లోన్‌ యాప్స్‌తో జాగ్రత్త..ఆర్బీఐ వెల్లడించిన 137 ఫేక్‌ లోన్‌ యాప్స్‌ ఇవే..! | Rbi Released 137 Fake Loan Apps List | Sakshi
Sakshi News home page

లోన్‌ యాప్స్‌తో జాగ్రత్త..ఆర్బీఐ వెల్లడించిన 137 ఫేక్‌ లోన్‌ యాప్స్‌ ఇవే..!

Published Thu, Apr 28 2022 11:44 PM | Last Updated on Thu, Apr 28 2022 11:48 PM

Rbi Released 137 Fake Loan Apps List - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డాక్యుమెంట్లతో పనిలేకుండా చిటికెలో లోన్లు ఇస్తామంటూ వలవేస్తున్న యాప్‌ సంస్థలను నమ్మరాదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రజలను అప్రమత్తం చేసింది. దేశంలో 137 ఫేక్‌ లోన్‌ యాప్స్‌ ఉన్నాయని, వాటిని నమ్మవద్దంటూ జాబితా విడుదల చేసింది. దేశంలో వడ్డీ వ్యాపారానికి సంబంధించిన ఎలాంటి అనుమతులు లేకుండా చైనా లింకుతో ఈ యాప్‌లు నడుస్తున్నాయని ఆర్బీఐ పేర్కొంది. సదరు ఫేక్‌ లోన్‌ యాప్స్‌ జాబితాపై రాష్ట్ర పోలీస్‌ శాఖ సోషల్‌ మీడియా వేదికల ద్వారా యువతకు, మోసపోతున్న బాధితులకు అవగాహన కల్పిస్తోంది.

ఈ యాప్స్‌.. తీసుకున్న మొత్తానికంటే రెండు, మూడింతలు వసూలుచేసి బాధితులను వేధిస్తున్నట్టు, రాష్ట్రవ్యాప్తంగా మూడు నెలల్లో 680కిపైగా కేసులు నమోదైనట్టు తెలిసింది. తాము అడిగినంత చెల్లించకుంటే సోషల్‌ మీడియా ద్వారా బాధితులను బద్నామ్‌ చేస్తూ యాప్‌ నిర్వాహకులు బెదిరింపులకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్న దాఖలాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ ఇచ్చిన యాప్స్‌ జాబితాను ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచుతూ పోలీస్‌ శాఖ అవగాహన కల్పిస్తోంది.


ఆర్బీఐ స్కానర్‌లో పడ్డ ఫేక్‌ యాప్స్‌ ఇవే
యూపీఏ లోన్, ఎమ్‌ఐలోన్, రూపీ లోన్, క్యాస్‌ పార్క్‌లోన్, రూపీ బాక్స్, అసాన్‌ లోన్, క్యాష్‌ ప్యాకెట్, క్యాస్‌ అడ్వాన్స్, లోన్‌ హోం స్మాల్, లెండ్‌ మాల్, ఈజీ లోన్, యూపీఓ లోన్‌.కామ్, మై క్యాష్‌ లోన్, మినిట్‌ క్యాష్, హ్యాండ్‌ క్యాష్‌ ఫ్రెండ్లీ లోన్, ఎర్లీ క్రెడిట్‌ ఆప్, రిచ్‌ క్యాష్, సన్‌ క్యాష్, ఆన్‌స్ట్రీమ్, ఇన్‌స్టామనీ, మనీ స్టాండ్‌ ప్రో, ఫర్‌పే ఆప్, క్యాష్‌పాల్, లోన్‌ జోన్, ఏటీడీ లోన్, క్యాస్‌ క్యారీ, 66క్యాష్, డైలీ లోన్, గోల్డ్‌మ్యాన్‌ పే బ్యాక్, వన్‌ లోన్‌ క్యాష్‌ ఎనీ టైమ్, ఫ్లాష్‌ లోన్‌ మొబైల్, హో క్యాష్, స్మాల్‌ లోన్, లైవ్‌ క్యాష్, ఇన్‌స్టాలోన్, క్యాష్‌ పాపా, ఐక్రెడిట్, సిల్వర్‌ ప్యాకెట్, వార్న్‌ రూపీ, బడ్డీలోన్, సింపుల్‌ లోన్, ఫాస్ట్‌ పైసా, బెలెనోలోన్, ఈగల్‌ క్యాష్‌ లోన్‌ యాప్, ప్రెష్‌ లోన్, మినట్‌ క్యాష్, క్యాష్‌ లోన్, స్లైష్‌ పే, ప్యాకెట్‌ మనీ, రూపీప్లస్, ఫార్చూన్‌ నౌ, ఫాస్ట్‌ కాయిన్, ట్రీలోన్, క్యాష్‌ మిషన్, కోకోలోన్, రూపియా బస్, హ్యాండీలోన్, ఎక్స్‌ప్రెస్‌ లోన్, రూపీస్టార్, ఫస్ట్‌ క్యా‹ష్, రిచ్, ఫాస్ట్‌ రూపీ, అప్నాపైసా, లోన్‌ క్యూబ్, వెన్‌ క్రెడిట్, భారత్‌ క్యాష్‌;

స్మార్ట్‌ కాయిన్, క్యాష్‌ మైన్, క్యాష్‌మిషన్‌ లోన్, మోర్‌ క్యాష్, క్యాష్‌ క్యారీ యాప్, బెట్‌ విన్నర్‌ బెట్టింగ్, బస్‌ రూపీ, క్వాలిటీ క్యాష్, డ్రీమ్‌ లోన్, క్రెడిట్‌ వాలెట్, స్టార్‌ లోన్, బ్యాలెన్స్‌ లోన్, క్యాష్‌ ప్యాకెట్‌ లైవ్‌ క్యాష్, లోన్‌ రిసోర్స్, రూపీకింగ్, లోన్‌  డ్రీమ్, వావ్‌ రూపీ, క్లియర్‌ లోన్, లోన్‌గో, లోన్‌ ఫార్చూన్, కాయిన్‌ రూపీ, సమయ్‌ రూపీ, మనీ మాస్టర్, లక్కీ వ్యాలెట్, టైటో క్యాష్, ఫర్‌ పే, క్యాష్‌ బుక్, రిలయబుల్‌ రూపీక్యాష్, క్యాష్‌ పార్క్, రూపీమాల్, ఓబీ క్యాష్‌ లోన్, రూపియా బస్, ఐ కర్జా, లోన్‌ లోజీ, క్యాష్‌ స్టార్‌ మినిసో రూపీ, పాకెట్‌ బ్యాంక్, ఈజీ క్రెడిట్, క్యాష్‌ బాల్, క్యాష్‌ కోలా, ఆరెంజ్‌ లోన్, గోల్డ్‌ క్యాష్, ఏంజెల్‌ లోన్, లోన్‌ సాతీ, షార్ప్‌లోన్, స్కైలోన్, జో క్యాష్, బెస్ట్‌ పైసా, హాలో రూపీ, హాలిడే మొబైల్‌ లోన్, ఫోన్‌ పే, ప్లంప్‌ వ్యాలెట్, క్యాష్‌ క్యారీ లోన్‌ యాప్, క్రేజీ క్యాష్, క్విక్‌ లోన్‌ యాప్, రాకెట్‌ లోన్, రష్‌ లోన్, ఏగిల్‌ లోన్‌ యాప్, ఇన్‌కమ్, క్యాష్‌ అడ్వాన్స్‌ 1, ఈజీ బారో క్యాష్‌ లోన్, ఐఎన్‌డీ లోన్, వ్యాలెట్‌ పేయి, క్యాష్‌ గురు యాప్, క్యాష్‌ హోల్, ఎమ్‌ఓ క్యాష్‌.

చదవండి: గూగుల్‌.. హైదరాబాద్‌లో భారీ క్యాంపస్‌.. తెలంగాణతో ఒప్పందం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement