
సాక్షి, అమరావతి: పిల్లలు, మహిళలపై సైబర్ వేధింపులను అరికట్టడానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. అందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామన్నారు. సీఐడీ విభాగం ‘ఈ–రక్షాబంధన్’ ముగింపు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఏపీ పోలీస్ వెబ్‌సైట్, మొబైల్ అనువర్తనం సురక్ష పత్రికను డీజీపీ ప్రారంభించారు.
పిల్లలు, మహిళలకు సైబర్ భద్రత గురించిన సీఐడీ విభాగం, సి–డాక్ ముద్రించిన అవగాహన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సవాంగ్ మాట్లాడుతూ ఇంటర్నెట్, సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్నందున పిల్లలు, మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్‌కుమార్ మాట్లాడుతూ సైబర్ భద్రతపై అవగాహన అందరికీ అత్యావశ్యకం అన్నారు. బ్యాంకు ఖాతాలు, ఓటీపీ తదితర వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment