సాక్షి, హైదరాబాద్: ఆర్బీఐ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే ఫారెక్స్ ట్రేడింగ్ పేరిట ప్రకటనలు గుప్పిస్తున్న పలు నకిలీ యాప్‌ల వివరాలను ఆర్బీఐ వెల్లడించింది.
ఆర్బీఐ వెల్లడించిన అనుమతి లేని ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌ల జాబితాలో అల్పరి ఇన్వెస్ట్–ఇన్వెస్ట్మెంట్స్, ఐక్యూ ఫారెక్స్–ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్, ఓలింప్ ట్రేడ్–ట్రేడింగ్ ఆన్‌లైన్‌లు ఉన్నాయి. అనుమతులు లేని యాప్‌లతో పెట్టుబడి పెట్టి మోసపోవద్దని ఆర్బీఐ హెచ్చరించింది.
ఆర్బీఐ అనుమతి లేని అలాంటి సంస్థల వివరాలు తెలిస్తే వెంటనే సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్‌లోగానీ, 1930 టోల్‌ఫ్రీ నంబర్‌లోగానీ తెలియజేయాలని కేంద్ర హోంశాఖ అధికారులు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment