fake loans
-
ఫేక్ లోన్ యాప్‌లను ఈజీగా ఇలా గుర్తుపట్టండి!
ఇటీవల ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకుని కొందరు అప్పులు ఇచ్చి వాటిపై అధిక వడ్డీల భారాన్ని మోపుతున్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆన్లైన్ లోన్ యాప్‌లంటూ కొన్ని సంస్థలు పైసల కోసం దారుణంగా కస్టమర్లను వేధిస్తున్నాయి. ఇన్నీ జరుగుతున్న రుణాలు తీసుకునే వారి సంఖ్య మాత్రం గణనీయంగా పెరుగుతూనే ఉంది. ఎందుకంటే జీవితంలో నగదు లేకపోతే నడవడం కూడా కష్టంగా మారడంతో రుణాలు తప్పడం లేదు. అవసరాలకు కోసం పర్సనల్ లోన్ పొందాలని భావిస్తూ ఆన్లైన్లో వెతకడం ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో తెలియక మోసపూరిత లోన్ యాప్ బారిట పడుతున్నారు. అందుకే రుణాలు పొందే ముందు నకిలీ యాప్‌లను ఈ విధంగా గుర్తించవచ్చని నిపుణులు చెప్తున్నారు. నకీలి యాప్‌లను గుర్తించడం ఎలా.. మొదటగా లోన్ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే పూర్తవుతుంది. దీనికి ఎలాంటి కాగితాలు (ఫిజికల్ డాక్యుమెంట్స్) సమర్పించాల్సిన పని లేదు. ఆన్లైన్ ప్రాసెస్‌లోనే లోన్ పొందొచ్చు. అవసరమైన డాక్యుమెంట్లను ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లోన్ ప్రాసెస్ అంతా కేవలం 10 నుంచి 30 నిమిషాల్లో పూర్తి అవుతుంది. అర్హత ఉంటే లోన్ డబ్బులు అకౌంట్లోకి వస్తాయి. లేదంటే లేదు. అలాగే, సెక్యూరిటీ డిపాజిట్ లేదా కొలేటరల్ కూడా అవసరం లేదు. అయితే కొన్ని మోసపూరిత యాప్‌లు మాత్రం వీటిని పాటించకుండా కేవలం కస్టమర్ల డేటా, ఫోటో, ఫోన్ నెంబర్ మాత్రం తీసుకుని రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఆపై వడ్డీల వడ్డీలు వేసి వేయడం , చెల్లించని పక్షంలో వేధింపులకు పాల్పడుతున్నాయి. అందుకే ప్రజలు ముందుగా ఆర్బీఐ ఎన్బీఎఫ్సీ ద్వారా రిజిస్టర్డ్ కాదా అనేది సరిచూసుకోవాలి. అనధికారికి మెసేజ్‌లు, లింక్‌లను తెరవకపోవడం ఉత్తమం. కేవైసీ లోన్ తీసుకునే వారిది తప్పక కేవైసీ (నో యుర్ కస్టమర్)ను ధ్రువీకరించాలి. ఒకవేళ లోన్‌యాప్ సంస్ధలు అవి పాటించకపోతే ఆ యాప్‌ను పక్కన పెట్టడం మంచిది. ఫీజులు, ఇతర ఛార్జీలు కొన్ని యాప్‌లు మధ్యవర్తిగా వ్యవహరిస్తుంటాయి. అనగా కేవలం ఇవి రుణాలు ఇచ్చే వారికి, తీసుకునే వారికి మధ్యవర్తిగా ఉంటూ కస్టమర్ల నుంచి ముందస్తు ఫీజులను వసూలు చేస్తాయి. అంటే, నిజానికి ఇవి ఎలాంటి రుణం మంజూరు చేయవు. కొంత ఫీజు తీసుకుని రుణాలిచ్చే సంస్థలకు మిమ్మల్ని రీడైరెక్ట్ చేసి తప్పుకుంటాయి. ఇక ఎలాంటి బాధ్యత తీసుకోవు. కాబట్టి ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. -
లోన్ యాప్స్‌తో జాగ్రత్త..ఆర్బీఐ వెల్లడించిన 137 ఫేక్ లోన్ యాప్స్ ఇవే..!
సాక్షి, హైదరాబాద్: డాక్యుమెంట్లతో పనిలేకుండా చిటికెలో లోన్లు ఇస్తామంటూ వలవేస్తున్న యాప్ సంస్థలను నమ్మరాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలను అప్రమత్తం చేసింది. దేశంలో 137 ఫేక్ లోన్ యాప్స్ ఉన్నాయని, వాటిని నమ్మవద్దంటూ జాబితా విడుదల చేసింది. దేశంలో వడ్డీ వ్యాపారానికి సంబంధించిన ఎలాంటి అనుమతులు లేకుండా చైనా లింకుతో ఈ యాప్‌లు నడుస్తున్నాయని ఆర్బీఐ పేర్కొంది. సదరు ఫేక్ లోన్ యాప్స్ జాబితాపై రాష్ట్ర పోలీస్ శాఖ సోషల్ మీడియా వేదికల ద్వారా యువతకు, మోసపోతున్న బాధితులకు అవగాహన కల్పిస్తోంది. ఈ యాప్స్.. తీసుకున్న మొత్తానికంటే రెండు, మూడింతలు వసూలుచేసి బాధితులను వేధిస్తున్నట్టు, రాష్ట్రవ్యాప్తంగా మూడు నెలల్లో 680కిపైగా కేసులు నమోదైనట్టు తెలిసింది. తాము అడిగినంత చెల్లించకుంటే సోషల్ మీడియా ద్వారా బాధితులను బద్నామ్ చేస్తూ యాప్ నిర్వాహకులు బెదిరింపులకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్న దాఖలాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ ఇచ్చిన యాప్స్ జాబితాను ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచుతూ పోలీస్ శాఖ అవగాహన కల్పిస్తోంది. ఆర్బీఐ స్కానర్‌లో పడ్డ ఫేక్ యాప్స్ ఇవే యూపీఏ లోన్, ఎమ్ఐలోన్, రూపీ లోన్, క్యాస్ పార్క్లోన్, రూపీ బాక్స్, అసాన్ లోన్, క్యాష్ ప్యాకెట్, క్యాస్ అడ్వాన్స్, లోన్ హోం స్మాల్, లెండ్ మాల్, ఈజీ లోన్, యూపీఓ లోన్.కామ్, మై క్యాష్ లోన్, మినిట్ క్యాష్, హ్యాండ్ క్యాష్ ఫ్రెండ్లీ లోన్, ఎర్లీ క్రెడిట్ ఆప్, రిచ్ క్యాష్, సన్ క్యాష్, ఆన్స్ట్రీమ్, ఇన్స్టామనీ, మనీ స్టాండ్ ప్రో, ఫర్‌పే ఆప్, క్యాష్‌పాల్, లోన్ జోన్, ఏటీడీ లోన్, క్యాస్ క్యారీ, 66క్యాష్, డైలీ లోన్, గోల్డ్‌మ్యాన్ పే బ్యాక్, వన్ లోన్ క్యాష్ ఎనీ టైమ్, ఫ్లాష్ లోన్ మొబైల్, హో క్యాష్, స్మాల్ లోన్, లైవ్ క్యాష్, ఇన్స్టాలోన్, క్యాష్ పాపా, ఐక్రెడిట్, సిల్వర్ ప్యాకెట్, వార్న్ రూపీ, బడ్డీలోన్, సింపుల్ లోన్, ఫాస్ట్ పైసా, బెలెనోలోన్, ఈగల్ క్యాష్ లోన్ యాప్, ప్రెష్ లోన్, మినట్ క్యాష్, క్యాష్ లోన్, స్లైష్ పే, ప్యాకెట్ మనీ, రూపీప్లస్, ఫార్చూన్ నౌ, ఫాస్ట్ కాయిన్, ట్రీలోన్, క్యాష్ మిషన్, కోకోలోన్, రూపియా బస్, హ్యాండీలోన్, ఎక్స్‌ప్రెస్ లోన్, రూపీస్టార్, ఫస్ట్ క్యా‹ష్, రిచ్, ఫాస్ట్ రూపీ, అప్నాపైసా, లోన్ క్యూబ్, వెన్ క్రెడిట్, భారత్ క్యాష్; స్మార్ట్ కాయిన్, క్యాష్ మైన్, క్యాష్మిషన్ లోన్, మోర్ క్యాష్, క్యాష్ క్యారీ యాప్, బెట్ విన్నర్ బెట్టింగ్, బస్ రూపీ, క్వాలిటీ క్యాష్, డ్రీమ్ లోన్, క్రెడిట్ వాలెట్, స్టార్ లోన్, బ్యాలెన్స్ లోన్, క్యాష్ ప్యాకెట్ లైవ్ క్యాష్, లోన్ రిసోర్స్, రూపీకింగ్, లోన్ డ్రీమ్, వావ్ రూపీ, క్లియర్ లోన్, లోన్గో, లోన్ ఫార్చూన్, కాయిన్ రూపీ, సమయ్ రూపీ, మనీ మాస్టర్, లక్కీ వ్యాలెట్, టైటో క్యాష్, ఫర్ పే, క్యాష్ బుక్, రిలయబుల్ రూపీక్యాష్, క్యాష్ పార్క్, రూపీమాల్, ఓబీ క్యాష్ లోన్, రూపియా బస్, ఐ కర్జా, లోన్ లోజీ, క్యాష్ స్టార్ మినిసో రూపీ, పాకెట్ బ్యాంక్, ఈజీ క్రెడిట్, క్యాష్ బాల్, క్యాష్ కోలా, ఆరెంజ్ లోన్, గోల్డ్ క్యాష్, ఏంజెల్ లోన్, లోన్ సాతీ, షార్ప్లోన్, స్కైలోన్, జో క్యాష్, బెస్ట్ పైసా, హాలో రూపీ, హాలిడే మొబైల్ లోన్, ఫోన్ పే, ప్లంప్ వ్యాలెట్, క్యాష్ క్యారీ లోన్ యాప్, క్రేజీ క్యాష్, క్విక్ లోన్ యాప్, రాకెట్ లోన్, రష్ లోన్, ఏగిల్ లోన్ యాప్, ఇన్కమ్, క్యాష్ అడ్వాన్స్ 1, ఈజీ బారో క్యాష్ లోన్, ఐఎన్డీ లోన్, వ్యాలెట్ పేయి, క్యాష్ గురు యాప్, క్యాష్ హోల్, ఎమ్ఓ క్యాష్. చదవండి: గూగుల్.. హైదరాబాద్‌లో భారీ క్యాంపస్.. తెలంగాణతో ఒప్పందం -
డీహెచ్ఎఫ్ఎల్ ఉత్తుత్తి గృహ రుణాలు..
న్యూఢిల్లీ: లబ్ధిదారులతో సంబంధం లేకుండా ఉత్తుత్తి (కల్పిత) గృహ రుణ ఖాతాలను సృష్టించి వాటిపై ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం (పీఎంఏవై) సబ్సిడీలను డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీ మింగేసినట్టు బయటపడింది. ఇందుకు సంబంధించి డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీ, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు అయిన కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్, డైరెక్టర్లపై కేసు నమోదు చేసింది. డీహెచ్ఎఫ్ఎల్ ఖాతాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన గ్రాంట్ థార్న్టన్ సంస్థ ఈ మోసాలను వెలుగులోకి తీసుకొచ్చింది. డీహెచ్ఎఫ్ఎల్ ముంబైలోని బాంద్రాలో కల్పిత శాఖను ఏర్పాటు చేయడమే కాకుండా.. అప్పటికే గృహ రుణాలు తీసుకుని చెల్లించేసిన రుణ ఖాతాలను ఉత్తుత్తి శాఖలోని డేటాబేస్‌లో చేర్చింది. 2007–19 మధ్య ఇందుకు సంబంధించి 2.60 లక్షల నకిలీ ఖాతాలను సృష్టించి రూ.14,046 కోట్ల రుణాలను మంజూరు చేసినట్టు చూపింది. రూ.11,756 కోట్లను ఇలా దారిమళ్లించినట్టు బయటపడింది. -
ఆధార్ కార్డుతో బినామీ రుణాలకు చెక్
అమరావతి: ఇకపై ఆధార్‌కార్డును ఆధారంగా చేసుకుని రైతులకు రుణాలు మంజూరు చేస్తామని రాష్ట్ర అటవీ, సహకారశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాల్లోని ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, బ్యాంకుల్లోని బినామీ రుణాలను అరికట్టేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కొంత మంది వ్యాపారులు రైతుల పేరుపై వ్యవసాయ రుణాలను తక్కువ వడ్డీకి తీసుకుంటున్నారని, మరి కొందరు రైతులు వేర్వేరు ప్రాంతాల్లో రుణాలు తీసుకుంటూ లబ్దిపొందుతున్నారని, దీని వలన మిగిలిన అర్హులకు రుణాలు అందుబాటులోకి రావడం లేదని వివరించారు. ఆధార్‌కార్డు వినియోగంతో వీటిని పూర్తిగా నియంత్రించే అవకాశం ఉండటంతో బ్యాంకు అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. బుధవారం సచివాలయంలోని ఆయన ఛాంబర్లో సహకార శాఖపై సమీక్ష జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని 2500 సహకార సంఘాలను దశల వారీగా కంప్యూటరీకరణ చేయనున్నామని, తొలిదశలో లాభాల్లో కొనసాగుతున్న 600 సంఘాలను పూర్తి చేస్తామని చెప్పారు. తమిళనాడులోని దాదాపు అన్ని సహకార సంఘాలు, బ్యాంకుల్లో కంప్యూటరీకరణ పూర్తయిందని, అక్కడి ఉన్నతాధికారులు వచ్చే నెల రాష్ట్రంలోని సహకార సంఘాలకు శిక్షణ ఇచ్చేందుకు విజయవాడ రానున్నారని తెలిపారు. రుణమాఫీకి సంబంధించి సహకార శాఖలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాల్లో ప్రత్యేకంగా ఏర్పాటైన సెల్స్‌తో సహకార శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు. వడ్డీ రాయితీ కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.431 కోట్లు రావాల్సి ఉందని, ఆప్కాబ్ ఈ వడ్డీ రాయితీని సహకార బ్యాంకులు, సంఘాలకు చెల్లించిందని, అయితే ఆ మొత్తాన్ని రాష్ట్ర ఫ్రభుత్వం ఆప్కాబ్‌కు చెల్లించాల్సి ఉందన్నారు. ఇటీవలనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు వడ్డీ రాయితీ విడుదలపై విజ్ఞప్తి చేశామని చెప్పారు. మిగిలిన జిల్లాలతో పోల్చితే ఉభయ గోదావరి జిల్లాల కేంద్ర సహకార బ్యాంకులు బాగా పనిచేస్తున్నాయని, లాభాల బాటలో ఉన్నాయని సంతృప్తిని వ్యక్తం చేశారు.