coliseum system
-
కొలీజియం మన దేశ చట్టం.. అందరూ అనుసరించాల్సిందే: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకం కోసం ఉద్దేశించిన కొలీజియం వ్యవస్థ అనేది మన దేశ చట్టమని సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది. తాము నిర్దేశించిన ఏ చట్టమైనా భాగస్వామ్యపక్షాలను కలిపి ఉంచుతుందని పేర్కొంది. కొలీజియం వ్యవస్థను కచ్చితంగా అందరూ అనుసరించాల్సిందేనని తేల్చిచెప్పింది. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను కేంద్ర ప్రభుత్వం త్వరగా ఆమోదించకుండా జాప్యం చేస్తుండడాన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో పిటిషనల్ దాఖలైంది. దీనిపై జస్టిస్ ఎస్.కె.కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కొలీజియంపై కేంద్ర మంత్రులు, ప్రభుత్వ పెద్దలు చేస్తున్న వ్యాఖ్యలను తాము పట్టించుకోవడం లేదని స్పష్టం చేసింది. చదవండి: (కాంగ్రెస్‌లో అంతర్మథనం.. పక్కలో బల్లెంలా మారుతున్న ఆప్) -
9 రాష్ట్రాలకు కొత్త సీజేలు
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు (సీజే) రానున్నారు. వీరిలో నలుగురు సీజేలు బదిలీపై రానుండగా.. ఐదుగురు న్యాయమూర్తులకు సీజేగా పదోన్నతి లభించింది. అలాగే మరో ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తులు ఇతర రాష్ట్రాలకు బదిలీ అయ్యారు. మొత్తమ్మీద దేశవ్యాప్తంగా సీజేలు, న్యాయమూర్తులు కలిపి 14 మందికి బదిలీ అయింది. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ హిమా కోహ్లి.. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుత సీజే జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ఉత్తరాఖండ్ సీజేగా బదిలీ అయ్యారు. ఇక ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిక్కిం హైకోర్టు సీజే జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి రానుండగా.. ఏపీ ప్రస్తుత సీజే జస్టిస్ జేకే మహేశ్వరి సిక్కిం సీజేగా బదిలీ అయ్యారు. అలాగే కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి.. ఏపీ హైకోర్టుకు బదిలీపై రానున్నారు. జస్టిస్ హిమా నేపథ్యం ఇదీ.. తెలంగాణ హైకోర్టుకు సీజేగా రానున్న జస్టిస్ హిమా కోహ్లి ఢిల్లీలో 1959 సెప్టెంబర్ 2న జన్మించారు. ఢిల్లీలోని సెయింట్ థామస్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేసుకున్నారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి బీఏ గ్రాడుయేట్ పట్టా పొందారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి చరిత్రలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. 1984లో లా పట్టా అందుకుని ఢిల్లీ బార్ కౌన్సిల్లో నమోదయ్యారు. 1999 నుంచి 2004 వరకు ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్‌కు స్టాండింగ్ కౌన్సెల్‌గా, న్యాయ సలహాదారుగా పనిచేశారు. 2006 మే 29న ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2007 ఆగస్టు 29న పూర్తికాలం న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఢిల్లీ రాష్ట్ర న్యాయసాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా, నేషనల్ లా యూనివర్సిటీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యురాలిగా, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ చైర్‌పర్సన్‌గా సేవలు అందిస్తున్నారు. కరోనా పరీక్షల వెనుక ఆమె.. ఢిల్లీలో కరోనా పరీక్షలు ఎక్కువగా నిర్వహించడానికి ప్రయోగశాలలు పెంచడం, ఫలితాలు ఒకే రోజులో వచ్చేలా చేయడం వంటి ఆదేశాలు జస్టిస్ హిమా కోహ్లి ఇచ్చినవే. ప్రస్తుతం ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యనిర్వాహక చైర్‌పర్సన్‌గానూ ఆమె వ్యవహరిస్తున్నారు. న్యాయమూర్తిగా అధికారిక విధులు నిర్వర్తించడంతో పాటు ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం ఫోరమ్‌గా మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించడంపై ఆమె ఆసక్తి కనబరుస్తారు. పర్యావరణ పరిరక్షణలో న్యాయ వ్యవస్థ పాత్ర, కుటుంబ వివాదాల పరిష్కారంలోనూ ఆమె తనదైన ముద్ర వేసుకున్నారు. కాగా, జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ కర్ణాటక హైకోర్టు నుంచి 2018 నవంబర్ 8న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 2019 ఏప్రిల్ 3న తెలంగాణ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జూన్ 22న పూర్తికాలం ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆమె చేపట్టిన బాధ్యతలు.. 2017 ఆగస్టు 8 నుంచి పశ్చిమ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యుడీషియల్ సైన్సెస్‌కు సభ్యురాలుగా ఉన్నారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రచురించే న్యాయ దీప్ ఎడిటోరియల్ కమిటీ సభ్యురాలుగా 7.5.2019 నుంచి ఉన్నారు. ఢిల్లీ జ్యుడీషియల్ అకాడమీ కమిటీ చైర్‌పర్సన్‌గా 2020 మార్చి 11 నుంచి ఉన్నారు. ఢిల్లీ హైకోర్టు మిడిల్ ఇన్‌కం గ్రూప్ లీగల్ ఎయిడ్ సొసైటీ చైర్‌పర్సన్‌గా 2020 జూన్ 29 నుంచి ఉన్నారు. నేషనల్ లా యూనివర్సిటీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యురాలిగా 2020 జూన్ 30 నుంచి ఉన్నారు. బదిలీ అయిన ప్రధాన న్యాయమూర్తులు.. ప్రధాన న్యాయమూర్తి పేరు ప్రస్తుత హైకోర్టు బదిలీ స్థానం జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ తెలంగాణ ఉత్తరాఖండ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ఆంధ్రప్రదేశ్ సిక్కిం జస్టిస్ మహమ్మద్ రఫీఖ్ ఒడిశా మధ్యప్రదేశ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి సిక్కిం ఆంధ్రప్రదేశ్ సీజేలుగా పదోన్నతి పొందిన న్యాయమూర్తులు.. న్యాయమూర్తి పేరు ప్రస్తుత హైకోర్టు బదిలీ స్థానం జస్టిస్ హిమా కోహ్లి ఢిల్లీ తెలంగాణ జస్టిస్ ఎస్.మురళీధర్ పంజాబ్, హర్యానా ఒడిశా జస్టిస్ సంజీబ్ బెనర్జీ కోల్కత్తా మద్రాస్ జస్టిస్ పంకజ్ మిత్తల్ అలహాబాద్ జమ్ముకశ్మీర్ జస్టిస్ సుధాంశు ధులియా ఉత్తరాఖండ్ గౌహతి బదిలీ అయిన న్యాయమూర్తులు న్యాయమూర్తి పేరు ప్రస్తుత హైకోర్టు బదిలీ స్థానం జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి కోల్‌కతా ఆంధ్రప్రదేశ్ జస్టిస్ సంజయ్యాదవ్ మధ్యప్రదేశ్ అలహాబాద్ జస్టిస్ రాజేష్ బిందాల్ జమ్ము కశ్మీర్ కల్కత్తా జస్టిస్ వినీత్ కొఠారి మద్రాస్ గుజరాత్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ మధ్యప్రదేశ్ కర్ణాటక -
తెలంగాణ హైకోర్టు సీజేగా హిమ కోహ్లీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమ కోహ్లీ నియమితులయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న ఆమె పదోన్నతిపై తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహన్‌ను ఉత్తరాఖండ్‌కు బదిలీ చేయనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి మరో రెండు రోజుల్లో రాష్ట్రపతి కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. కాగా, నూతన న్యాయమూర్తుల నియామకాలపై కొలీజియం సోమవారం సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా హిమ కోహ్లీ నియమితులయ్యారు. ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మురళిధర్ నియమితులయ్యారు. ప్రస్తుతం హిమ కోహ్లీ ఢిల్లీ హైకోర్టులో జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె 1959 సెప్టెంబర్ 2న ఢిల్లీలో జన్మించారు. 1979 లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఆనర్స్ హిస్టరీలో గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి హిస్టరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని క్యాంపస్ లా సెంటర్లో ‘లా’ పూర్తి చేశారు. (చదవండి: ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోం) -
ఆ నలుగురే.. ఈ నలుగురు
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చరిత్రలో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. కళాశాలలో లా విద్యను అభ్యసించే రోజుల్లో క్లాస్మేట్స్గా ఉన్న నలుగురు విద్యార్థులు నేడు దేశ అత్యున్నత న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా నియమితులై సరికొత్త రికార్డును సృష్టించారు. ఈనెల 19న సుప్రీంకోర్టుకు కొత్తగా నలుగురు జడ్జీలు నియమితులైన విషయం తెలిసిందే. వీరిలో జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ ఎస్ఆర్ భట్, జస్టిస్‌వీ రామసుబ్రమణియన్, జస్టిస్ హృతికేశ్‌రాయ్‌లు ఉన్నారని న్యాయశాఖ ప్రకటించింది. వీరు త్వరలోనే ప్రమాణం చేయనున్నారు. అయితే ఎస్ఆర్ భట్, జస్టిస్ హృతికేశ్‌రాయ్‌లు.. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఉన్న డీవై చండ్రచూడ్, ఎస్కే కౌల్లు కాలేజీ నాటి స్నేహితులు. ఒకే ఏడాది లా పట్టా పుచ్చుకున్నారు. వీరి స్నేహ ప్రయాణం 37 ఏళ్ల నాటి నుంచి కొనసాగుతోంది. ఢిల్లీ యూనివర్సిటీలో వీరు నలుగురు 1982లో నుంచి ఒకే ఏడాది లా పరీక్షలో ఉత్తీర్ణులైనారు. వీరిలో డీవై చండ్రచూడ్, ఎస్కే కౌల్ ముందుగానే సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులు కాగా.. తాజాగా ఎస్ఆర్ భట్, జస్టిస్ హృతికేశ్‌రాయ్‌లకు కొంత ఆలస్యంగా ఈ అవకాశం దక్కింది. ఈ విషయాన్ని వీరి నలుగురికి కామన్ ఫ్రెండ్ అయిన శివరామ్ సింగ్ అనే వ్యక్తి ట్విటర్ ద్వారా సోషల్ మీడియాతో పంచుకున్నారు. ఈ పరిణామం చాలా అరుదైనదని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు యూనివర్సిటీ రోజుల్లో వీరంతా ముందే బెంచ్‌లోనే కూర్చునేవారని.. తాజాగా సుప్రీంకోర్టు బెంబ్‌లోనూ (న్యాయమూర్తులుగా) సీట్లు పంచుకోవడం సంతోషంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వీరిలో డీవై చండ్రచూడ్ 1959లో జన్మించగా.. 2000లో తొలిసారి ముంబై హైకోర్టు అడిషనల్ జడ్జ్‌గా నియమితులైనారు. ఆ తరువాత 2013లో ఆలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించి అనంతరం.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టాపొందిన జస్టిస్ ఎస్ఆర్ భట్ 1958లో జన్మించారు. 1982లో ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2004లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. జస్టిస్ హృతికేరాయ్ 1960లో జన్మించి.. 1980లో లా పట్టా పొందారు. 2006లో గుజరాత్ అడీషనల్ జడ్జ్‌గా నియమితులై.. 2008లో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం గౌహతి, కేరళ హైకోర్టులకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. 2018లో కేరళ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైయ్యారు. తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. జస్టిస్ సజయ్ కృష్ణకౌల్.. తొలుత ఢిల్లీ హైకోర్టులో అడీషనల్ జడ్జిగా నియమితులయ్యారు. అనంతరం పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. అక్కడి నుంచి 2013లో మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళ్లారు. 2017లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమింపబడ్డారు. దీంతో నాటి స్నేహితులు నేడు సుప్రీంకోర్టు బెంచ్‌కు ప్రాతినిథ్యం వహించనున్నారు. -
ఏప్రిల్ 27న సీజేఐపై పిల్ విచారణ
న్యూఢిల్లీ: కేసుల కేటాయింపులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుసరిస్తున్న రోస్టర్ విధానాన్ని సవాలు చేస్తూ న్యాయ శాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్ దాఖలు చేసిన పిల్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. శుక్రవారం పిల్‌ను ధర్మాసనం స్వీకరిస్తూ.. ఏప్రిల్ 27న విచారణ ప్రారంభిస్తామని తెలిపింది. ఈ పిల్ విచారణలో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, అదనపు సొలిసిటర్ జనరల్(ఏసీజే) తుషార్ మెహతాలు సాయం చేయాలని జస్టిస్ ఏకే సిక్రీ,, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం కోరింది. కేసుల కేటాయింపు బాధ్యతను సుప్రీంకోర్టులో ఐదుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కొలీజియంకు అప్పగించాలన్న ఆలోచనతో ఏకీభవించడం లేదని ధర్మాసనం పేర్కొంది. కేసుల కేటాయింపులో సీజేఐ తీరును నిరసిస్తూ ఈ ఏడాది జనవరి 12న సుప్రీంలో అత్యంత సీనియర్ న్యాయమూర్తులైన జస్టిస్ జే.చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ జోసెఫ్ కురియన్ల ప్రెస్ కాన్ఫరెన్స్ అంశాన్ని ప్రస్తావించేందుకు శాంతి భూషణ్ తరఫు న్యాయవాదులు ప్రయత్నించగా ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘మేం ఆ విషయంలోకి వెళ్లడం లేదు. కొన్ని స్పష్టమైన కారణాల నేపథ్యంలో ఆ విషయంపై మాకు ఎలాంటి ఆసక్తిలేదు. వాటిని ప్రస్తావించవద్దు’ అని స్పష్టం చేసింది. ‘కేసుల కేటాయింపు బాధ్యతను కొలీజియంకు అప్పగిస్తే.. ఆ పని కోసమే రోజూ లేక వారానికి రెండు మూడు సార్లు సమావేశం కావాల్సి ఉంటుంది. అది ఆచరణ సాధ్యమైన పరిష్కారం కాదు’ అని సుప్రీం పేర్కొంది. సీజేఐ మాస్టర్ ఆఫ్ రోస్టర్ అన్న విషయాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసిందని బెంచ్ తెలిపింది. సీజేఐ సమానుల్లో ప్రథముడని, కేసుల కేటాయింపు, అలాగే కేసుల విచారణకు బెంచ్‌ల ఏర్పాటులో ఆయనకు ప్రత్యేకాధికారాలు ఉన్నాయని ఏప్రిల్ 11న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించింది. పిల్లో ముఖ్య ప్రశ్నల్ని లేవనెత్తాం శాంతి భూషణ్ తరఫున న్యాయవాది దుష్యంత్ దవే వాదిస్తూ.. సీజేఐ అధికారాలకు సంబంధించిన నిబంధనల్ని పిల్లో లేవనెత్తారని, నియమాలకు విరుద్ధంగా సుప్రీంలో జరుగుతున్న వ్యవహారాల్ని అది ప్రశ్నిస్తోందన్నారు. నియమాలకు విరుద్ధంగా సీజేఐ తన అధికారాల్ని వినియోగిస్తున్నారని, తన నియమావళికి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ కట్టుబడి ఉండాలని అన్నారు. -
గోప్యత వీడిన కొలీజియం
పారదర్శకత, జవాబుదారీతనం కొరవడుతున్నాయన్న విమర్శలు ఎదుర్కొం టున్న కొలీజియం వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని ఎట్టకేలకు సర్వోన్నత న్యాయస్థానం సంకల్పించింది. న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో ఇన్నాళ్లూ అనుసరిస్తూ వస్తున్న గోప్యతకు ముగింపు పలకాలని నిర్ణయించి, కొత్తగా నియ మించిన తొమ్మిదిమంది న్యాయమూర్తుల ఎంపికకు, కొందరిని నిరాకరించడానికి గల కారణాలను వెల్లడించింది. న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించు కునే కొలీజియం వ్యవస్థ ఏర్పడి ఇరవై మూడేళ్లవుతోంది. ఇందులో ఏమాత్రం పారదర్శకత లేదని, ఎంపికవుతున్నవారికుంటున్న అర్హతలేమిటో, తిరస్కరణలకు గల కారణాలేమిటో తెలియడం లేదని పలువురు న్యాయకోవిదులు, ప్రజాస్వామిక వాదులు చాన్నాళ్లుగా విమర్శిస్తున్నారు. ప్రభుత్వాలు సరేసరి... వాటి మాట చెల్లు బాటు కావడం లేదు గనుక సహజంగానే గుర్రుగా ఉంటున్నాయి. ఈ విధానాన్ని మార్చాలని గతంలో యూపీఏ ప్రభుత్వం కొంతవరకూ ప్రయత్నించింది. కానీ ఈలోగానే దాని పదవీకాలం ముగిసిపోయింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఈ విష యంలో చాలా పట్టుదలతో ప్రయత్నించింది. జాతీయ న్యాయ నియామకాల కమి షన్(ఎన్‌జేఏసీ) చట్టం అమల్లోకి తెచ్చింది. అందుకోసం 99వ రాజ్యాంగ సవర ణను కూడా తెచ్చింది. అయితే 2015 అక్టోబర్‌లో ఆ రెండింటినీ మెజారిటీ తీర్పుతో సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అనంతరకాలంలో న్యాయమూర్తుల నియామకాలు జరగకపోలేదుగానీ... అవి గతంలోవలే చురుగ్గా లేవు. ఈ విషయంలో కొలీజియం చేసిన అనేక సిఫార్సులు గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ పడ్డాయి. వివిధ హైకోర్టుల్లో దాదాపు 400 న్యాయమూర్తుల పదవులు భర్తీకావాల్సి ఉంది. అపరిష్కృత కేసుల సంఖ్య పెరుగుతుండగా ఎన్నాళ్లిలా న్యాయమూర్తుల నియామకాలపై సాచివేత ధోరణి అనుసరిస్తారని గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ టీఎస్ ఠాకూర్ పలు సందర్భాల్లో కేంద్రాన్ని ప్రశ్నించారు. ఒక సందర్భంలో ఆయన కంటతడి కూడా పెట్టారు. న్యాయవ్యవస్థతో ఘర్షణ తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనంటూ వ్యాఖ్యానాలు చేశారు. ఎన్నిచేసినా పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. కొలీజియం వ్యవస్థపై దేశంలో మొదటినుంచీ భిన్నా భిప్రాయాలున్నాయి. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వాల మాట చెల్లుబాటు కావడం ప్రారంభమైతే అది న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బ తీస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసినవారితోపాటు పలు వురు న్యాయవేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాల ప్రమేయంలేని నియామకాల ద్వారా వచ్చిన న్యాయమూర్తులైతే నిష్పాక్షికంగా, తటస్థంగా వ్యవహరిస్తారని వాదించారు. ప్రభుత్వాల ప్రమేయం సంగతలా ఉంచి ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థలూ నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పాటిస్తుంటే ఒక్క న్యాయవ్యవస్థ మాత్రమే తనను తాను ఎందుకు మినహాయించుకోవాలని కొలీ జియం విమర్శకుల ప్రశ్న. ఎవరిదాకానో ఎందుకు... కొలీజియం వ్యవస్థకు ఆద్యు డైన జస్టిస్ జేఎస్ వర్మే అనంతరకాలంలో తన నేతృత్వంలోని ధర్మాసనం ఉద్దేశిం చింది ఒకటైతే, జరుగుతున్నది మరొకటని వ్యాఖ్యానించిన సంగతి మర్చి పోకూడదు. కొలీజియం లోపాలు వెలుగులోకి తెచ్చిన ఘనత జస్టిస్ చలమేశ్వర్కే దక్కు తుంది. ఎన్‌జేఏసీ చట్టాన్ని, రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడు మెజారిటీ తీర్పుతో విభేదిస్తూ తీర్పునిచ్చినవారు జస్టిస్ చలమేశ్వర్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నలుగురు న్యాయమూర్తులుండే కొలీజియంలో ఆయన సభ్యులు కూడా. కొలీజియం తీరుతెన్నుల పట్ల అసంతృప్తి వ్యక్తంచేసి, దాని సమా వేశాలకు హాజరుకాబోనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆయన నిరుడు సెప్టెంబర్‌లో లేఖ రాశాక ఆ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. కొలీజియం పనితీరులో పారదర్శకత కొరవడుతున్నదని, మినిట్స్ లేకపోవడంవల్ల భేటీలకు అర్ధం లేకుండా పోతున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. నిజానికి ఆయన చెప్పే వరకూ న్యాయమూర్తుల నియామకాలు, బదిలీల ప్రక్రియకు సంబంధించి రికార్డు ఉండదన్న సంగతి ఎవరికీ తెలియదు. ఇటీవల కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయంత్ పటేల్ తన పదవికి రాజీనామా చేశాక కూడా కొలీజియంపై విమర్శ లొచ్చాయి. అదే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి కావాల్సి ఉండగా ఆయన్ను ‘ప్రభుత్వ ప్రమేయం’తో అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారని ఆరోపిస్తూ కర్ణా టక, గుజరాత్, ఢిల్లీ హైకోర్టుల్లో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. బహుశా కొలీజియం నిర్ణయాలను, అందుకు గల కారణాలను బహిరంగపర్చాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఈ నిరసనల పర్యవసానంగానే భావించి ఉంటారు. కేరళ హైకోర్టుకు ముగ్గుర్ని, మద్రాస్ హైకోర్టుకు ఆరుగురిని న్యాయ మూర్తులుగా నియమిస్తూ తీసుకున్న నిర్ణయాలను, అందుకు అనుసరించిన విధా నాన్ని సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో పొందుపరిచింది. ఎవరెవరిని ఎందుకు కాదన వలసివచ్చిందో కూడా వివరించింది. ఆ రెండు రాష్ట్రాల హైకోర్టుల నుంచి వచ్చిన సిఫార్సులపై ఆ న్యాయస్థానాల్లో పనిచేసి ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తు లుగా ఉంటున్నవారి అభిప్రాయాలను కొలీజియం తెలుసుకున్నదని, వాటి ఆధా రంగా నిర్ణయానికొచ్చిందని తెలిపింది. అయితే తిరస్కృతులపై వచ్చిన ఫిర్యాదులే మిటి... కొందరిపై ఏ ప్రాతిపదికన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రతికూల అభి ప్రాయాన్ని వ్యక్తం చేశారు... జాబితాలోనివారిపై ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన నివే దికల్లోని అంశాలేమిటన్న జోలికిపోలేదు. ఆమేరకు ఇది అసంపూర్ణమనే చెప్పాలి. మొత్తానికి కొలీజియం పనితీరులో పారదర్శకత తీసుకొచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం ప్రయత్నించినందుకు స్వాగతించాలి. ఇది సాధ్యమయ్యేందుకు దోహదపడిన జస్టిస్ చలమేశ్వర్నూ, న్యాయవాదులనూ అభినందించాలి. -
'కొలీజియంలో మార్పులొద్దు'
-
కొలీజియంలో మార్పులొద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామకాల కోసం నూతన వ్యవస్థ అవసరం లేదని గతంలోనే తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు.. మరోసారి కొలీజియం విధానాన్ని పరిపూర్ణంగా సమర్థించింది. ప్రస్తుతం అమలవుతున్న కొలీజయం వ్యవస్థ లోపభూయిష్టంగా మారిందని, దానిలో మార్పుచేర్పులు అవసరమన్న కేంద్ర ప్రభుత్వం సూచనలను సుప్రీంకోర్టు నిర్ద్వందంగా తిరస్కరించింది. ఈ మేరకు మంగళవారం తన అభిప్రాయాన్ని వెలువరించిన కోర్టు.. కొలీజియం వ్యవస్థను సమూలంగా మార్చాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. గడిచిన 23 ఏళ్లుగా కొనసాగుతున్న కొలీజియం వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ) వివాదాస్పదంగా మారడం, ఎన్‌జేఏసీపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఆ విధానం రాజ్యాంగ విరుద్ధమంటూ తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. తీర్పు సమయంలో కొలీజియం వ్యవస్థలో మార్పులకు సూత్రప్రాయంగా అగీకారం తెలిపినట్లు కనిపించినప్పటికీ, కేంద్రం పంపిన సూచనలేవీ సకారాత్మకంగా లేకపోవడంతో వాటిని సుప్రీం తిరస్కరించి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.