టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులతో పాటు ఇతర ఫిన్‌టెక్ కంపెనీలు తమ వినియోగదారులకు క్రెడిట్, రుణాలు ఇవ్వడం, కార్డు బిల్లుల చెల్లింపులు వంటి ఎన్నో సదుపాయాలు అందిస్తున్నాయి. అందులో భాగంగా తాజాగా ఫిన్ టెక్ కంపెనీ ఫోన్‌పే తన యూజర్ల కోసం కొత్తగా ‘క్రెడిట్’ ఆప్షన్ తెచ్చింది. ఈ విభాగంలో యూజర్లు ‘క్రెడిట్ బ్యూరో స్కోర్’ చెక్ చేసుకోవచ్చు.
యూజర్ల క్రెడిట్ వాడకం, క్రెడిట్ ఏజ్, ఆన్ టైం పేమెంట్స్ తదితర వివరాలతో కూడిన నివేదికను క్రెడిట్ బ్యూరో స్కోర్ అందిస్తుంది. హోం పేజీలోని క్రెడిట్ సెక్షన్‌ను ఉపయోగించుకుని క్రెడిట్ లేదా రూపే కార్డుల లావాదేవీలు, రుణాల చెల్లింపులు, అదనపు భారం లేకుండా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించే అవకాశాన్ని కల్పిస్తోంది.
ఇదీ చదవండి: ‘డాలర్’కు భారత్ అంటేనే ఇష్టం..!
ఫోన్‌పే సీఈఓ హేమంత్ గాలా స్పందిస్తూ ‘ఫోన్‌పే యాప్‌లో క్రెడిట్ సెక్షన్ ప్రారంభించడానికి ఆసక్తిగా ఉన్నాం. పలు సెగ్మెంట్లలో యూజర్ల క్రెడిట్ అవసరాలను తీర్చడమే క్రెడిట్ సెక్షన్ లక్ష్యం. యూజర్ల క్రెడిట్ హెల్త్ నిర్వహణతోపాటు ఆర్థిక సాధికారత కల్పించేందుకు సంస్థ కృషిచేస్తోంది. భవిష్యత్తులో వినియోగదారులకు కన్జూమర్ లోన్లు అందుబాటులోకి తీసుకురానున్నాం. ఇందుకోసం బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నాం’ అని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment