
తూర్పు గోదావరి: లోన్ యాప్ ఉచ్చులో చిక్కుకున్న ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా కడియం భాస్కర్‌నగర్‌కు చెందిన ఎస్.హరికృష్ణ (18) లోన్ యాప్‌లో కొంత అప్పు తీసుకున్నాడు. రుణం చెల్లింపుల కోసం యాప్ నుంచి వేధింపులు అధికమవ్వడంతో గతంలో కడియం పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు.
ఈ నేపథ్యంలో శనివారం రాత్రి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో హరికృష్ణ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్ వేధింపులతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు కడియం పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment