Billionaire to Monk: సాధారణంగా ఎవరైనా కడు పేదరికం నుంచి సంపన్న జీవితం గడపాలని కలలు కంటారు. సంపన్న జీవితం వదిలి సన్యాసిగా బతకాలని మాత్రం ఎవరూ అనుకోరు. అలాంటి వారు ఎవరైనా ఉన్నారంటే వారిని వేళ్ళమీద లెక్కపెట్టేయొచ్చు. 'భన్వర్‌లాల్ రఘునాథ్ దోషి' (Bhanwarlal Raghunath Doshi) ఈ కోవలోకే వస్తాడు. ఆయన గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, రాజస్థాన్‌లో చిన్న వస్త్ర వ్యాపారి అయిన తన తండ్రి నుంచి రూ.30,000 తీసుకుని ప్లాస్టిక్ వ్యాపారం ప్రారంభించాడు భన్వర్‌లాల్. కొన్ని సంవత్సరాలలోనే వ్యాపారంలో గణనీయమైన వృద్ధి సాధిస్తూ ఢిల్లీ కింగ్‌గా పేరుతెచ్చుకున్నాడు. క్రమంగా ఎంతో నేర్పుతో తన వ్యాపారాన్ని రూ. 600 కోట్లకు విస్తరించాడు.
(ఇదీ చదవండి: 11 ఏళ్లకే హల్దిరామ్స్ ఆలోచన.. ప్రపంచ స్నాక్స్ రంగాన్నే షేక్ చేసిన ఇండియన్!)
జైన మతాన్ని స్వీకరించాలని, మత బోధకుడిగా మారాలనే కోరికతో కోట్ల సామ్రాజ్యం త్యజించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయం తెలిసి ఎంతో మంది ఆశ్చర్యపోయారు. అనుకున్న విధంగానే అహ్మదాబాద్‌లో జరిగిన భారీ వేడుకలో, లక్షలాది మంది ప్రజల సమక్షంలో దోషి జైన్ ఆచార్య శ్రీ గుణరత్న సురిష్వరాజ్ జీ మహారాజ్ నుంచి శిష్యరికం పొందాడు. ఈ వేడుకకు హాజరైన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ దోషిని సత్కరించారు.
(ఇదీ చదవండి: బైక్‌కు గుడి కట్టించి పూజలు - సినిమాను తలపించే ఇంట్రెస్టింగ్ స్టోరీ!)
ఎప్పటినుంచో సన్యాసి కావాలని అనుకుంటున్న దోషి.. కుటుంబం, వ్యాపార లావాదేవీల వల్ల 1982లో తన ఆలోచనను తాత్కాలికంగా వాయిదా వేశాడు. అనుకున్నది సాధించిన తర్వాత జైన మతం స్వీకరించారు. ఈ వేడుక 3.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎంతో వైభవంగా జరిగింది. మొత్తానికి కోట్లు వదులుకుని జైన మతాన్ని స్వీకరించి ఎంతోమందికి ఆదర్శనీయుడయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment