
బంగ్లాగా బెంగాల్ : కేంద్రం నో క్లారిటీ
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ పేరు మార్చుతూ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది. బెంగాల్ పేరు మార్చుతూ ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. పేరు మార్పునకు రాజ్యాంగ సవరణ అవసరం అవుతుందని తెలిపింది. కాగా రాజ్యసభలో అంతకుముందు తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ పేరును బంగ్లాగా మార్చాలని, బెంగాలీ ఉనికిని చాటేలా బెంగాలీ, ఇంగ్లీష్, హిందీ మూడు భాషల్లో పేరును మార్పు చేయాలని కోరారు.
మరోవైపు రాష్ట్ర అసెంబ్లీలో పశ్చిమ బెంగాల్ పేరును బంగ్లాగా మార్చాలని ఏకగ్రీవంగా తీర్మానించినా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపడంలో తాత్సారం చేస్తోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఇష్టానుసారం చారిత్రక ప్రాంతాలు, సంస్థల పేర్లను మార్చుతూ బెంగాల్ విషయం వచ్చేసరికి భిన్నంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.