
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ యాప్ నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ప్రత్యేకంగా భారతీయ వినియోగదారులకు అత్యంత చవక ధరకే నెలవారీ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ముఖ‍్యంగా అమెజాన్ ప్రైమ్ వీడియోకు షాకిచ్చేలా రూ.199లకే నెలవారీప్లాన్‌ను బుధవారం ప్రకటించింది.మొబైల్, లేదా ట్యాబ్ సేవలకు మాత్రమే ఈ ప్లాన్ పరిమితం. నెలకు రూ. 500 బేసిక్ ప్లాన్‌తో వినియోగదారులకు ఆకట్టుకోలేకపోతున్ననెటిఫిక్ల్స్ ప్రధాన ప్రత్యర్థులు అమెజాన్, హాట్‌స్టార్ అందిస్తున్న ప్లాన్లకు ధీటుగా అత్యంత తక్కువ ధరకే తాజా ప్లాన్‌ను ప్రకటించడం విశేషం.
తాజా ప్లాన్‌లో ఒకేసారి ఒక స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌లో ఎస్‌డి కంటెంట్‌ను వీక్షిచేందుకు ఈ ప్లాన్ వినియోగదారులను అనుమతిస్తుంది. 499, 649 , 799 రూపాయల మధ్య ఉన్న ప్రస్తుత, బేసిక్, ప్రీమియం ప్రణాళికలతో పాటు నెట్‌ఫ్లిక్స్ తీసుకొచ్చిన నాల్గవ ప్లాన్ ఇది. ఫిక్కి నివేదిక ప్రకారం భారతీయ వినియోగదారులు ప్రయాణంలోనే చూస్తున్నారనీ, 30 శాతం ఫోన్ సమయంలో 70శాతం మొబైల్ డేటాను ఎంటర్‌టైన్‌మెంట్‌లో గడుపుతున్నారనీ, దీంతో సాధ్యమైనంత ఎక్కువ డివైస్‌లకు చేరుకోవడమేతమ లక్ష్యమని నెట్‌ఫ్లిక్స్ పార్టనర్ ఎంగేజ్‌మెంట్ డైరెక్టర్ నిగెల్ బాప్టిస్ట్ చెప్పారు. దాదాపు పదమూడు కొత్త చిత్రాలు, తొమ్మిది కొత్త ఒరిజినల్ సిరీస్‌లు ఇప్పటికే అందుబాటులో ఉంచినట్టు సంస్థ తెలిపింది. అలాగే కొన్ని దేశాలలో మొబైల్ ఓన్లీ ప్లాన్‌ను మార్చి మాసంనుంచి పరీక్షించనుంది. ప్రస్తుతం అమెజాన్, హాట్‌స్టార్ తదితర వీడియో స్ట్రీమింగ్ యాప్‌లలో చాలా తక్కువ ధరకే నెలవారీ, వార్షిక ప్లాన్‌లను అందిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment