
పానకాల స్వామిని దర్శించుకున్న భన్వర్‌లాల్
మంగళగిరి: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ గుంటూరు జిల్లా మంగళగిరిలోని పానకాల నర్సింహాస్వామిని దర్శించుకున్నారు. మంగళవారం మంగళగిరి చేరుకున్న ఆయన స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పూర్ణకుంభంతో భన్వర్‌లాల్‌కు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు డీఆర్‌వో, ఆర్డీవో, ఎమ్మార్వోలు పాల్గొన్నారు.