సంబంధిత శాఖ పేర్కొంది. ఎన్‌పీఐసీఇ+ పేరుతో పది సేవలను కార్పొరేట్ మంత్రిత్వశాఖ అందించనుంది. ఎలక్ట్రానిక్ ఫాంతో పాటు ఈపీఎఫ్‌ఓ, ఈఎస్‌ఐసీ రిజిష్ట్రేషన్ నెంబర్లను అందించనున్నారు.
ఈ ఫామ్‌లో పది సేవలను పొందుపర్చడం వల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, వ్యాపారం చేయాలనుకునే వారికి మరింత సులభతరం అవుతుందని ప్రభుత్వ వర్గాలు తెలపాయి. దేశ వృద్ధి రేటు పెంచే క్రమంలో ప్రభుత్వం తీసుకున్న ఎలక్ట్రానిక్ ఫాం నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఎంతగొనో ఉపయోగపడుతుందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రామపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment