Hyderabad Engineer Ramnagesh Akubathini Who Arrested For Rape Threats To Virat Kohli's Daughter సాక్షి, హైదరాబాద్: కోహ్లీ కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్టయిన సంగారెడ్డి వాసి రాంనగేష్ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడని కేసు దర్యాప్తు చేస్తున్న ముంబైలోని వెస్ట్ రీజియన్ సైబర్‌క్రైమ్ పోలీసులు గుర్తించారు. నగేష్ వ్యాఖ్యలపై కేసు నమోదైన తర్వాత అనేకమంది అతడి ట్విట్టర్ హ్యాండిల్‌ను వదిలివెళ్లారని చెప్తున్నారు. అప్పటివరకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వాళ్లు కూడా హఠాత్తుగా తప్పుకున్నారని వివరిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రకరణ్ పోలీసుస్టేషన్ పరిధిలో ఉండే శ్రీనివాస్.. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఫిట్టర్‌గా పని చేస్తున్నారు. ఈయన కుమారుడైన రాంనగేష్ హైదరాబాద్ ఐఐటీ నుంచి సాఫ్ట్‌వేర్ విద్యనభ్యసించాడు. బెంగళూర్ కేంద్రంగా పని చేసే ఓ ఫుడ్ డెలివరీ సంస్థల్లో ఉద్యోగం చేసిన నగేష్.. ఎంఎస్ కోసం విదేశాలకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తన ట్విట్టర్ హ్యాండిల్ (@criccrazyygir) ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేశాడు.
దీనిపై దర్యాప్తు చేసిన ముంబై పోలీసులు గత మంగళవారం రాత్రి సంగారెడ్డికి వచ్చి నగేష్‌ను అరెస్టు చేసి తీసుకువెళ్లారు. విచారణలో భాగంగా నగేష్ ఫోన్‌ను పరిశీలించిన పోలీసులు అతడు ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు గుర్తించారు. దీనికోసం గూగుల్‌లో వివిధ విధానాలను పరిశీలించాడు. అయితే తల్లిదండ్రులపై ఉన్న ప్రేమ కారణంగా ఈ నిర్ణయాన్ని మార్చుకున్నాడని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ముంబై చేరుకున్న రాంనగేష్ తండ్రి అతడి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
(చదవండి: బ్యాంక్ ఉద్యోగి: భార్య వేధిస్తోంది.. చనిపోతున్నా.. )
Comments
Please login to add a commentAdd a comment