ఇటీవల ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకుని కొందరు అప్పులు ఇచ్చి వాటిపై అధిక వడ్డీల భారాన్ని మోపుతున్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ లోన్ యాప్‌లంటూ కొన్ని సంస్థలు పైసల కోసం దారుణంగా కస్టమర్లను వేధిస్తున్నాయి. ఇన్నీ జరుగుతున్న రుణాలు తీసుకునే వారి సంఖ్య మాత్రం గణనీయంగా పెరుగుతూనే ఉంది. ఎందుకంటే జీవితంలో నగదు లేకపోతే నడవడం కూడా కష్టంగా మారడంతో రుణాలు తప్పడం లేదు.
అవసరాలకు కోసం పర్సనల్ లోన్ పొందాలని భావిస్తూ ఆన్‌లైన్‌లో వెతకడం ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో తెలియక మోసపూరిత లోన్ యాప్ బారిట పడుతున్నారు. అందుకే రుణాలు పొందే ముందు నకిలీ యాప్‌లను ఈ విధంగా గుర్తించవచ్చని నిపుణులు చెప్తున్నారు.
నకీలి యాప్‌లను గుర్తించడం ఎలా..
మొదటగా లోన్ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్‌లైన్‌లోనే పూర్తవుతుంది. దీనికి ఎలాంటి కాగితాలు (ఫిజికల్ డాక్యుమెంట్స్) సమర్పించాల్సిన పని లేదు. ఆన్‌లైన్ ప్రాసెస్‌లోనే లోన్ పొందొచ్చు. అవసరమైన డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లోనే సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ లోన్ ప్రాసెస్ అంతా కేవలం 10 నుంచి 30 నిమిషాల్లో పూర్తి అవుతుంది. అర్హత ఉంటే లోన్ డబ్బులు అకౌంట్‌లోకి వస్తాయి. లేదంటే లేదు.
అలాగే, సెక్యూరిటీ డిపాజిట్ లేదా కొలేటరల్ కూడా అవసరం లేదు. అయితే కొన్ని మోసపూరిత యాప్‌లు మాత్రం వీటిని పాటించకుండా కేవలం కస్టమర్ల డేటా, ఫోటో, ఫోన్ నెంబర్ మాత్రం తీసుకుని రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఆపై వడ్డీల వడ్డీలు వేసి వేయడం , చెల్లించని పక్షంలో వేధింపులకు పాల్పడుతున్నాయి. అందుకే ప్రజలు ముందుగా ఆర్‌బీఐ ఎన్‌బీఎఫ్‌సీ ద్వారా రిజిస్టర్డ్ కాదా అనేది సరిచూసుకోవాలి. అనధికారికి మెసేజ్‌లు, లింక్‌లను తెరవకపోవడం ఉత్తమం.
కేవైసీ
లోన్ తీసుకునే వారిది తప్పక కేవైసీ (నో యుర్ కస్టమర్)ను ధ్రువీకరించాలి. ఒకవేళ లోన్‌యాప్ సంస్ధలు అవి పాటించకపోతే ఆ యాప్‌ను పక్కన పెట్టడం మంచిది.
ఫీజులు, ఇతర ఛార్జీలు
కొన్ని యాప్‌లు మధ్యవర్తిగా వ్యవహరిస్తుంటాయి. అనగా కేవలం ఇవి రుణాలు ఇచ్చే వారికి, తీసుకునే వారికి మధ్యవర్తిగా ఉంటూ కస్టమర్ల నుంచి ముందస్తు ఫీజులను వసూలు చేస్తాయి. అంటే, నిజానికి ఇవి ఎలాంటి రుణం మంజూరు చేయవు. కొంత ఫీజు తీసుకుని రుణాలిచ్చే సంస్థలకు మిమ్మల్ని రీడైరెక్ట్ చేసి తప్పుకుంటాయి. ఇక ఎలాంటి బాధ్యత తీసుకోవు. కాబట్టి ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment