న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు తర్వాత సుమారు 1,678 మంది కశ్మీరీలు తిరిగి స్వస్థలాలకు చేరుకున్నారని కేంద్రం తెలిపింది. వీరందరికీ ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ–2015 కింద ఉద్యోగాలను కల్పించినట్లు మంగళవారం పార్లమెంట్‌లో వెల్లడించింది. జమ్మూకశ్మీర్ ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకు 150 మంది దరఖాస్తుదారుల భూములను తిరిగి వారికే అప్పగించినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. వలసవెళ్లిన హిందువులకు చెందిన భూములపై తిరిగి వారికే అధికారం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment