సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం గతంలో చేపట్టిన పెద్ద నోట్ల రద్దు అంశం ఒక విఫల ప్రయోగమని తెలంగాణ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. నోట్ల రద్దు వల్ల సుమారు 62 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని, పెద్ద నోట్ల రద్దు అంశంపై కేంద్రం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈరోజు(మంగళవారం) హరీష్‌రావు మాట్లాడుతూ.. ‘ దేశంలో నగదు చలామని గతం కంటే రెట్టింపు అయ్యింది. ఆర్బీఐ నివేదిక ప్రకారం ఫేక్ కరెన్సీ 54 శాతం పెరిగింది. దేశంలో అవినీతి పెరిగిందని సీబీడీఐ చెప్పింది. దేశంలో నల్లధనం విపరీతంగా పెరిగింది. టెర్రరిజాన్ని అదుపులోకి తెస్తామన్నారు.. ఏం చేశారు?, కేంద్రం చెప్పేదొకటి.. చేసేదొకటి’ అని మందిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment