ఒలంపియాడ్స్‌లో విజయం సాధించాలంటే.. (స్పాన్సర్డ్‌) | List of Olympiad How to Prepare And Their Benefits Sponsored | Sakshi
Sakshi News home page

ఒలంపియాడ్స్‌లో విజయం సాధించాలంటే.. (స్పాన్సర్డ్‌)

Published Mon, Sep 21 2020 7:47 PM | Last Updated on Mon, Dec 28 2020 11:14 AM

List of Olympiad How to Prepare And Their Benefits Sponsored - Sakshi

ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యకు ప్రపంచ వ్యాప్తంగా అధిక ప్రాధాన్యత ఏర్పడింది. విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు ‘ఒలంపియాడ్స్‌’ అనే టాలెంట్‌ టెస్ట్‌లను నిర్వహిస్తుంటారు. ఒలంపియాడ్స్ పరీక్ష ద్వారా దేశ, అంతర్జాతీయ విద్యార్థులతో పోటీ పడవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒలంపియాడ్‌ టెస్ట్‌తో విద్యార్థి ప్రతిభను సులభంగా గుర్తించవచ్చని తెలిపారు. కాగా విద్యార్థులు ఒలంపియాడ్‌ పరీక్షలు ప్రిపేర్‌ కావడానికి ఇండియన్‌ టాలెంట్‌ ఒలంపియాడ్‌ సంస్థ అత్యుత్తమంగా శిక్షణ ఇస్తుంది. విస్తృతమైన సమాచారం, అవగాహనతో ఒలంపియాడ్‌ పరిక్షలో విజయం సాధించడానికి ఎంతో తోడ్పడుతుంది. ఇండియన్‌ టాలెంట్‌ ఒలంపియాడ్‌ సంస్థ 2012లో ఏర్పడింది.

ప్రస్తుతం 33,175 స్కూల్స్‌లో ఇండియన్‌ టాలెంట్‌ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. కోటి మంది విద్యార్థులు తమ సంస్థను అనుసరిస్తున్నారని, ఇప్పటి వరకు 2లక్షల క్లాస్‌ టాపర్స్‌ను గుర్తించామని, ప్రతి సంవత్సరం 7వేల మందికి స్కాలర్‌షిప్స్‌ అందిస్తున్నట్లు సంస్థ నిర్వాహికులు తెలిపారు. తమ సంస్థ కమిటీలో అర్జున, పద్మశ్రీ అవార్డు గ్రహీత పీటీ ఉషా మేడమ్‌ ఉండడం సంతోషమని నిర్వాహకులు తెలిపారు. దేశంలో వివిధ విభాగాలలో ఒలంపియాడ్‌ టాలెంట్‌ పరీక్షలు ప్రతి సంవత్సరం జరుపుతుంటారు. దేశంలో ప్రతి సంవ్సతరం 8 విభాగాలలో ఒలంపియాడ్‌ పరీక్షలు నిర్వహిస్తుంటారు.

ఇంటర్నేషనల్‌‌ సైన్స్‌ ఒలంపియాడ్‌(ఐఎస్‌ఓ), ఇంటర్నేషనల్‌‌ మ్యాథ్స్‌ ఒలంపియాడ్‌(ఐఎమ్‌ఓ),ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ ఒలంపియాడ్ (ఈఐఓ), జనరల్ నాలెడ్జ్ ఇంటర్నేషనల్ ఒలంపియాడ్ (జేకేఐఓ), ఇంటర్నేషనల్ కంప్యూటర్ ఒలంపియాడ్ (ఐసీఓ), ఇంటర్నేషనల్ డ్రాయింగ్ ఒలంపియాడ్ (ఐడీఓ), నేషనల్ ఎస్సే ఒలింపియాడ్ (ఎన్ఈఎస్‌ఓ), నేషనల్ సోషల్ స్టడీస్ ఒలింపియాడ్ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ)

ఒలింపియాడ్‌ పరీక్షలలో రాణించాలంటే
ఒలింపియాడ్‌ పరీక్షలలో రాణించడానికి విద్యార్థుల ఫస్ట్‌ క్లాస్‌ నుంచి టెన్త్‌ క్లాస్‌ (ఎన్‌సీఈఆర్‌టీ) పాఠ్యపుస్తకాలను విస్తృతంగా అధ్యయనం చేయాలి. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై సంపూర్ణ అవగాహన ఉండాలి. విద్యార్థులను పరీక్షలో విజయం సాధించడానికి ప్రాక్టీస్‌ వర్క్‌ బుక్స్‌, ప్రీవియస్‌ పేపర్స్‌పై విశ్లేషణ ఉంటుందని ఒలంపియాడ్ టాలెంట్‌ సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఇంటి నుంచే ప్రిపెర్‌ అయ్యే విద్యార్థులకు ఆన్‌లైన్ వీక్లీ ఒలంపియాడ్ పరీక్షలు, క్రమం తప్పకుండా తరగతులను నిర్వహిస్తామని తెలిపారు.

ఇండియన్‌ టాలెంట్‌ ఒలంపియాడ్‌ సంస్థతో విద్యార్థులకు ప్రయోజనాలు
- లాజికల్‌ రిజనింగ్‌పై సంపూర్ణ అవగాహన
- విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు ప్రణాళికమైన వ్యూహ రచన
- పరీక్షపై భయం పోగొట్టి, ఒలంపియాడ్‌ పరీక్షలో గెలవగలననే నమ్మకం కల్పిండం
- క్రమం తప్పపని రివిజన్‌, కాన్సెప్ట్స్‌ ఆధారిత బోధన

ఒలింపియాడ్‌ పరీక్షలో (ఫస్ట్‌ క్లాస్‌ నుంచి టెన్త్‌ క్లాస్‌) మొదటి జాతీయ ర్యాంక్‌ సాధించిన వారికి లక్ష రూపాయల, రెండవ ర్యాంకు సాధించిన పది మంది విద్యార్థులకు 10 ల్యాప్‌టాప్లను అందజేస్తారు. మరిన్ని వివరాలకు ఇండియన్‌ టాలెంట్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. (Advertorial)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement