హైదరాబాద్: మణిపూర్ అఘాయిత్యంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పందిస్తూ.. ఆవేదన వ్యక్తం చేశారు. అనాగరికమన్న ఆయన.. కేంద్రం మౌనంగా చూస్తోందంటూ మండిపడ్డారు.
‘‘తాలిబన్ లు పిల్లలను, మహిళలను అగౌరవపరుస్తున్నప్పుడు భారతీయులమైన మనము వారిపై విరుచుకుపడుతున్నాము. అలాంటిది, ఇప్పుడు మనదేశంలోనే మణిపూర్ లో కుకీ తెగ స్త్రీలను మైతీలు నగ్నంగా ఊరేగించి లైంగిక వేధింపులకు గురిచేయడం బాధాకరం. కొత్త భారతదేశంలో అనాగరిక చర్యలు విచారకరం. ఈ భయానక హింసాకాండ, శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతినడాన్ని కేంద్రం మౌనంగా చూస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీ.. అమిత్‌షా జీ ఎక్కడ ఉన్నారు? దయచేసి అన్నింటినీ పక్కన పెట్టండి. మీ సమయాన్ని, శక్తిని మణిపూర్‌ను రక్షించడం కోసం వినియోగించండి
అన్ని పార్టీలు కలసి రావాలి
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ హింసపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించేలా చేస్తుందని చెప్పారు. దారుణమైన వేధింపులకు పాల్పడిన వారిని చట్ట ప్రకారం వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. మణిపూర్ ప్రజలకు అన్ని పార్టీలు మద్దతుగా నిలబడాలని ఈ సందర్భంగా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: మణిపూర్ వీడియోపై సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment