తెలంగాణలో ఆ నలుగురే!
ఎన్‌ఆర్‌ఐలు ఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలి: భన్వర్‌లాల్
ప్రగతినగర్: తెలంగాణలో నలుగురు ఎన్‌ఆర్‌ఐలు మాత్రమే ఓటరు కార్డుకు ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేసుకున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఓటరుకు ఆధార్ అనుసంధానంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన సందర్భంగా శనివారం ఇక్కడ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక్కడి యంత్రాంగా న్ని, సహకరించిన పార్టీల నాయకులను అభినందించారు. తెలంగాణలోని పది జిల్లాలలో నలుగురు ఎన్‌ఆర్‌ఐలు మాత్రమే ఓటరుకు ఆధార్‌తో అనుసందానం చేయించుకున్నారని, నిజామాబాద్ జిల్లాలోనే నాలుగు లక్షల మంది ఎన్‌ఆర్‌ఐలు ఉన్నారన్నారు.
ఎన్‌ఆర్‌ఐలు ఈ-రిజిస్ట్రేషన్ ద్వారా వారి ఓటరు కార్డు పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు నంబర్ సంబంధిత బీఎల్‌ఓకు పంపిస్తే, ఇక్కడ విచార ణ జరిపి వారి ఓటరు నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేస్తారన్నారు. తద్వారా రాబోయే ఎన్నికల్లో ఎన్‌ఆర్‌ఐలు తమ ఓటు హక్కును ‘ఆన్‌లైన్’ ద్వారా ఉపయోగించుకోవచ్చని తెలిపారు.