న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకం కోసం ఉద్దేశించిన కొలీజియం వ్యవస్థ అనేది మన దేశ చట్టమని సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది. తాము నిర్దేశించిన ఏ చట్టమైనా భాగస్వామ్యపక్షాలను కలిపి ఉంచుతుందని పేర్కొంది. కొలీజియం వ్యవస్థను కచ్చితంగా అందరూ అనుసరించాల్సిందేనని తేల్చిచెప్పింది.
కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను కేంద్ర ప్రభుత్వం త్వరగా ఆమోదించకుండా జాప్యం చేస్తుండడాన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో పిటిషనల్ దాఖలైంది. దీనిపై జస్టిస్ ఎస్.కె.కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కొలీజియంపై కేంద్ర మంత్రులు, ప్రభుత్వ పెద్దలు చేస్తున్న వ్యాఖ్యలను తాము పట్టించుకోవడం లేదని స్పష్టం చేసింది.
చదవండి: (కాంగ్రెస్‌లో అంతర్మథనం.. పక్కలో బల్లెంలా మారుతున్న ఆప్)
Comments
Please login to add a commentAdd a comment