అక్రమాలకు చెక్ పెట్టేందుకే! | Schools H M, C R P tabs issues in government | Sakshi
Sakshi News home page

అక్రమాలకు చెక్ పెట్టేందుకే!

Published Sat, Apr 30 2016 6:05 AM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM

అక్రమాలకు చెక్ పెట్టేందుకే!

అక్రమాలకు చెక్ పెట్టేందుకే!

త్వరలో పాఠశాలల హెచ్‌ఎం, సీఆర్‌పీలకు ట్యాబ్‌లు
అన్ని స్కూళ్లలో అమలుకు
విద్యాశాఖ కసరత్తు

 
చిత్తూరు(గిరింపేట): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరును మెరుగుపరిచేందుకు రాష్ట్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఉపాధ్యాయుల హాజరు, తనిఖీల్లో జరిగే అక్రమాలకు చెక్ పెట్టడం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని అధికారులు నిర్ణయించా రు. ఇటీవల డీఈవో, పీవో, డీవైఈవో, ఎంఈవోలకు ట్యాబులను సరఫరా చేశారు. వీటిని వారందరూ వినియోగిస్తూ రాష్ట్ర విద్యాశాఖ నుంచి వచ్చే ఆదేశాలకు సమాధానాలను ఆ ట్యాబ్‌ల  ద్వారా పంపుతున్నారు.

ఇది విజయవంతం కావడంతో  త్వరలో జిల్లాలోని హైస్కూల్ పాఠశాలల హెచ్‌ఎంలకు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్‌లను ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ ట్యాబ్‌లను జీపీఎస్‌తో అనుసంధానం చేయడ ం ద్వారా ఎప్పటికప్పుడు కచ్చితమైన సమాచారం అందడంతో పాటు, అకడమిక్ పర్యవేక్షణ సులభతరమవుతుందని భావిస్తున్నారు. విద్యార్థుల బోగస్ హాజరుకు చెక్‌పెట్టడంతో పాటు, విధులకు డుమ్మా కొట్టే టీచర్లను గుర్తించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ నూతన  విధానానికి, ఈ పర్యవేక్షణకు సమగ్ర నిర్వహణ సమాచార పద్ధతి(మానిటరింగ్ అండ్ ఇన్ఫరేషన్ సిస్టమ్) గా పేరపెట్టారు.


 జీపీఎస్‌తో అనుసంధానం
 ఉన్నతపాఠశాలల హెచ్‌ఎంలకు త్వరలో ఇవ్వనున్న ట్యాబ్‌లకు ప్రభుత్వం జీపీఎస్ విధానానికి అనుసంధానం చెయ్యనుంది. ఆర్‌జేడీ, డీఈవోల నుంచి మండల విద్యాశాఖాధికారులు, హైస్కూల్ హెచ్‌ఎంలు , క్లస్టర్ రిసోర్స్ పర్సన్ల వరకు తామునిర్వర్తించే పనులను ఎప్పటికప్పుడు రాష్ట్ర విద్యాశాఖకు ఆ ట్యాబ్‌ల ద్వారా అప్‌లోడ్ చెయ్యాల్సి ఉంటుంది. మండల విద్యాశాఖాధికారులు ప్రతి వారం స్కూళ్లను పర్యవేక్షించాల్సిన బాధ్యతను అప్పగించారు. వారు ఆ పాఠశాలకు వెళ్లి అక్కడ ఉన్న సదుపాయాలను ఫొటో లు తీసి పంపాల్సి ఉంటుంది. ఇందుకోసం అధికారులకు ట్యాబ్‌లను  జీపీఎస్‌తో అనుసంధానం చేయనున్నారు. దీనివల్ల నిజంగా అక్కడికి వెళ్లి ఫొటోలు తీశారా? లేదా? ఏ రోజు తీశారు? ఏ సమయంలో తీశారన్న విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు. ఈ కొత్త విధానం వల్ల ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా పనిచేయాల్సిందే. అయితే తాము కాకుండా వెరొకరిని పంపించడం వంటి అంశాలకు వీలు లేకుం డా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు. పాఠశాల సమాచా ర నివేదికల రూపొందించడానికి విద్యాశాఖ పోర్టల్, డాప్‌బోర్డు అప్‌లోడ్ అయ్యేలా, ట్యాబ్‌లలో నిక్షిప్తం చేసేలా అప్లికేషన్‌ను రూపొందించారు. ఇంటర్నెట్ సౌకర్యం గల సిమ్‌కార్డులను  కూడా అందజేస్తారు.
 
 లక్షాలివే..
 ►మానిటరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఐఎస్) కింద పాఠశాల పనితీరు, విద్యావిషయా లు, విద్యార్థులు, టీచర్ల హాజరు, ఇతర అంశాలపై ఆన్‌లైన్‌లో పర్యవేక్షిస్తారు.

కీలక విభాగాలకు  సంబంధించిన తాజా సమాచారాన్ని పాఠశాల విద్యాశాఖకు అప్‌లోడ్ చేయడం.   
► క్షేత్రస్థాయి విద్యావిధానాన్ని నిరంతరం పర్యవేక్షించడం
►మధ్యాహ్న భోజన పథకం సమర్థవంతంగా అమలయ్యేలా పర్యవేక్షించడం
►పాఠశాలల్లో ఆధునిక సదుపాయాల కల్పన, వాటి పర్యవేక్షణను గమనించడం
► వివిధ అవసరాలకు బడ్జెట్‌లో, వాటికి సంబంధించిన  అకౌంటింగ్, ఎలక్ట్రానిక్ నిర్వహణ
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement