సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు మూడో విడత పన్నుల వాటాను సోమ వారం విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలకు కలిపి మొత్తంగా రూ.1,18,280 కోట్ల మేర నిధులను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇందులో తెలంగాణకు రూ.2,486 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,787 కోట్ల నిధు లను విడుదల చేసింది.
రాష్ట్రాలు తమ మూలధనం, అభివృద్ధి వ్యయాలను వేగవంతం చేసేందుకు, ప్రాధాన్యతా ప్రాజెక్టులకు నిధులు అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా ఈ నిధులను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.
చదవండి: అలర్ట్: ప్రపంచంలో టాప్–20 వాయు కాలుష్య పట్టణాల్లో 14 భారత్‌లోనే..
Comments
Please login to add a commentAdd a comment