సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా విషయమై పార్లమెంటు వేదికగా కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు చేసిన ప్రకటన ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన పంపలేదని కేంద్రమంత్రి ప్రకటించారని, వాస్తవానికి సీఎం కేసీఆర్‌తోపాటు గతంలో నీటిపారుదల శాఖ మంత్రి హోదాలో తాను అనేకమార్లు ప్రధాని మోదీ, జలశక్తి శాఖ మంత్రికి ఈ విషయమై వినతిపత్రాలు ఇచ్చామని గుర్తుచేశారు. వాస్తవాలను దాచిపెట్టి పార్లమెంటు వేదికగా కేంద్రమంత్రి చేసిన ప్రకటన సభతోపాటు ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందన్నారు.
గతంలో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి సమరి్పంచిన వినతిపత్రాలు, లేఖలను హరీశ్‌రావు శుక్రవారం ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజక్టుకు సీడబ్ల్యూసీ అన్ని రకాల అనుమతులు ఇచి్చందని, కేంద్ర జలశక్తి శాఖకు చెందిన సాంకేతిక సలహా కమిటీ అనుమతులు కూడా లభించాయని తెలిపారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేసినా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశంపై 2018లో టీఆర్‌ఎస్ ఎంపీలు వేసిన ప్రశ్నలకు నాటి జలశక్తి మంత్రి నితిన్ గడ్కరీ స్పందిస్తూ సమీప భవిష్యత్తులో ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇచ్చే ఆలోచన కేంద్రానికి లేదని చెప్పారన్నారు. అయితే ఈ ప్రకటనకు విరుద్ధంగా బీజేపీ పాలిత రాష్ట్రాలైన కర్ణాటకలోని అప్పర్‌భద్ర, మధ్యప్రదేశ్‌లోని కెన్ బెట్వా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తూ, కాళేశ్వరంపై తెలంగాణ ప్రతిపాదనను కేంద్రం పక్కన పెట్టిందని పేర్కొన్నారు. కేడబ్లు్యడీటీ–2 కేటాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న సమయంలోనే అప్పర్భద్ర ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతులు ఇచి్చందని, అన్నిరకాల అనుమతులు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును విస్మరించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment