భన్వర్‌లాల్‌పై టీడీపీ ఫిర్యాదు | TDP complaint on Bhanwarlal | Sakshi
Sakshi News home page

భన్వర్‌లాల్‌పై టీడీపీ ఫిర్యాదు

Published Tue, Aug 22 2017 1:18 AM | Last Updated on Fri, Oct 19 2018 8:10 PM

TDP complaint on Bhanwarlal

సర్వేలను నిషేధించడం నిబంధనలకు విరుద్ధమని వాదన
 
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ ఎంపీలు రామ్మోహన్‌ నాయుడు, నిమ్మల కిష్టప్ప, మాల్యాద్రి శ్రీరామ్‌ సోమవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్‌ అచల్‌కుమార్‌ జ్యోతితో సమావేశమై.. నంద్యాల ఉపఎన్నికలో భన్వర్‌లాల్‌ పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న ఫిర్యాదులపై వేగంగా స్పందిస్తున్న భన్వర్‌లాల్‌.. తాము చేసే ఫిర్యాదులను అసలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ డీఎస్పీపై ప్రతిపక్ష పార్టీ ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌.. ఆయన్ను బదిలీ చేసిందని పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రిపై విపక్ష నేత చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదన్నారు. సర్వేలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారని, ఇది నిబంధనలకు విరుద్ధమన్నారు. ఉప ఎన్నికపై సాక్షి దినపత్రిక, చానల్‌లో వస్తున్న కథనాలను పెయిడ్‌ ఆర్టికల్స్‌గా పరిగణించాలన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement