న్యూఢిల్లీ: సిలబస్‌ను కాషాయీకరణ చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ దినేశ్ సక్లానీ స్పందించారు. ఆదివారం(జూన్16) పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయమై ఆయన మాట్లాడారు. విద్యార్థులకు వాస్తవాలను తెలియజేయడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు.
చరిత్రను తెలియజేసే అంశాలను బోధిస్తామని, యుద్ధానికి మద్దతుగా బోధన ఉండదన్నారు. బాధ్యత గల పౌరులను మాత్రమే సమాజానికి అందించాలనుకుంటున్నామని దినేశ్ తెలిపారు. ‘పుస్తకాల ద్వారా చిన్నారులకు అల్లర్ల గురించి ఎందుకు బోధించాలి సమాజంలో నేరాలు, హింస ఎలా సృష్టించాలనే విషయాలను మన విద్యార్థులకు బోధించాలా ఇదేనా విద్య ముఖ్య ఉద్దేశం.
అసలు అల్లర్ల గురించి చిన్న వయసులో పిల్లలకెందుకు. రామ జన్మభూమిపై సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే దాన్ని పుస్తకాల్లో చేర్చకూడదా.. కొత్త పార్లమెంటును నిర్మిస్తే వాటి గురించి మన విద్యార్థులు తెలుసుకోవద్దా.. ఇటువంటి అంశాలనే సిలబస్‌లో చేర్చాం. చారిత్రక విషయాలతో పాటు సమకాలీన అంశాలను సిలబస్‌లో చేర్చడం మా బాధ్యత’అని సక్లానీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment