నస్పూర్లో ఓటరుగా పవన్ కల్యాణ్! | Fake voter id card photo in actor Pavan kalyan | Sakshi
Sakshi News home page

నస్పూర్లో ఓటరుగా పవన్ కల్యాణ్!

Published Mon, Dec 9 2013 8:18 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 AM

నస్పూర్లో ఓటరుగా పవన్ కల్యాణ్!

నస్పూర్లో ఓటరుగా పవన్ కల్యాణ్!

శ్రీరాంపూర్ : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ను కలవాలనుకుంటున్నారా? అయితే ఆదిలాబాద్ జిల్లా వెళ్లాల్సిందే. ఓటర్ల జాబితాల్లో కొత్తిమీరకు, కుక్కపిల్లకు, ఐశ్యర్య రాయ్కు చోటు దక్కిన విషయం తెలిసిందే. తాజాగా సినీనటుడు పవన్ కల్యాణ్ పేరుతో శ్రీరాంపూర్ మండలం నస్పూర్ పంచాయతీ ఓటరు జాబితాలో 'పవర్ స్టార్' ఫోటో ప్రచురితమైంది. పంచాయతీ పరిధిలోని నస్పూర్ కాలనీలో దేవి లచ్చయ్య ఓటరుగా ఉన్నాడు. ఆ జాబితాలో ఆయన ఫోటో ఉండాల్సిన స్థానంలో పవన్ ఫోటో ఉంది. మిగతా వివరాలన్నీ లచ్చయ్యవే. నస్పూర్ కార్యాలయంలో సిబ్బంది జాబితా పరిశీలిస్తుండగా ఈ విడ్డూరం వెలుగులోకి వచ్చింది.

ఇక ఇటీవలే  కేంద్రమంత్రి చిరంజీవి తనయుడు, సినీనటుడు రాంచరణ్ తేజను ధర్మవరం ఓటరుగా నమోదు చేయాలంటూ  27939854 ఐడీ నెంబర్‌తో చేసిన దరఖాస్తులో పేరు చరణ్, ఇంటిపేరు బండి, వయసు 53 ఏళ్లు, పుట్టిన తేదీ 8-6-1960, తండ్రి పేరు చిరు అని, పట్టణంలోని రాంనగర్‌లోని డోర్‌నెంబర్ 8-168ఎ ఇంట్లో నివసిస్తున్నట్లు పేర్కొన్నారు. రాంచరణ్ నటించిన మగధీర సినిమాలోని ఫొటోను జత చేశారు. అధికారులు ఈ విషయాన్ని ఆర్డీఓ దృష్టికి తీసుకు వెళ్లారు. ఇలాంటి విచిత్రాలు ఇటీవలి కాలంలో చాలానే చోటు చేసుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement