Hyderabad Crime: Borabanda Man Missing After Loan Apps Harassment - Sakshi
Sakshi News home page

భాయ్‌.. వాళ్లు వేధిస్తున్నారు.. నావల్ల కావట్లేదు చనిపోతున్నా!

Published Tue, Jan 3 2023 8:18 AM | Last Updated on Tue, Jan 3 2023 9:28 AM

Hyderabad Crime: Borabanda Man Missing After Loan Apps Harassment - Sakshi

ఉద్యోగం కోసం వెళుతున్నట్లు చెప్పి.. వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నట్లు.. 

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగం కోసం వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి బయటికి వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన అమీర్‌పేట పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. బోరబండ ఎస్‌ఆర్‌టీకి చెందిన అబ్దుల్‌ మతీన్‌ డిగ్రీ పూర్తి చేశాడు. గత నెల(డిసెంబర్‌) 30న ఉదయం ఉద్యోగం చూసుకునేందుకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయటికి వెళ్లాడు. 

అదే రోజు మధ్యాహ్నం ఫోన్‌ చేసి ఇంటికి వస్తున్నట్లు చెప్పాడు. అయితే రాత్రి తన సోదరుడు అబ్దుల్‌ ముజాయిద్‌కు లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు ఎక్కువయ్యాయని, తాను ఇక ఇంటికి రానని, ఆత్మహత్య చేసుకుంటానని మెసేజ్‌ పంపాడు. దీంతో కుటుంబసభ్యులు అతడి కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామాంజనేయులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement